Switch to English

ఓటిటి రివ్యూ: 47 డేస్ – ఈ మిస్టరీలో మాటర్ లేదుగా.!

Critic Rating
( 1.50 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow
Movie 47 డేస్
Star Cast సత్యదేవ్, పూజ జవేరి..
Director ప్రదీప్ మద్దాలి
Producer డి. శశి భూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్.డి
Music రఘు కుంచె
Run Time 1 గంట 44 నిముషాలు
Release జూన్ 30, 2020

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకుడిగా పరిచయం అవుతూ సత్యదేవ్ హీరోగా చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ’47 డేస్’. 2019 లోనే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా పలుసార్లు వాయిదా పడింది. ఫైనల్ గా ఈ లాక్ డౌన్ టైంలో థియేటర్స్ ఓపెనింగ్ కి చాలా టైం పట్టే అవకాశం ఉండడం వలన డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చేశారు. మరి ఈ థ్రిల్లర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం…

కథ:

పూరి జగన్నాధ్ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవుతుంది.. ఫినిక్స్ పార్మాసిటికల్స్ కంపెనీ ఎండి శ్రీనివాస్ మృతదేహం వైజాగ్ బీచ్ లో దొరుకుతుంది. కానీ 40 రోజులకి అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడని సిఐ రవి(రవివర్మ) కేసు క్లోజ్ చేస్తారు. అప్పటికే డ్యూటీ నుంచి సస్పెండ్ అయిన ఏసిపి సత్య(సత్యదేవ్) అనుకోకుండా ఆ కేసు డీటైల్స్ చూసినప్పుడు కరెక్ట్ గా ఏడాది క్రితం అనుమానాస్పదంగా చనిపోయిన సత్య భార్య పద్దు(రోషిణి ప్రకాష్) సూసైడ్ కి, శ్రీనివాస్ సూసైడ్ కి ఏదో సంబంధం ఉందని గెస్ చేస్తాడు. ఇక అక్కడి నుంచి డ్యూటీలో లేకపోయినా, సత్య ఎలా ఈ మిస్టరీని సాల్వ్ చేసాడు అనేదే కథ.

తెర మీద స్టార్స్..

యంగ్ యాక్టర్ సత్యదేవ్ నటుడిగా తనకిచ్చిన పాత్రని చాలా బాగా చేసాడు. అటు ఎమోషన్, ఇటు సీరియస్ కాప్ షేడ్స్ ని పర్ఫెక్ట్ గా ప్రెజంట్ చేసాడు. కానీ ఈ సినిమా దాదాపు ఏడాది క్రితమే ఫినిష్ అయ్యింది. ఈ లోపు తను నటించిన చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో ఇలాంటి షేడ్స్ మనం చూసేసి ఉండడం వలన ఇలాంటి పాత్రలో చూసేసాం కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది శ్రీకాంత్ అయ్యంగర్. క్లైమాక్స్ లో తను చేసిన నెగటివ్ షెడ్ పెర్ఫార్మన్స్ అదిరింది. ఇక హీరోయిన్స్ గా కనిపించిన పూజ జవేరి, రోషిణి ప్రకాష్ లు జస్ట్ ఓకే. రవి వర్మ, సత్య రాజ్ లు కూడా ఓకే తప్ప చెప్పుకునేంత పాత్రలు కావు.

తెర వెనుక టాలెంట్..

టెక్నికల్ గా ఇద్దరిని మెచ్చుకోవాలి.. అందులో మొదటగా మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె.. పాటలు జస్ట్ ఓకే అయినా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా చేశారు. సినిమాలో అస్సలు కంటెంట్ లేకపోయినా ఏదో ఉందనే ఫీల్ ని క్రియేట్ చేయడం కోసం చాలా కష్టపడ్డాడు. ఇకపోతే జికె సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా హీరోయిజం సీన్స్ లో తన లైటింగ్, ఫ్రేమింగ్ బాగుంది. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ లో స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కానీ 104 నిమిషాల సినిమా కూడా పిచ్చ బోర్ కొట్టేలా ఉంది.

ఇక డైరెక్టర్ గా ప్రదీప్ మద్దాలికి మొదటి సినిమా ఇది.. యంగ్ డైరెక్టర్ అయ్యుండి కూడా మరీ ఇంత రొటీన్ కథని ఎంచుకోవడం తాను చేసిన మొదటి తప్పని చెప్పాలి. ఎంచుకున్న కథ, కథలోని ఎమోషన్ ఎక్కడా చూస్తున్న ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. థ్రిల్లర్ కథాంశం, అందులోనూ ది మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనే ఉపశీర్షిక పెట్టుకున్నప్పుడు కనీసం కథలో థ్రిల్ చేసే అంశం ఒక్కటైనా ఉండాల్సింది. టీవీలో వచ్చే సిఐడి లాంటి సీరియల్స్ లోనే దీనికన్నా మంచి థ్రిల్స్ ఉన్నాయి అంటే మీరే అర్థం చేసుకోవచ్చు థ్రిల్ చెయ్యడంలో ఈ 47 డేస్ ఎంతలా ఫెయిల్ అయ్యిందని.. స్క్రీన్ ప్లే పరంగా చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది.. పికప్ అందుకుంటుంది అందుకుంటుంది అని చివరి దాకా వెయిట్ చేసినా అంతే స్లోగా సాగుతూ పూర్తయ్యే టైంకి నీరసం తెప్పిస్తుంది. ఇక డైరెక్టర్ గా విజువలైజేషన్ లో కొంతవరకూ బెటర్ అనిపించుకున్న ఆడియన్స్ ని హుక్ చేసి సినిమాని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అలాగే కొన్ని సీన్స్ లో మెచ్యూరిటీ కనిపించలేదు. నిర్మాణ విలువలు డీసెంట్ అని చెప్పాలి.

విజిల్ మోమెంట్స్:

– సత్యదేవ్ పెర్ఫార్మన్స్
– రఘు కుంచె బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– కంటెంట్ లేని కథ
– బోరింగ్ కథనం
– థ్రిల్స్ లేని థ్రిల్లర్
– జీరో ఎంటర్టైన్మెంట్
– చిరాకు తెప్పించే పాటలు

విశ్లేషణ:

47 డేస్ అనేది ఒక మిస్టరీని రివీల్ చేసే థ్రిల్లర్ కథ అనేది టైటిల్ లోనే చెప్పారు. కానీ ఈ మిస్టరీలో ప్రేక్షకులని మెప్పించే కథా లేదు, కథలేకపోయినా థ్రిల్స్ తో అయినా మ్యాజిక్ చేశారా అంటే అదీ లేదు. ఓటిటి కోసం ఎంతో కొంత రన్ టైంని తగ్గింది 104 నిమిషాల సినిమాని రిలీజ్ చేసినా అదీ బోర్ కొట్టేస్తుంది.

చూడాలా? వద్దా?: ఎంత ఓటిటి అయినా, మీరు వెచ్చించే సమయానికి తగిన థ్రిల్లర్ మూవీ అయితే కాదు.. ఇదే టైంని ఇంకో బెటర్ థ్రిల్లర్ కోసం స్పెండ్ చేయచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మరో ఓటిటి ఫెయిల్యూర్ ఫిల్మ్.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 1.5/5 

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...