Switch to English

రివ్యూ : పాతాళ్ లోక్ (వెబ్ సిరీస్)

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

చీకటి రాజ్యపు నెత్తుటి మరకలతో “పాతాళ్ లోక్”

ప్రస్తుతం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతబడి ఓటీటీ ప్లాట్ ఫాంలు కళకళలాడుతున్నాయి. అదే బాటలో అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలయిన ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్ అందరి మన్ననలు అందుకుంటోంది. చీకటి సామ్రాజ్యపు నేపధ్యంలో క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్థాపించిన నిర్మాణ సంస్థ ‘క్లీన్ స్లేట్ ఫిలింస్’ ఈ సిరీస్ నిర్మించింది. తరుణ్ తేజ్‌పాల్ రచించిన ‘ది స్టోరీ ఆఫ్ మై అసాసిన్స్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌ని సుదీప్ శర్మ రచించగా అవినాష్ అరుణ్, ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు.

కథేమంటే :

ఢిల్లీలోని జమునా పార్ పోలీస్ స్టేషనులో ఇనస్పెక్టరుగా భాధ్యతలు నిర్వర్తిస్తున్న హాతీరామ్ చౌదరి (జైదీప్ అహ్లావత్)కి ఒక పెద్ద కేసును అప్పగిస్తారు. ప్రముఖ జర్నలిస్టు సంజీవ్ మెహ్రా (నీరజ్ కాబి) హత్యకి పథకం పన్నారనే ఆరోపణతో నలుగురు నేరస్థులను పోలీసులు అరెస్టు చేస్తారు. హాతీరామ్ తన సబార్డినేట్ అన్సారీ (ఇష్వక్ సింగ్) సాయంతో ఇన్వెస్టిగేష్న్ మొదలు పెడతాడు. హంతకుల బృందానికి నాయకుడు అయిన విశాల్ త్యాగి అలియాస్ ‘హతోడా’ త్యాగి (అభిషేక్ బెనర్జీ) గురించిన భయంకరమైన వాస్తవాలు తెలుస్తాయి. పరిశోధనలో ముందుకు సాగిపోతున్న హాతీరామ్‌ని హఠాత్తుగా సస్పెండ్ చేసి కేసును సిబిఐకి అప్పగిస్తారు. సస్పెండయిన హాతీరామ్ ఇన్వెస్టిగేషన్ ఆపకుండా కేసుకు సంబంధించిన పెద్ద తలకాయల వరకూ వెళ్ళిపోతాడు. సంజీవ్ మెహ్రాని చంపడానికి పథకం ఎవరు వేసారు.? నలుగురి నేరస్థుల నేపధ్యం ఏమిటి? అనేది సిరీస్ చూసి తీరాల్సిందే.

ఎలా ఉందంటే :

ప్రతి ఎపిసోడ్ నలభై నిమిషాలకి పైగా ఉన్న ఈ సిరీస్ లో మొత్తం తొమ్మిది ఎపిసోడ్స్ ఉన్నాయి. మొదటి ఎపిసోడ్ చూసాక తొమ్మిది ఎపిసోడ్లు చూసేయాలని అనిపించేలా చేయటంలో క్రియేటర్లు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ప్రతి ముఖ్య పాత్రకీ వెనక మరొక ఉపకధ ఉండటం ఈ సిరీస్ ప్రత్యేకత. కథపై, పాత్రచిత్రణపై ఎంతో శ్రద్ధ పెట్టి తీర్చిదిద్దారనేది సిరీస్ ఆసాంతం తెలుస్తూనే ఉంటుంది. అక్కడక్కడ లోటుపాట్లు ఉన్నా ఆసక్తి సన్నగ్లికుండా ఊహించని మలుపులు, సస్పెన్స్, ఒక్కో పాత్ర తాలూకు గతం, వాటి వెనక పరిస్థితులతో ‘పాతాళ్ లోక్’ను మంచి రచనగా మలిచిన రచయితలను మెచ్చుకోకుండా ఉండలేం.

చీకటి రాజ్యంలో భయంకరమయిన వాస్తవాలు, పసిపిల్లలపై జరిగే దారుణాలు, ఆడవారిపై చేసే అఘాయిత్యాలు వంటి దారుణాలని కళ్ళకి కట్టినట్లు చూపించారు. మనుషులను నిర్దాక్షిణ్యంగా చంపేసే పాత్రలు జంతు ప్రేమ చూపించడం అనేది కథలో కీలకాంశంగా చూపించటం అర్థవంతంగా అనిపిస్తుంది. ఒక సాధారణ హత్యాయత్నాన్ని సిబిఐ తన స్వలాభం కోసం టెర్రరిస్ట్ ప్లాట్‌గా ఎలా చిత్రీకరించగలదో, ఫేక్ న్యూస్‌ని మీడియా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలదో చూపిస్తూ స్వర్గ్ లోక్‌లో (ధనిక వర్గం) జరిగే ఏ దారుణంలో అయినా బలయ్యేది పాతాళ్ లోక్ (నిరుపేద వర్గం) వాసులేననే బేస్ పాయింట్ తో నడిపించిన ఈ సిరీస్ అందరికీ నచ్చుతుంది. ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారాల్లో సెన్సార్ అనే అడ్డుగోడ లేకపోవటం వల్ల కాబోలు మైనారిటీలపై జరిగే అకృత్యాలు, ముస్లింలని టెర్రరిస్టులుగా ముద్ర వేయటం, నిమ్న వర్గాల ఆడవారిని అగ్రవర్ణం మగాళ్ళు బలాత్కారం చేయడం లాంటి దృశ్యాలని నిర్భయంగా చిత్రీకరించారు.

స్వర్గ్ లోకంలో వారికుండే యాంగ్జయిటీ ఇబ్బందులు, భర్త అఫైర్లకి గుండె పగిలిన భార్యలు, వయసు తారతమ్యం లేకుండా ఏర్పడే శారీరిక సంబంధాలు, ఒక అవకాశాన్ని అదనుగా వాడుకుని నిచ్చెన ఎక్కే వ్యక్తులు, వారి పాపులారిటీ వెనుక నెత్తుటి మరకలకు ‘పాతాళ్ లోక్’ అద్దం పడుతుంది.

ఎవరెలా :

ఈ సిరీస్‌కి అతి పెద్ద ఎస్సెట్ హాతీరాం చౌదరి పాత్ర. ఆ పాత్రలో జైదీప్ అహ్లావత్ అద్భుతంగా జీవించాడు. పరిశోధనలో భాగంగా అతడు సమస్యకి దగ్గరగా వెళుతున్నపుడు కానీ, ప్రమాదంలో పడినపుడు కానీ అతను ఎలాగైనా తప్పించుకోవాలని ప్రేక్షకుడు కోరుకునేంతగా హాతీరామ్ మనసుకి హత్తుకుపోతాడు. సంజీవ్ మెహ్రాగా నీరజ్ కాబి తన పాత్రకి కావాల్సిన డిగ్నిటీతో పాటు దుర్లక్షణాలని కూడా ఈజ్‌తో చూపించాడు. హథోడా త్యాగిగా అభిషేక్ బెనర్జీ కర్కోటకుడైన హంతకుడు ఎలా వుంటాడనేది కళ్ళకి కట్టాడు. గుల్ పనాగ్, స్వస్తికా ముఖర్జీ, నిహారిక లైరా దత్ మూడు భిన్నమైన లేడీ క్యారెక్టర్స్‌ లో తమ నటనతో ఈ సిరీస్‌కి అదనపు బలంగా నిలిచారు.

సాంకేతిక వర్గం :

చీకటి రాజ్యపు నేపధ్యంలో తెరకెక్కించిన సిరీస్ కి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్ అన్నీ సరిగ్గా కుదిరాయి. ఈ సిరీస్ టెక్నికల్‌గా ఏ బాలీవుడ్ సినిమాకీ తీసిపోదు.

రేటింగ్ : 3/5

సూర్య ప్రకాష్ వేద

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...