Switch to English

జూనియర్‌ ఎన్టీఆర్‌ని బాలయ్య రమ్మన్నాడా.? వద్దన్నాడా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

సినీ పరిశ్రమలో తాజాగా చోటు చేసుకున్న పలు వివాదాలకు కేంద్ర బిందువు నందమూరి బాలకృష్ణ. తనను సినీ పెద్దల సమావేశానికి ఆహ్వానించకపోవడంపై బాలయ్య గుర్రుగా వున్నారు. ఓ ‘బూతు’ తిట్టు కూడా తిట్టేశాడాయన తన సహజమైన శౖలిలో. అయితే, ‘సినీ పరిశ్రమ బాగు కోసం ఎవరు ముందుకొచ్చినా ఆహ్వానిస్తాం.. ఇందులో ప్రత్యేకంగా ఎవర్నీ పిలిచే పని వుండదు..’ అని ఇటు సినీ పరిశ్రమ, అటు తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేశాయి.

ఇక, ఈ వ్యవహారంపై బాలయ్య లేటెస్ట్‌ ఇంటర్వ్యూపై బోల్డన్ని అంచనాలు నెలకొన్నాయి. ఓ టీజర్‌ని వదిలారు ఆ ఇంటర్వ్యూకి సంబంధించి. అందులో చాలా కాంట్రవర్షియల్‌ ఎలిమెంట్స్‌ వున్నట్లే కన్పించింది. కానీ, ఇంటర్వ్యూ మొత్తం చూస్తే.. అంత పస ఏమీ లేదు. అయితే, జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి మాత్రం బాలయ్య కీలక వ్యాఖ్యలు చేశాడు ఆ ఇంటర్వ్యూలో.

‘సినిమా కెరీర్‌లో బిజీగా వున్నాడు.. రాజకీయాల్లోకి రావాలనుకుంటే అది ఆయనిష్టం..’ అని చెప్పిన బాలయ్య.. అంతలోనే, ‘ఏం, నేను రాజకీయాల్లో లేనా.? రెండు సార్లు ఎమ్మెల్యేని.. సినిమాలూ చేస్తున్నాను..’ అంటూ, తనదైన స్టయిల్లో బాలయ్య వివాదాలకు ఆస్కారమిచ్చాడు.

అంతేనా, ‘ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగానే సినిమాలు చేశారు.. మరి, ఆ మహానుభావుడితో పోల్చుకుంటే మేమెంత.?’ అని బాలయ్య చేసిన వ్యాఖ్యల్ని జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ పట్ల జూనియర్‌ ఎన్టీఆర్‌కీ, కళ్యాణ్‌రామ్ కీ ప్రత్యేకమైన అభిమానం వున్నా, టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వారిని కొంత కలతకు గురిచేశాయన్నది నిర్వివాదాంశం. లేకపోతే, తమ సోదరి కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు, కనీసం ప్రచారానికైనా ఎందుకు ఈ ఇద్దరూ వెళ్ళలేదు.?

ఇదిలా వుంటే, బాలయ్య వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై మరోమారు విమర్శలతో విరుచుకుపడిపోయారు. ‘అసలు ప్రభుత్వమే లేదు..’ అని తేల్చేసిన బాలకృష్ణ, అతి త్వరలో జగన్‌ ప్రభుత్వం పడిపోతుందనీ, టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమనీ బల్లగుద్ది మరీ చెప్పారు.

అప్పుడెప్పుడో అమెరికాలో ‘మా’ తరఫున నిధుల సేకరణ కోసం చిరంజీవి అండ్‌ టీమ్ వెళ్ళి, ఆశించిన స్థాయిలో విరాళాలు సేకరించకపోవడంపై బాలయ్య లైటర్‌ వీన్‌లో వ్యాఖ్యలు చేసినా, ఆ వ్యాఖ్యల్లో ఆయనకే స్పష్టత లేని పరిస్థితి. నాగబాబు విషయంలోనూ బాలయ్య, పెద్దగా స్పందించకపోవడం గమనార్హం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...