Switch to English

విస్తరణకు వేళాయే.. కేంద్రంలో అమాత్యయోగం ఎవరికో?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు వేళయింది. ఆగస్టు 15వ తేదీలోపే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కసరత్తు పూర్తిచేసి ప్రధాని మోదీకి అందజేసినట్టు సమాచారం. గతనెలలో ఆర్ఎస్ఎస్ నేత కృష్ణ గోపాల్.. నడ్డాతోపాటు ప్రధాని మోదీని కలిశారు. దీంతో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. కేబినెట్ విస్తరణకు సంబంధించి చర్చించేందుకే ఆ భేటీలు సాగినట్టు వార్తలొచ్చాయి.

నిజానికి కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే ఈ పాటికే మంత్రిమండలి విస్తరణ జరిగి ఉండేది. నిబంధనల ప్రకారం కేంద్రంలో 81 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే, జంబో కేబినెట్ వద్దనుకున్న మోదీ.. 57 మందితో సరిపెట్టారు. ఇది గత ఎన్డీఏ కేబినెట్ కంటే 13 మంది తక్కువ. అయితే, ప్రస్తుత ఎన్డీఏ సర్కారుకు ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో కేబినెట్ విస్తరించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. అయితే పూర్తి స్థాయి జంబో కేబినెట్ కాకుండా గత ఎన్డీఏ ప్రభుత్వం తరహాలోనే కేబినెట్ ఉండే అవకాశం ఉంది.

మరో పది లేదా 12 మందికి మాత్రమే అవకాశం వస్తుందని అంటున్నారు. ఇందులో ప్రధానంగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారును కూల్చి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు అమాత్య పదవి ఖాయమని చెబుతున్నారు. ఇటీవలే ఆయన్ను రాజ్యసభకు పంపించింది అందుకే అని అంటున్నారు. అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యులు భూపేంద్ర యాదవ్, అనిల్ జైన్, అనిల్ బాలుని పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇక త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జనతాదళ్ కు ఓ పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి.

నిజానికి యూపీఏ హయాంతో పోలిస్తే ఎన్డీఏ హయాంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలో పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. తెలంగాణ నుంచి కేవలం కిషన్ రెడ్డి ఒక్కరికే మంత్రి పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు ప్రాతినిధ్యమే లేదు. తెలుగు రాష్ట్రాల్లో బలం పుంజుకోవాలని భావిస్తున్న కమలనాథులు ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఒకరిద్దరికి అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాష్ట్రం నుంచి మరో పదవి ఇవ్వాలనుకుంటే బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లలో ఒకరికి ఛాన్స్ రావొచ్చని సమాచారం.

ఇక ఏపీ నుంచి ప్రస్తుతం ఒక్కరు కూడా కేంద్ర కేబినెట్ లో లేరు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి రాంమాధవ్ కు అవకాశం లభించొచ్చని అంటున్నారు. అలాగే దగ్గుబాటి పురంధేశ్వరిని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వీరిలో ఎవరికి అవకాశం ఇచ్చినా ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదంతా ఎందుకు అనుకుంటే టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన సుజనా లేదా సీఎం రమేశ్ లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి మరో వారం రోజుల్లోనే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గం ఒకరు లేదా ఇద్దరిని తప్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...