Switch to English

ఆస్పత్రుల తీరు మారదా.. శవాల మీద పైసలు ఏరుకోవడమేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

మనిషికి ప్రాణం మీద ఉన్నంత మమకారం దేని మీదా ఉండదు. సరిగ్గా ఇదే పాయింట్ పై ఆధారపడి పలు ఆస్పత్రులు వ్యాపారం చేస్తున్నాయి. వైద్యం కోసం తమ దగ్గరకు వచ్చినవారి నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. కొన్ని ఆస్పత్రులైతే శవాల మీద కూడా పైసలు ఏరుకుంటూ పవిత్రమైన వైద్య వృత్తి విలువలకు నిలువునా పాతరేస్తున్నాయి. డబ్బులు కట్టిన తర్వాతే శవాన్ని తీసుకెళ్లాని తేల్చి చెబుతున్నాయి.

ప్రపంచం అంతా ఓవైపు కరోనాతో అల్లకల్లోలం అవుతుండగా.. ఇటీవలే ఈ చికిత్సకు అనుమతి రావడంతో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం తమ దందాతో రెచ్చిపోతున్నాయి. రోజుకు ఏకంగా లక్షల్లో ఫీజులు గుంజుతూ బాధితుల నడ్డి విరుస్తున్నాయి. ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సామాన్యులకే కాదు.. కరోనా బారిన పడిన డాక్టర్లకు కూడా ఈ ఇబ్బందులు తప్పడంలేదు.

ఫీవర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ కు హైదరాబాద్ చాదర్ ఘాట్ లోని తుంబే ఆస్పత్రి ఒక్కరోజుకు లక్షన్నర బిల్లు వేయగా.. తాజాగా ఏఐజీ ఆస్పత్రి మరో మహిళా డాక్టర్ కు ఇదే తరహాలో షాక్ ఇచ్చింది. కరోనా పాజిటివ్ తో తండ్రితో కలిసి ఆమె ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఎలాంటి కరోనా లక్షణాలూ లేవు. అయినప్పటికీ ఆక్సిజన్ పెట్టినట్టుగా, ఐవీలు ఇచ్చినట్టుగా లక్షల్లో బిల్లు వేశారని.. దీనిపై ప్రశ్నించడంతో బలవంతంగా డిశ్చార్జి చేస్తున్నారంటూ ఆమె తీసిన సెల్పీ వీడియో బుధవారం సంచలనమైంది.

నిజానికి ఏదైనా రోగం వచ్చి కార్పొరేట్ ఆస్పత్రికి వెళితే ఆస్తులు అమ్ముకోక తప్పదనే వ్యాఖ్యలు వినిపించేవి. కానీ తాజాగా కరోనా చికిత్స విషయంలో అవి అనుసరిస్తున్న తీరు చూస్తుంటే ఆస్తులు అమ్ముకున్నా కూడా కట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. అంత భారీగా బిల్లులు వేసి దారుణంగా దోచుకుంటున్నాయి. లాక్ డౌన్ కాలంలో ఆస్పత్రులు మూసి ఉంచడంతో అప్పటి నష్టాలను కూడా ఇప్పుడు రికవరీ చేసుకునే దిశలో ఆయా ఆస్పత్రులు భారీగా దండుకుంటున్నాయని అంటున్నారు. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి ఇవ్వనంత కాలం అంతా బాగానే ఉంది.

అయితే, కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతే.. అప్పటివరకు సైలెంటుగా ఉన్న ఆస్పత్రులు ఒక్కసారిగా జూలు విదిల్చాయి. కరోనా చికిత్సకు దేనికెంత చార్జి వేయాలో సర్కారు స్పష్టం చేసినా.. వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. సాక్షాత్తు హైకోర్టు సైతం ఈ విషయంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తున్న ఆస్పత్రులపై కొరడా ఝలిపించాల్సిందేనని సర్కారుకు స్పష్టంచేసింది. అయితే, ఎవరేం చెప్పినా మాకేంటి అనే రీతిలో ప్రైవేటు ఆస్పత్రులు తమ దందా మాత్రం ఆపడంలేదు. ఈ విషయంలో సర్కారు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వాటి తీరు మారదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...