Switch to English

బర్త్‌డే స్పెషల్‌ : మణిరత్నం కెరీర్‌ టాప్‌ 5 బెస్ట్‌ చిత్రాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

సౌత్‌ ఇండియా సినిమా స్థాయిని బాలీవుడ్‌ రేంజ్‌కు పెంచిన మొదటి తరం దర్శకుడు మణిరత్నం. సౌత్‌ సినిమాలు అంటే చిన్న చూపు చూస్తున్న సమయంలో మణిరత్నం చేసిన సినిమాలు బాలీవుడ్‌ మేకర్స్‌ దృష్టిని ఆకర్షించాయి. మణిరత్నంతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్‌ మేకర్స్‌ ఆసక్తి చూపించే వారు. బాలీవుడ్‌ సినిమాలకు పోటీగా మణిరత్నం సినిమాలు ఉంటాయి. తెలుగులో ఈయన తెరకెక్కించిన ఒకే ఒక్క సినిమా ‘గీతాంజలి’. అది తెలుగు సినిమా ఉన్నంత కాలం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తమిళంలో ఆయన తెరకెక్కించిన నాయకుడు, రోజా, బొంబయి, అంజలి సినిమాలు తెలుగులోనూ హిట్‌ అయ్యాయి. మణిరత్నం తెరకెక్కించిన ఈ అయిదు దృశ్య కావ్యాలు ఎప్పటికి నిలిచి పోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మణిరత్నం కెరీర్‌ టాప్‌ 5 బెస్ట్‌ చిత్రాలు ఇవే.

1. నాయకుడు :

బర్త్‌డే స్పెషల్‌ : మణిరత్నం కెరీర్‌ టాప్‌ 5 బెస్ట్‌ చిత్రాలు1987లో వచ్చిన ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ హీరోగా నటించాడు. ఒక హీరోను ఇలాగా కూడా చూపించవచ్చా అన్నట్లుగా ఈసినిమా సాగుతుంది. విలక్షణమైన కథతో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో మరియు తెలుగులోనే కాకుండా పలు భాషల్లో సూపర్‌ హిట్‌ను సాధించి రికార్డులు సృష్టించింది.

2. రోజా :

బర్త్‌డే స్పెషల్‌ : మణిరత్నం కెరీర్‌ టాప్‌ 5 బెస్ట్‌ చిత్రాలు1992లో వచ్చిన ఈ సినిమా సరికొత్త ప్రేమ కథలకు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఎన్నో సినిమాలు కూడా రోజా ఫార్ములను ఫాలో అవుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అరవింద్‌ స్వామి, మధుబాల జంటగా తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు అద్బుతం, ఇప్పటికి ఆ పాటలు ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తూనే ఉంటాయి. ఉగ్రవాదం బ్యాక్‌ డ్రాప్‌తో అద్బుతమైన ప్రేమ కథను దర్శకుడు మణిరత్నం ఈ చిత్రంలో చూపించాడు.

3. బొంబాయి :

బర్త్‌డే స్పెషల్‌ : మణిరత్నం కెరీర్‌ టాప్‌ 5 బెస్ట్‌ చిత్రాలుముంబయిలో జరిగిన మారణహోమం, అక్కడ ఉండే పరిస్థితులను ఒక చక్కని ప్రేమ కథను జోడిచ్చి దర్శకుడు మణిరత్నం చూపించాడు. 1995లో అరవింద్‌ స్వామి, మనీషా కోయిరాలాలతో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదల అయిన అన్ని భాషల్లో కూడా బొంబయి సినిమా సెన్షేషనల్‌ సక్సెస్‌ దక్కించుకుంది.

4. గీతాంజలి :

బర్త్‌డే స్పెషల్‌ : మణిరత్నం కెరీర్‌ టాప్‌ 5 బెస్ట్‌ చిత్రాలునాగార్జున, గిరిజ జంటగా తెరకెక్కిన గీతాంజలి సినిమా ట్రెండ్‌ సెట్టర్‌ చిత్రంగా నిలిచింది. హీరో క్యాన్సర్‌ పేషంట్‌ ఏంటీ అంటూ మొదట అంతా పెదవి విరిచారు. కాని ఆ సినిమా గుండెలను పిండేసి అప్పట్లోనే సెన్షేషనల్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. ఇలాంటి కథలతో కూడా సినిమా తీస్తారా అన్నట్లుగా ఆ సినిమా ఉంటుంది. ఆ సినిమాలోని పాటలన్నీ కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి.

5. అంజలి :

బర్త్‌డే స్పెషల్‌ : మణిరత్నం కెరీర్‌ టాప్‌ 5 బెస్ట్‌ చిత్రాలు1990 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా చిన్న పిల్ల కథ. బేబీ శామిలితో తెరకెక్కిన ఈ సినిమా కూడా అన్ని భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళంలో వచ్చిన ఈ సినిమా అక్కడ సెన్షేషన్‌ అయ్యింది. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా యాంటీ క్లైమాక్స్‌ కారణంగా నిరాశ పర్చినా కూడా ఇప్పటికి సినిమా ఒక అద్బుతమే అంటారు.

సినిమాకు కొత్త అర్థం చెప్పి, ప్రేమ కథల స్పెషలిస్ట్‌గా పేరు దక్కించుకున్న దర్శకుడు మణిరత్నం పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయనకు తెలుగు బులిటెన్‌ టీం మరియు ఆయన అభిమానుల తరపున హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

6 COMMENTS

  1. 131067 381108The vacation delivers on offer are : believed a selection of some of the most selected and furthermore budget-friendly global. Any of these lodgings tend to be really used along units may accented by indicates of pretty shoreline supplying crystal-clear turbulent waters, concurrent with the Ocean. hotels packages 228784

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...