Switch to English

ఓటీటీ రిలీజ్ : నవదీప్ ‘రన్’ మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

నటీనటులు: నవదీప్, పూజిత పొన్నాడ, వెంకట్, అమిత్, షఫీ, మధు నందన్, భానుశ్రీ, కిరీటి తదితరులు.
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, క్రిష్ జాగర్లమూడి
దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా
రన్ టైం: 86 నిముషాలు
విడుదల తేదీ: మే 29, 2020
ఓటీటీ ప్లాట్ ఫాం: ఆహా

ఇటీవలి కాలంలో చిన్న నిర్మాతలు, దర్శకులకు ఓటీటీ వేదికలు ప్రత్యామ్నాయాలుగా మారాయి. కొందరైతే థియేటర్లు లేకపోవటంతో ఓటీటీ విడుదలకు వెళ్తుంటే మరికొందరు వెబ్ ప్లాట్ ఫాం కోసమే సినిమాలు తీస్తున్నారు. అదే కోవలో లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో నవదీప్ నటించిన ‘రన్’ సినిమా ఆహా ఒరిజినల్ పేరుతో శుక్రవారం ఓటీటీ వేదిక ‘ఆహా’ ద్వారా విడుదలైంది. ఒక హత్య..ఆరుగురు అనుమానితులు అంటూ ట్రైలర్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ థ్రిల్లర్ చిత్రం వీక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

శృతి(పూజిత పొన్నాడ) తొలి సన్నివేశంలోనే సందీప్ (నవదీప్)తో ప్రేమలో ఉండడంతో ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. వారి అన్యోన్యమైన ప్రేమ, రొమాన్స్ తర్వాత శృతి చనిపోతుంది. ఆత్మహత్యా.? హత్యా.? అంటూ పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. పోలీసులు సందీప్ ను అనుమానించటంతో సందీప్ వారి నుండి పరిగెడుతూ హంతకుడి కోసం వెతుకుతూ ఉంటాడు. అసలు హంతకుడు ఎవరు.? శృతిది అసలు హత్యా.? ఆత్మహత్యా.? అనేది తెలుసుకోవాలంటే ‘రన్’ చూడాల్సిందే.

తెర మీద స్టార్స్:

నవదీప్ నుండి ఇలాంటి నటన, సినిమా చూస్తామని ఎవ్వరూ ఊహించరు. వెంకట్, అమిత్, షఫీ, మధు నందన్, భానుశ్రీ, కిరీటి ఇలా ఎందరున్నా పాపం వీక్షకుడిని, మా వల్ల కాదు ఈ మూవీ చూడడం అంటూ మూవీ నుంచి ఎగ్జిట్ అవ్వడాన్ని ఆపలేకపోయారు.

తెరవెనుక టాలెంట్:

మేకింగ్ పరంగా ఇటీవలి కాలంలో ఎటువంటి అనుభవం లేని వారు కూడా షార్ట్ ఫిలింలే ఇంకా బాగా తీస్తున్నారు. కథ, కథనాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. సంగీతం అయితే సినిమా మూడ్ కి అసలు సింక్ అవ్వకుండా ఏదో డీజే వాయించినట్లుగా, సీరియల్స్ కి ట్రాక్స్ వేసినట్లుగా అనిపిస్తుంది. సినిమాకు హైలైట్ ఏదైనా ఉంది అంటే అది సినిమా యొక్క నిడివి మాత్రమే. అర్ధవంతమైన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నిర్మాణ సంస్థ నుండి ఇలాంటి సినిమాను ఊహించటం కష్టమే.

విశ్లేషణ:

హీరో హీరోయిన్లు కలవటం, ప్రేమించుకోవటం, పెళ్ళి చేసుకోవటం, అంతలోనే హీరో లేదా హీరోయిన్ చనిపోవటం ఆ తర్వాత హంతకుడు ఎవరు అనుకుంటూ బయలుదేరటం లాంటి కథలు ఎన్ని వచ్చినా ఎంచుకున్న పాయింట్ ను పకడ్బందీ కథనంతో వీక్షకుడిని కూర్చోపెట్టటంలోనే దర్శకుడి ప్రతిభ దాగి ఉంటుంది. తొలి పది నిముషాల్లో హీరో హీరోయిన్ల లవ్వూ, లస్కూ, మసాలా పాట చూపించిన దర్శకుడు తర్వాత ఏదైనా ఇంటరెస్టింగ్ గా చూపిస్తాడేమో అని ఆశించిన సాధారణ సినిమా వీక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. 86 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాలో మొదటి 70 నిముషాలను వీక్షకుడి సహనాన్ని వాడుకోవటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. టీవీ సీరియల్ కు ఏ మాత్రం తీసిపోకుండా కథను, కథాగమనాన్ని నడిపిన దర్శకుడు చివరిలో ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో అనుకుంటే ‘’వాహ్! వాట్ ఏ క్లాసిక్ థ్రిల్లర్’’ అంటూ ఫ్రస్టేషన్లో వీక్షకుడితో అనిపించేసుకున్నాడు.

పంచ్ లైన్: “రన్ విత్ యువర్ ఓన్ రిస్క్”

తెలుగు బులిటెన్ రేటింగ్: 1/5

సూర్య ప్రకాష్ వేద

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...