Switch to English

రాజుగారి ‘రక్త’ చరిత్ర.. ‘రక్తం’ తాగిన వైసీపీ నేతలెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా రక్తం తాగారు’ అంటూ సొంత పార్టీపై నిప్పులు చెరిగారు. ‘ఇంతకీ మీ రక్తం తాగిందెవరు.?’ అని మీడియా ప్రశ్నిస్తే, ‘పార్టీ తాగింది.. పార్టీ నేతలు తాగారు.. నా రక్తం నాకు తిరిగిచ్చేస్తే.. అప్పుడు రాజీనామా గురించి ఆలోచిస్తాను..’ అంటూ రఘురామ తనదైన స్టయిల్లో సమాధానమిచ్చారు. ఇంతకీ, ఇక్కడ ‘రక్తం’ అంటే నిజమైన రక్తమేనా.? లేదంటే, ‘ఎన్నికల కోసం చేసిన ఖర్చు’ అనుకోవాలా.? 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అడ్డగోలుగా ఖర్చు చేసిందనే విమర్శలున్నాయి. ఓట్ల కోసం కరెన్సీ నోట్లను విచ్చలవిడిగా వైసీపీ నేతలు ఖర్చు చేశారంటూ ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూనే వుంది.

ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో, అందునా నర్సాపురం నియోజకవర్గంలో కనీ వినీ ఎరుగని స్థాయిలో ‘ఎన్నికల ఖర్చు’ అనధికారికంగా జరిగిందన్నది చాలామంది వాదన. రఘురామరాజుని వైసీపీలోకి లాక్కొంచిందే, ఆ ‘ఖర్చు’ కోసం అనీ, అలా ఆయన సొమ్ములతో గెలిచిన వైసీపీ, ఇప్పుడాయన్ని ఇంతలా వేధిస్తుండడాన్ని జీర్ణించుకోలేకనే.. రఘురామకృష్ణరాజు గుస్సా అవుతున్నారనీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోపక్క, గతంలో గోదావరి పుష్కరాల్లో మునిగిన వైఎస్‌ జగన్‌, ఆ మునక చిత్తశుద్ధితో చేసిందే అయితే, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్ళినప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేయాలని సవాల్‌ విసిరారు.‘సంతకం చేసే ధైర్యం లేదా.?’ అని నిలదీశారు.

కాగా, ‘నేను ఎక్కడికి వెళతానంటే అక్కడే చంపేస్తామని మా పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు. అలాంటి వారికి, తనకు సెక్యూరిటీ వుందనే విషయాన్ని మాత్రమే గుర్తు చేస్తున్నాను.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. రాష్ట్రమంతటా తిరుగుతాను..’ అంటూ తేల్చి చెప్పారు రఘురామకృష్ణరాజు. ‘నా బాగోతం బయటపెడతామని కొందరంటున్నారు.. ఈ క్రమంలో వాళ్ళ బాగోతాలే బయటపడ్తాయ్‌..’ అని ఎద్దేవా చేసిన రఘురామకృష్ణరాజు, న్యాయ వ్యవస్థపై వ్యూహాత్మక కుట్ర జరుగుతోందని, దీన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని పిలుపునిచ్చారు. ‘కేవలం ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ కారణంగానే ప్రజలు హాయిగా జీవించగలుగుతున్నారు. అది ఇష్టం లేక, న్యాయవ్యవస్థపై మా పార్టీ నేతలు దాడికి దిగుతున్నారు..’ అని ఆరోపించారు రఘురామకృష్ణరాజు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

రాజకీయం

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఎక్కువ చదివినవి

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...