Switch to English

రివ్యూ : రక్తాంచల్ (వెబ్ సిరీస్)

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

నటీనటులు : నికితిన్ ధీర్, క్రాంతి ప్రకాష్ ఝా, సౌందర్య శర్మ, రోంజిని చక్రవర్తి, చిత్తరంజన్ త్రిపాఠి తదితరులు.
నిర్మాణం : ఎంఎక్స్ ప్లేయర్
దర్శకత్వం: రితమ్ శ్రీవాస్తవ్
నిడివి : 86 నిముషాలు
విడుదల తేది : మే 28, 2020
ఓటీటీ ప్లాట్ ఫాం : ఎంఎక్స్ ప్లేయర్

మీర్జాపూర్, సేక్రేడ్ గేమ్స్ సిరీస్ లు వచ్చిన తర్వాత బాలీవుడ్ లో ఉత్తరప్రదేశ్ లోని దేశీయ నేర వ్యవస్థలపై తెరకెక్కే వెబ్ సిరీస్ లు ఎక్కువయ్యాయి. ఆ కోవలోనే తాజాగా ‘రక్తాంచల్’ అనే వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ ఫాం ‘ఎంఎక్స్ ప్లేయర్’లో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలయింది. పేరులోనే రక్తం నింపుకున్న ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.

కథ :

80వ దశకంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వాంచల్ ప్రాంతంలో జరిగిన టెండర్ మాఫియా నేపధ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ రాష్ట్ర ప్రభుత్వ టెండర్ అనౌన్స్ మెంట్ తో మొదలవుతుంది. ఎప్పట్లానే టెండర్ పూర్వాంచల్ ను గడగడలాడిస్తున్న వసీం ఖాన్ (నికితిన్ ధీర్)కు వెళుతుంది. హఠాత్తుగా విజయ్ సింగ్ (క్రాంతి ప్రకాష్ ఝా) అధికారులకు అడ్డుపడి బెదిరించి టెండరును తన వైపుకు తిప్పుకుంటాడు. అప్పటి నుండి వసీం, విజయ్ ల ఆధిపత్య పోరు మొదలవుతుంది. ఈ పోరులో ఎవరు గెలిచారనేది సిరీస్ చూసి తెలుసుకుంటేనే ఆ ‘కిక్’ ఉంటుంది.

తెర మీద స్టార్స్

చెన్నై ఎక్స్ ప్రెస్, జోధా అక్బర్, దబంగ్ 2 వంటి చిత్రాల్లో ప్రతినాయక పాత్రలు పోషించిన నికితిన్ వసీం ఖాన్ గా సరిగ్గా సరిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి మరీ నటించాడు. ఎంఎస్ ధోనీ వంటి చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించిన క్రాంతి ప్రకాష్ ఈ సిరీస్ లో విజయ్ సింగ్ గా కీలక పాత్ర పోషించి తానేమిటో నిరూపించుకున్నాడు. సౌందర్య శర్మ, రోంజిని చక్రవర్తి తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

తెర వెనుక

గతంలో ‘జై గంగాజల్’ తీసిన రితమ్ శ్రీవాస్తవ్ ఈ సిరీస్ తెరకెక్కించటంలో తనదైన ప్రతిభ కనపరిచాడు. ఎక్కువగా డార్క్ మోడ్ లోనే తీస్తున్డటం వల్ల కెమెరా పనితనం ఒకేలా అనిపిస్తూ ఉంటుంది. సంగీతం విషయానికి వస్తే అక్కడక్కడ వచ్చే పాటలు పర్లేదు అనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్ అనిపిస్తుంది. కథకు తగినంత ఇంటెన్సిటీ కలిగించలేదనిపిస్తుంది.

విశ్లేషణ :

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ సందేహం లేకుండా మనల్ని 80వ దశకంలోకి తీసుకెళుతుంది. మొదటి సీన్ లోనే వసీం ఖాన్ కు విజయ్ సింగ్ అడ్డు పడటంతోనే నేరుగా కథ మొదలయిపోతుంది. ఈ సిరీస్ 80వ దశకంలోని సినిమాల్లోని ముఠా కక్షలను ఆధిపత్య పోరుకై ఎంతకైనా తెగించే నాయకులను గుర్తు చేస్తుంది. కథలోని పాయింట్ థ్రిల్లింగ్ గా మొదలయినా రాను రాను కథాగమనం అక్కర్లేని దారుల్లో ప్రయాణం చేయటం వల్ల కొంత గతి తప్పినట్లుగా అనిపించినా మొత్తంగా చూస్తే మంచి మార్కులే సాధించింది. 80వ దశకంలో పూర్వాంచల్ నేపధ్యంలో కథను ఎంచుకోవటంలోనే సగం మార్కులు కొట్టేసిన మేకర్స్ కథనాన్ని పకడ్బందీగా నడిపించటం కోసం పడిన శ్రమ తెరపై తెలుస్తూ ఉంటుంది. ప్రతి పాత్రను నడిపిన విధానం బాగుంది. అయితే ఇటీవలి కాలంలో వచ్చే సిరీస్ లు దాదాపు ఉత్తర భారతంలోని దేశీయ మాఫియా నేపధ్యంలో తెరకెక్కుతున్నవే కావటంతో ఈ సిరీస్ పరుగు పందెంలో వెనక పడే అవకాశం లేకపోలేదు.

పంచ్ లైన్ : ఆధిపత్య దాహానికి నెత్తుటి ధారలే సాక్ష్యం

తెలుగు బులెటిన్ రేటింగ్ : 2.5/5

సూర్య ప్రకాష్ వేద

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...