Switch to English

టాలీవుడ్‌కి తీపి కబురు సరే.. సోషల్‌ డిస్టెన్సింగ్‌ ఎలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

తెలుగు సినీ పరిశ్రమకు తీపి కబురు అందబోతోంది. త్వరలో షూటింగులకు అనుమతి లభించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని, తమ ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ముందుకొచ్చిందంటూ ఈ రోజు ప్రభుత్వ పెద్దలను కలిసిన సినీ ప్రముఖుల బృందం అభిప్రాయపడింది. త్వరలోనే జీవో పాస్‌ అవుతుందని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున అభిప్రాయపడ్డాడు. దర్శకుడు రాజమౌళి, ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ సహా పలువురు ప్రముఖులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అంతా బాగానే వుందిగానీ, సినిమా షూటింగులు ప్రారంభమయితే సోషల్‌ డిస్టెన్సింగ్‌.. అదేనండీ, ఫిజికల్‌ డిస్టెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేయడం సాధ్యమయ్యే పనేనా.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ‘మాది చాలా ప్రత్యేకమైన విభాగం. మేకప్‌ మేన్‌ వుంటాడు.. టచ్‌ అప్స్‌ చేస్తుండాలి.. క్లోజ్‌ కాంటాక్ట్‌ తప్పనిసరి. ఇతరత్రా విషయాల్లోనూ ఇలాంటి సమస్యలుంటాయి. దానికి ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం మాకు కొన్ని సూచనలు చేసింది. మేం ఏం చేయగలమన్నదీ ప్రభుత్వానికి వివరంగా చెప్పాం..’ అని ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ చెప్పుకొచ్చారు.

నిజానికి, సినిమా షూటింగులు అంత తేలికైన వ్యవహారం కాదు. టెక్నీషియన్లను పొరుగు రాష్ట్రాల నుంచీ.. అవసరమైతే విదేశాల నుంచీ తీసుకురావాల్సి వస్తుంది. హీరోయిన్లు ముంబై నుంచి ఎక్కువగా వస్తుంటారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇక, సినిమా షూటింగుల కోసం ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం తిరగాల్సి వస్తుంది యూనిట్‌ సిబ్బందికి. వాన పాటలు, హెవీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌.. వీటన్నిటి సమయంలో సోషల్‌ డిస్టెన్సింగ్‌ ఎంతవరకు సాధ్యం.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ హీరో – హీరోయిన్ల మధ్య పండాలంటే అది మళ్ళీ ఇంకో సమస్య. అయితే, పూర్తిగా సినిమా షూటింగులు బంద్‌ చేసుకోవడం కంటే, సాధ్యమైనంతమేరకు కొన్ని ‘పరిమితులకు లోబడి’ సినిమా షూటింగులు జరపడమే ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది. సినిమా షూటింగులు మొదలవుతాయ్‌ సరే.. మరి, రిలీజ్‌ల మాటేమిటి.? సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి.? ఇది ఇంకో సమస్య.

త్వరలో సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశం వుంది గనుకనే.. ముందుగా సినిమా షూటింగుల కోసం ప్రభుత్వానికి సినీ పరిశ్రమ విజ్ఞప్తి చేసిందని అనుకోవాలి. సినిమా పరిశ్రమ నుంచి ప్రభుత్వాలకి వచ్చే ఆదాయం ఎక్కువే గనుక.. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు కాసిన్ని వెసులుబాట్లు అదనంగా కల్పించాల్సి వుంటుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...