Switch to English

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: మాళవిక నాయర్ – విజయ్ దేవరకొండలో ఆ గర్వం కనిపించదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత కళ్యాణ వైభోగమే, మహానటి, టాక్సీవాలా, విజేత సినిమాలతో మెప్పించిన హీరోయిన్ మాళవిక నాయర్. రాజ్ తరుణ్ సరసన తను నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ లాక్ డౌన్ సమయంలో ఎలా టైం స్పెండ్ చేసింది, కొత్తగా ఏం నేర్చుకుంది అనే పలు విషయాలు గురించి మా ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. ఆ విశేషాలు..

లాక్ డౌన్ టైంలో ఎక్కడ ఉన్నారు? ఈ కోవిడ్ పాండెమిక్ వలన ఏం నేర్చుకున్నారు?

హైదరాబాద్ లోనే ఉన్నాను, ఇక్కడే నా మాస్టర్స్ చేస్తున్నా, అలాగే మూవీస్ కూడా.. ఇప్పుడు నా హోమ్ టౌన్ హైదరాబాద్. ఏం నేర్చుకున్నాను అంటే చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా నాలుగు నెలలు సమయం ఇలా ఖాళీగా ఉండడం కూడా చాలా కష్టం అనిపించిది. ప్రెజెంట్ జెనరేషన్ తో పాటు కొన్ని గోల్స్ పెట్టుకొని, దాన్ని అచీవ్ అవ్వడానికి నేను కూడా కాలంతో పాటు పరిగెడుతున్నాను. కానీ ఇప్పుడు అన్నీ ఆగిపోయాయి. సడన్ గా స్లో అయిపోవడం మొదట్లో ఇప్పుడెలా, ప్లాన్స్ అన్నీ ఏమైపోతాయి అనే టెన్షన్ ఉంది. కానీ కొన్ని సార్లు ఇలా స్లో అవ్వడం కూడా మంచిదే.. దీని వలన నా గురించి తెలుసుకోవడానికి, ఇంకా బెటర్ పర్సన్ అవ్వడానికి హెల్ప్ అయ్యింది. నాకు నేను ఈ టైంని బాగా ఎంజాయ్ చేస్తున్నాను.

చాలా సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకోవడానికి గల కారణం?

(నవ్వులు).. నా పరంగా నేను చేసే ప్రాజెక్ట్స్ విషయంలో ఎందుకు సెలక్టివ్ గా ఉండకూడదు అనుకుంటాను.. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ కోసం 3 లేదా 4 నెలలు సమయం వెచ్చిస్తాం. ఆ సమయానికి ఒక విలువ ఉండాలి కదా.. అలాంటప్పుడు నేను చేసే పాత్ర నాకు నచ్చితేనే చేయడంలో తప్పేముంది.

ఒకవేళ నటి కాకపోయి ఉంటే, వేరే ఏ ప్రొఫెషన్ ని సెలెక్ట్ చేసుకునే వారు?

లిస్ట్ చాలా పెద్దదే ఉంది.. ఎక్కువ భాగం.. ఒక ప్రొఫెసర్ అయ్యుండచ్చు. లేదా రీసెర్చ్ డిపార్ట్మెంట్, రైటర్, పెయింటర్ ఇలా చాలానే ఉన్నాయి. చెప్పాలంటే నేను నటిగా బిజీగా ఉంటూనే వీటిలో కొన్ని వర్క్స్ చేస్తుంటాను.

ఒరేయ్ బుజ్జిగా రిపోర్ట్స్ బాగున్నాయి. ఇదొక ట్రైయాంగిల్ లవ్ స్టోరీనా?

మీరు గుడ్ రిపోర్ట్స్ వినడం ఆనందంగా ఉంది.. కచ్చితంగా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అయితేకాదు. కానీ ఒరేయ్ బుజ్జిగా కంప్లీట్ ఎంటర్టైనర్.

కోవిడ్ పాండెమిక్ వలన థియేటర్స్ ఓపెన్ అవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. కావునా ఒరేయ్ బుజ్జిగా ఓటిటి లో రిలీజ్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా?

ఇది చెప్పడానికి నేను కరెక్ట్ పర్సన్ కాదు.. దీనిపై నిర్ణయం నిర్మాతలదే..

ఒరేయ్ బుజ్జిగా పోస్టర్స్ లో మిమ్మల్ని ఓ రౌడీ బేబీలా చూపించారు. మీరు ఇప్పటి వరకూ చేసిన పాత్రలతో పోల్చుకుంటే ఈ పాత్రలో ఉన్న కొత్తదనం ఏమిటి?

చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఎక్కువగా నన్ను బెస్ట్ బడ్డీ, సైలెంట్ గా ఉండే పాత్రల్లో ఎక్కువగా చూసారు. కానీ ఇదొక ఫన్ ఎంటర్టైనర్. నేను ఫన్ చేయాల్సిన సీన్స్ ఎక్కువ ఉన్నాయి. కామెడీ టైమింగ్ నాకు చాలా కొత్తగా అనిపించింది. ఒరేయ్ బుజ్జిగా అనేది ఒక ప్యూర్ ఫన్ రైడ్.

విజయ్ కుమార్ కొండ తో పనిచేయడం ఎలా ఉంది?

నేను పని చేసిన డైరెక్టర్స్ లో మోస్ట్ రిలాక్స్డ్ డైరెక్టర్ విజయ్ గారు. చాలా కూల్ గా, చాలా క్లారిటీగా పని చేస్తారు. తన ఎడిట్ పాటర్న్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ ఒక్క షాట్ కూడా ఎక్కువ తీసుకోరు. సీన్స్ అండ్ డైలాగ్స్ గురించి ఓపెన్ గా అడిగితే చెప్తారు, యాక్టర్స్ కి సూపర్బ్ గా సజెషన్స్ ఇస్తారు.

మీ ఫస్ట్ ఛాయస్ సినిమాలేనా లేక అనుకోకుండా మీ లైఫ్ లో సినిమా భాగమైందా?

పెద్దలు చెప్పినట్టు మిరాకిల్స్ అన్నీ అనుకోకుండానే జరుగుతాయట. అలానే సినిమా అనేది నా లైఫ్ లో అనుకోకుండా జరిగింది. 14 ఏళ్ళ వయసులో మా నాన్న కోరుకున్నారు నేను సినిమాల్లోకి వెళ్లాలని. ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనేలోపే నేను నటిగా సినిమాలు చేసేస్తున్నాను.

మీ ఫెయిల్యూర్స్ నుంచి ఏం నేర్చుకుంటారు? అలాగే రూమర్స్ ని ఎలా తీసుకుంటారు?

స) ఎంతో ఇష్టపడి చేస్తాం.. ఫెయిల్యూర్ అయినప్పుడు కాస్త బాధ ఉంటుంది కానీ నేను పడినదానికన్నా ఫాస్ట్ గా పైకి లేవడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ డిప్రెషన్ కి తావులేదు, నెక్ట్ ఏంటి, ఎలా నేను బెస్ట్ ఇచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను అనేది ఎక్కువగా ఆలోచిస్తాను. అలానే పని చేస్తాను. రూమర్స్ అంటే అసలు పట్టించుకోను. కానీ ఇప్పటి వరకూ నా కెరీర్లో ఇండస్ట్రీ నుంచి కానీ, ప్రేక్షకుల నుంచి కానీ తీవ్రంగా నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎదుర్కున్న సందర్భాలు లేవు.

మీరు పని చేసిన నాగ శౌర్య, నందిని రెడ్డిలు మీ పేరు పలువురికి రెకమెండ్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. దానిపై మీ కామెంట్?

నవ్వులు.. అలా జరుగుతుందా..? వాళ్ళు అలా చేస్తుంటే మాత్రం చాలా గ్రేట్ఫుల్ గా ఫీలవుతాను. వారిద్దరితో కలిసి పనిచేసాను. అందుకేనేమో నన్ను రికమండ్ చేసి ఉంటారు. శౌర్య నాకు తెలిసిన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లో గ్రేట్ ఫ్రెండ్. శౌర్య ఒక బ్రిలియంట్ యాక్టర్. ఇక నందిని రెడ్డి నా మెంటర్. చాలా విషయాల్లో తననే స్ఫూర్తిగా తీసుకుంటాను. నందిని రెడ్డి నెవర్ గివప్ పర్సన్. అందుకే ఇండస్ట్రీలో ఎన్ని కష్టతరమైన పరిస్థితులు ఉన్నా తను మాత్రం బ్యాక్ స్టెప్ వెయ్యదు. ఎప్పటి కప్పుడు తన సత్తా చాటుకుంటూనే ఉంటుంది.

ఇప్పటి వరకూ మీరు చేసిన పాత్రల్లో చాలా ఛాలెంజింగ్ పాత్రేమిటి?

తమిళ్ లో నేను చేసిన ‘కుకూ’ సినిమాలో బ్లైండ్ గర్ల్ గా, అదీ 15 ఏళ్ళ వయసులో చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఆ తర్వాత నాకు ప్రతి పాత్ర అలానే అనిపించింది. చేసేసిన తర్వాత ఈజీ అనిపించవచ్చు కానీ చేసే టైంలో చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఒరేయ్ బుజ్జిగాలో చేసిన రోల్. ఎందుకంటే అంతలా కామెడీ టైమింగ్ ఉన్న రోల్ నేను ఇప్పటిదాకా చేయలేదు.

గ్లామర్ అండ్ కమర్షియల్ చేయడం మీకు ఇష్టం లేదా.. అందుకేనా ఎక్కువ ఫిల్మ్ మేకర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వకపోవడానికి కారణం అదేనా?

నా మైండ్ లో గ్లామర్ అండ్ పెర్ఫార్మన్స్ రోల్స్ అనేవి ఉండవు.. మేమంతా యాక్టర్స్.. వారి వారి పరిధుల్ని పట్టి సినిమాలు ఎంచుకుంటారు. నా లిమిటేషన్స్ లో, నాకు పాత్ర నచ్చి ఎంజాయ్ చేసేదిలా ఉంటే ఏదైనా చేస్తాను.

మీరు రైటర్ కూడా.. సో మీరు మెగా ఫోన్ పట్టుకొని డైరెక్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా?

ప్రస్తుతానికి ఈ ప్రశ్న కరెక్ట్ కాదేమో. ఎందుకంటే నేను కాస్త లేజీ.. అంత ఫాస్ట్ గా వచ్చి కూర్చొని రాయను.. సో ప్రస్తుతానికి డైరెక్టర్ అనేదాని గురించి నాకే తెలియదు.

మీరు హీరోయిన్ అవ్వడానికి స్ఫూర్తి ఎవరు? ఈ జెనరేషన్ లో మీకు నచ్చిన నటి ఎవరు?

నా పరంగా స్ఫూర్తి అంటే మా నాన్న గారే. ఎందుకంటే ఆయనకి నేను నటి అవ్వాలనేది కోరిక. ఆయనకి కమల్ హాసన్ అంటే ఇష్టం. అందుకే ఆయన ప్రభావం నా మీద ఎక్కువ ఉండేది.

మీరు నాగ్ అశ్విన్ నటించిన రెండు సినిమాల్లో నటించారు. రెండు బిగ్ హిట్స్.. ఆ సెంటిమెంట్ తోనే మిమ్మల్ని ప్రభాస్ ఫిల్మ్ లో రిపీట్ చేస్తారని అంటున్నారు. నిజమేనా?

అది నాకు తెలియదు.. నాగి నా ఫ్రెండ్.. కాబట్టి తన షూట్ చేసే టైంలో నేను ఎక్కడో ఒక చోట తనకి దగ్గరగా ఉంటాను. అలా తన రెండు సినిమాల్లో నేను పార్ట్ అవ్వడం చాలా హ్యాపీ..

మీ కో స్టార్స్ నుంచి మీరు నేర్చుకున్న ఓ విషయం..

నాని – కరిష్మాటిక్.. ఒకసారి తను మాట్లాడడం మొదలు పెడితే ఇక ఏమీ పట్టించుకోము. తన మాటల్తో ఎదుటివారిని ట్రాక్ట్ చేయగలడు.

విజయ్ దేవరకొండ – ఫేమ్ వస్తే అందరూ మారిపోతారు. గర్వం వస్తుంది. కానీ విజయ్ లో ఆ గర్వం ఉండదు. ఎవరి నుంచి ఏం వచ్చినా తనకి ఏం కావాలో అదే తీసుకుంటాడు.

నాగశౌర్య – హానెస్ట్ పర్సన్. తను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కూడా అదే అనిపిస్తుంది.

కళ్యాణ్ దేవ్ – వెరీ ప్రొఫెషనల్.. ఓ పెర్ఫెక్షనిస్ట్.. అన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటారు.

రాజ్ తరుణ్ – రిలాక్స్డ్ గా, ఎలాంటి పరిస్థితి వచ్చినా తన జోన్ లో తను హ్యాపీగా ఉంటాడు.

నందిని రెడ్డి – స్టాండప్ ఫర్ యువర్స్సెల్ఫ్ నేది నేర్చుకున్నా.. నువ్వు పడిపోతే ఎవరో వచ్చి నిన్ను లేపాలి అని ఆలోచించకుండా నీ అంతట నువ్వు లేచి పోరాడు అనే పర్సన్.

నాగ్ అశ్విన్ – ఎప్పుడూ తన క్రియేటివ్ జోన్ లో ఉంటాను..

రాహుల్ సంకీర్త్యన్ – సిస్టమాటిక్ స్టోరీ టెల్లర్. తనకి కావాల్సిన దాని కోసం డిలే అయినా, కన్విన్స్ చేసి పర్ఫెక్ట్ గా జరిగేలా చూసుకుంటాడు.

విజయ్ కుమార్ కొండ – సెట్లో యాక్టర్స్ కి స్ట్రెస్ లేకుండా చూసుకుంటాడు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...