నేడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి. ఈ సందర్భంగా తెలుగు వారందరూ ఆయనకి సోషల్ మీడియా ద్వారా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పెద్దగా అన్నీ తానై, అందరి అవసరాలను తీరుస్తున్న మెగాస్టార్ చిరంజీవి కూడా అన్నగారు ఎన్.టి.ఆర్ జయంతి సందర్భంగా ‘ఓ స్వీట్ మెమొరీ’ని తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
‘తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం
తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం
నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.
వారితో కలిసి నటించడం నా అదృష్టం.
పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ…’
అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆయనతో ఉన్న ఓ అపూర్వమైన ఫోటోని షేర్ చేస్తూ ‘ఎ స్వీట్ మెమొరీ’ ఐ ఆ ఫోటోకి టాగ్ చేసి, అన్నగారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు మన మెగాస్టార్ చిరంజీవి.
అన్నగారు #NTRJayanthi సందర్భంగా 'ఓ స్వీట్ మెమొరీ' అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆయనతో ఉన్న ఓ అపూర్వమైన ఫోటోని షేర్ చేస్తూ 'నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం' అంటూ ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.#LegendaryNTRJayanthi #ChiruEmperorOfTFI #NTR https://t.co/Jn91FuCpAA
— TeluguBulletin.com (@TeluguBulletin) May 28, 2020
605326 731012I feel this really is very best for you: Soccer, Football, Highlight, Live Streaming 659717