Switch to English

గ్రేటర్‌ ఫైట్‌: వైసీపీని కెలికిన రఘునందన్‌.. కారణమిదేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకుపై కన్నేశారో ఏమోగానీ, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తన తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ‘పావురాలగుట్ట – పావురం’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారానికి కారణమయ్యాయి.

ఛాన్స్‌ దొరికిందే తడవుడగా వైసీపీ శ్రేణులు, బీజేపీపైనా.. రఘునందన్‌పైనా సోషల్‌ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నాయి. బహుశా ఇదంతా రఘునందన్‌ మార్క్‌ రాజకీయ వ్యూహంలో భాగంగా తెరపైకొచ్చినవే కావొచ్చు. టీఆర్‌ఎస్‌ – వైసీపీ మధ్య ‘రాజకీయ అవగాహన’ వుందన్నది నిర్వివాదాంశం. ఆ విషయాన్ని హైలైట్‌ చేయాలంటే గ్రేటర్‌ ఎన్నికల వేదికగా వైసీపీని ఇలా గిల్లి అలా వదిలెయ్యాలి.. తద్వారా వైసీపీ, బీజేపీకి ఎదురు తిరుగుతుంది.. టీఆర్‌ఎస్‌ పట్ల వైసీపీ ప్రేమ కూడా తెరపైకొస్తుంది. ఇక్కడ బీజేపీ నేత రఘునందన్‌ వ్యూహం బాగానే పనిచేసినట్లుంది.

వైసీపీ శ్రేణులు, టీఆర్‌ఎస్‌కి సోషల్‌ మీడియా వేదికగా మద్దతు ప్రకటించేస్తున్నారు. అది ఆటోమేటిక్‌గా బీజేపీకి ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కలిసొచ్చే అవకాశం వుంది. గ్రేటర్‌ ఎన్నికల తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు జరగాల్సి వుంది.. తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక కూడా జరగాల్సి వుంది.

2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, వైసీపీకి ఆంధ్రప్రదేశ్‌లో తెరవెనుక సహాయ సహకారాలు అందించింది. గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా కూడా వైసీపీ నేతలు, తెరవెనుకాల టీఆర్‌ఎస్‌కి సహకరిస్తున్నారు. వైసీపీ వాహనాలకు టీఆర్‌ఎస్‌ రంగులేసి మరీ, గ్రేటర్‌ ఎన్నికల్లో తిప్పుతోన్న విషయం విదితమే. కొందరైతే, టీఆర్‌ఎస్‌ నేతలకు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే, వైసీపీని ప్రసన్నం చేసుకుంటే కాస్తో కూస్తో బీజేపీకి అడ్వాంటేజ్‌ వుంటుందిగానీ, వైసీపీని కెలికితే లాభమేంటి.? అన్న ప్రశ్న కూడా కొందరు రాజకీయ విశ్లేషకుల నుంచి విన్పిస్తోంది. ఏదిఏమైనా, ఇటీవలి దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత రఘునందన్‌ ఇమేజ్‌ బీజేపీలో పెరిగిపోయింది. రాజకీయ వ్యూహాల్లో ఆయన దిట్ట. ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయన పరపతి బీజేపీలో మరింత పెరిగింది కూడా. ఆ పెరిగిన పరపతితోనే, మరింత పదునైన వ్యూహాల్ని రఘునందన్‌ రచిస్తున్నట్లున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...