Switch to English

లోకేష్‌ వర్సెస్‌ జగన్‌.. బెస్ట్‌ పబ్జీ ప్లేయర్‌ ఎవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఏం, రాజకీయ నాయకులైతే మాత్రం పబ్జీ గేమ్ ఆడకూడదా.? ఈ చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య. గత కొద్ది కాలంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధంలో భాగంగా వైఎస్‌ జగన్‌ని ‘పబ్జీ ఆటగాడిగా’ టీడీపీ అభివర్ణిస్తోంటే, నారా లోకేష్‌ని ‘పబ్జీ ప్లేయర్‌’గా వైసీపీ అభివర్ణిస్తోంది. రోమ్ తగలబడిపోతోంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడన్నట్టు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంటే.. ఈ ‘పబ్జీ రాజకీయం’ ఏంటి.?

‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి అసలు పరిపాలనే చేతకాదు. ఇంట్లో కూర్చుని పబ్జీ ఆడుకుంటున్నారు..’ అని టీడీపీ విమర్శిస్తోన్న విషయం విదితమే. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ నేత నారా లోకేష్‌పై ‘పబ్జీ’ ఆరోపణలు చేశారు. ఇదా రాజకీయం.? అసలు ఈ తరహా విమర్శల్ని టీడీపీ అధిష్టానం కావొచ్చు, వైసీపీ అధిష్టానం కావొచ్చు.. ఎందుకు ప్రోత్సహిస్తున్నట్లు.?

ఒక్క మాటలో చెప్పాలంటే అటు టీడీపీకిగానీ, ఇటు వైసీపీకిగానీ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పెద్దగా ‘ఆలోచన’ వున్నట్లు కన్పించడంలేదన్నమాట. ఒకవేళ టీడీపీ ఆరోపణలూ నిజమై, వైసీపీ ఆరోపణలూ నిజమైతే.. రాష్ట్ర ప్రజలు ఇద్దరు పబ్జీ ఆటగాళ్ళ కారణంగా చితికిపోతున్నారని అనడం సబబేమో.! టీడీపీ మీద వైసీపీ విమర్శలు చేయడం, వైసీపీ మీద టీడీపీ విమర్శలు చేయడం తప్ప.. రాష్ట్ర ప్రజల బాగోగులు అధికార, ప్రతిపక్ష పార్టీలకు పట్టడంలేదన్నది నిర్వివాదాంశం.

చంద్రబాబు హయాంలో, ‘కేంద్రాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నించడంలేదు.. నిలదీయడంలేదు.. రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలేదు..’ అని వైసీపీ విమర్శించింది. ఇప్పుడు వైసీపీ హయాంలో ‘జగన్‌ ప్రభుత్వం, కేంద్రాన్ని నిలదీయడంలేదు..’ అని టీడీపీ విమర్శిస్తోంది. కరెంటు ఛార్జీల విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మీద. ప్రభుత్వం తరఫున అజేయ కల్లాం వివరణ ఇచ్చారుగానీ, వైసీపీ ముఖ్య నేతలెవరూ ఇప్పటిదాకా ఈ విషయమై పెదవి విప్పకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? సందర్భం దొరికింది కదా.. అని టీడీపీ, ఈ విషయంలో వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది తప్ప.. కేంద్రాన్ని నిలదీసి, కేంద్రం నుంచి నిధులు రాబట్టాలనే ఆలోచన ఏమైనా చేస్తోందా.? మొత్తమ్మీద, రాష్ట్రం అంటే.. రెండు రాజకీయ పార్టీలకీ ఓ క్రీడగా మారిపోయిందన్నమాట. అధికార, ప్రతిపక్ష నేతలు పబ్జీ ప్లేయర్స్‌లా మారిపోతే.. రాష్ట్రం భవిష్యత్తు ఏం కావాలి.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Anand Mahindra: ‘గర్వంగా ఉంది..’ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా...

Anand Mahindra: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఇటివలే ప్రభాస్...

బెంగళూరు రేవ్ పార్టీ.. టాలీవుడ్ నటి హేమకి పాజిటివ్

గత నాలుగు రోజులుగా హాట్ టాపిక్ ఆ మారిన బెంగళూరు రేవ్ పార్టీ చీకటి కోణాన్ని బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. ఈ పార్టీలో పాల్గొన్న వారికి...

Nagarjuna: ‘మనం’ @10..! తండ్రి విషయంలో భావోద్వేగమైన నాగార్జున

Nagarjuna: తెలుగు చిత్ర పరిశ్రమ లెజండరీ హీరోల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao). ఆయన ఆఖరి మజిలీగా తెరకెక్కిన సినిమా ‘మనం’ (Manam)....

Prabhas: ‘ఇదే నా బుజ్జి..’ కల్కి 2898 AD ఈవెంట్లో పరిచయం...

Prabhas: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). జూన్...

Pawan Kalyan: చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ‘స్వామినాయుడు’కు జనసేనాని అభినందనలు

Pawan Kalyan: అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడును జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. ఏపీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో విస్తృతంగా...

రాజకీయం

అంబటి రాంబాబు రీ-పోలింగ్ గోల.!

మంత్రి అంబటి రాంబాబు, సత్తెనపల్లిలో ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వాస్తవానికి, ఆయన గెలిచే అవకాశం లేదు కాబట్టి, సత్తెనపల్లిలో వేరే అభ్యర్థిని పెట్టాలని వైసీపీ అధినాయకత్వం తొలుత భావించింది. కానీ, అంబటి రాంబాబు...

తప్పు చెయ్యనప్పుడు ‘పిల్లి’లా ఎందుకు పారిపోవాలి.?

వైసీసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో...

Janasena: NRI జనసైనికుల ఉదారత.. అగ్నిప్రమాద భాదితులకు ఆర్ధిక సాయం

Janasena: సేవ, సాయం చేయడంలో జనసైన నేతలు, జనసైనికులు ఎప్పుడూ ముందే ఉంటారని మాజీ స్పీకర్, అవనిగడ్డ నియోజకవర్గ జనసేన (Janasena) ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇటివల అగ్నిప్రమాదంలో సర్వం...

Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత..

Kodali Nani: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. గురువారం గుడివాడలోని తన స్వగృహంలో నందివాడ వైసీపీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. వారితో మాట్లాడుతూండగానే...

పిన్నెల్లి ఎక్కడ? హైదరాబాద్ లో ఉన్నారా? తమిళనాడుకు పారిపోయారా?

'మంచివాడు, సౌమ్యుడు, గెలిపిస్తే మీకు మంచే చేస్తాడు' ఇవీ మాచర్ల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పరిచయం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు. ప్రచార సభలో దాదాపుగా...

ఎక్కువ చదివినవి

ఏపీ ఎలక్షన్స్: 10 వేల పైన మెజార్టీ 92 స్థానాల్లో.!

ఒకప్పుడు ఎన్నికలకు సంబంధించి ముందస్తు సర్వేలు నిర్వహించాలంటే, అదో పెద్ద తతంగం. ఇప్పుడు అంత సీన్ అవసరం లేదు. శాంపిల్స్ తీసుకోవడం చాలా తేలిక. ఎన్నికల ముందర అయినా, ఎన్నికల పోలింగ్ రోజున...

Prabhas: ‘ఇదే నా బుజ్జి..’ కల్కి 2898 AD ఈవెంట్లో పరిచయం చేసిన ప్రభాస్

Prabhas: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). జూన్ 27న విడుదల అవుతున్న సినిమాకు సంబంధించి...

AP News: పిన్నెల్లికి 7ఏళ్ల శిక్ష పడొచ్చు.. 10సెక్షన్ల కింద కేసులు: సీఈఓ మీనా

AP News: ఏపీలో పోలింగ్ రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎంను ధ్వంసం చేయడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు పిన్నెల్లి అరెస్టుకు...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

Ram Charan: రామ్ చరణ్ రేంజ్.. విస్తుగొలుపుతున్న ఆస్తుల విలువ..!

Ram Charan: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ (Ram Charan) తెలుగులోనే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రస్తుతం...