Switch to English

బర్త్ డే స్పెషల్‌: అన్నగారు, మరో నూరేళ్లయినా సరిలేరు మీకెవ్వరు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

తెలుగు సినిమాకు కమర్షియల్‌ హంగులు అద్దినది.. తెలుగు సినిమాకు కొత్త పంథా నేర్పించింది.. తెలుగు వారి ఆత్మ గౌరవంను కాపాడినది.. తెలుగు వారికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించి పెట్టింది.. తెలుగు భాషను జాతీయ స్థాయిలో ప్రచారం చేసింది ఒకే ఒక్కరు.. ఆయనే నందమూరి తారక రామారావు.

అభిమానులతో పాటు అందరు కూడా ఆయన్ను అన్నగారు అంటూ ఎంతో అభిమానంగా పిలుచుకునేవారు. సినీవినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని తెలుగు సినిమా చరిత్రలో తనదైన ముద్రను వేసిన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు మన అన్నగారు. ఆయన నటుడిగా సాధించిన విజయాలు ఒక ఎత్తు అయితే రాజకీయాల్లోకి వెళ్లి సాధించిన విజయాలు ఆయన కీర్తిని ఆకాశాన నిలబెట్టాయి.
అద్బుతమైన విజయాలు దక్కించుకున్న అన్నగారు దేశ రాజకీయాలపై కూడా తనదైన ముద్ర వేశారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎప్పటికి చెరిగి పోని ముద్ర వేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న నందమూరి తారక రామారావు అలియాస్‌ ఎన్టీఆర్‌ 97వ జయంతి నేడు. ఈ సందర్బంగా ఆయన గొప్పతనంను మరోసారి చర్చించుకోవడం, ఆయన గురించి ఈ తరం వారికి తెలియజేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.

చిన్న వయసులోనే సినీ జీవితంను ప్రారంభించిన ఎన్టీఆర్‌ 44 ఏళ్ల పాటు సినీ జీవితంను కొనసాగించారు. ఆ 44 ఏళ్లలో తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా నటించాడు. దాదాపుగా 400 సినిమాల్లో నటించి మెప్పించిన నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ ఛారిత్రాత్మక, పౌరాణిక, సాంఫీుక, జానపధ చిత్రాలను చేశాడు. అత్యధిక పాత్రలు వేసిన నటుడిగా రికార్డు సాధించారు.

అన్నగారు కృష్ణుడిగా వేశం కట్టాడు అంటే నిజంగా ఇలాగే కృష్ణుడు ఉండేవాడేమో అనుకునేవారు. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన ఎన్టీఆర్‌ హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తెలుగు సినిమాకు సేవ చేశారు. రామకృష్ణ సినీ స్టూడియోను నిర్మించిన ఎన్టీఆర్‌ అన్ని రంగాల్లో తనదైన ముద్రను వేశారు.
తెలుగు వారి ఆల్‌టైం ఫేవరేట్‌ హీరోగా ఎన్టీఆర్‌ నిలిచాడు. ఎన్టీఆర్‌ సినీ జీవితం ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. హీరోగా ఇప్పుడే కాదు రాబోయే మరో వంద ఏళ్లలో కూడా అన్నగారు ఎన్టీఆర్‌కు సరిరారు మరెవ్వరు.

సినిమా రంగంలో ఎంతటి విజయాలను దక్కించుకున్నాడో అంతకు మించి రాజకీయ రంగంలో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అప్పటి వరకు ఉన్న పార్టీలు తెలుగు వారి ఆత్మగౌరవంకు విలువ ఇవ్వకుండా, తెలుగు వారు అంటే కనీసం లెక్క చేయని జాతీయ పార్టీలు ఉన్న సమయంలో ఎన్టీఆర్‌ తెలుగు జాతి ఆత్మగౌరవంను కాపాడే ఉద్దేశ్యంతో తెలుగు దేశం పార్టీని ప్రారంభించారు.

పార్టీ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు అప్పటి వరకు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన ఘనత దక్కించుకున్నారు. సీఎంగా అన్నగారు ఉన్న సమయంలో తీసుకు వచ్చిన మార్పులు, చేసిన చట్టాలు, సంస్కరణలు ఇంకా కూడా అమలులో ఉన్నాయి. వాటినే దేశ వ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నారు అనడంలో సందేహం లేదు.
కొన్ని కారణాల వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించబడ్డా ఆయన రాజకీయాల్లో సరిలేరు మీకెవ్వరు అనిపించుకున్నారు. అన్నగారి స్థాయి రాజకీయ నాయకుడు రాబోయే వందేళ్లలో రారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈతం, ఆ తరం ఏతరం అయినా అన్నగారు ఎన్టీఆర్‌ను సినీ మరియు రాజకీయ రంగంలో మించిన వారు ఉండరు.. రాబోరు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...