Switch to English

పాపం.. ఎంత చేసినా నెగిటివేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఏపీలో అధికార వైఎస్సార్ సీపీకి కాలం అస్సలు కలిసి రావడంలేదనిపిస్తోంది. ఎంత చేసినా, ఏం చేసినా సానుకూలత కంటే ప్రతికూలతే ఎక్కువ ప్రతిబింబిస్తోంది. అనాలోచిత నిర్ణయాల వల్లో లేక రాజకీయాలు సరిగా చేయలేకపోవడం వల్లో అన్నింటా నెగిటివ్ ఫలితాలే చూడాల్సి వస్తోంది. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ హామీల అమలులో చిత్తశుద్ధితోనే వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబుతో పోలిస్తే జగన్ ఎన్నో రెట్లు మెరుగు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాలు, నిరుద్యోగ భృతి వంటి విషయాల్లో చంద్రబాబు ఎన్ని పిల్లమొగ్గలు వేశారో ఏపీ ప్రజలకు తెలుసు. ఆ ఫలితమే మొన్నటి ఎన్నికల్లో జగన్ కు భారీ మెజార్టీ దక్కడానికి కారణమైంది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్.. తన హామీల అమలుపై దృష్టిపెట్టారు. ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. నిజానికి ఇదే పని చంద్రబాబు చేసి ఉంటే, ఆయన అనుకూల మీడియాలో ఇవన్నీ పెద్ద ఎత్తున హోరెత్తిపోయేవి. కానీ జగన్ కు ఆ మీడియా మొత్తం వ్యతిరేకం కావడంతో వీటిని పట్టించుకోవడంలేదు.

చేసింది చెప్పుకోవడంలోను.. ప్రతిపక్షాలు, వ్యతిరేక మీడియాలో వచ్చే కథనాలను ధీటుగా తిప్పికొట్టడంలోనూ అధికార పార్టీ విఫలమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమకు మీడియా సపోర్ట్ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. నిజానికి కరోనా విషయంలో ఏపీ భేషుగ్గా పనిచేస్తోందని సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశంసించింది. కరోనా కట్టడిలో ఏపీ కృషి బాగుందని ఓ జాతీయ ఛానల్ సైతం కొనియాడింది. కానీ ప్రధాన మీడియా వైసీపీకి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఇలాంటి విషయాలు మరుగున పడిపోతున్నాయి.

‘‘ఏపీ, తెలంగాణల్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి మీడియా కేసీఆర్ కు మద్దతుగా నిలవక తప్పని పరిస్థితులున్నాయి. కానీ ఏపీలో అలా లేదు. మేం ఎంత చేస్తున్నా.. అసలు విషయాన్ని పక్కన పెట్టేసి, వ్యతిరేక కథనాలకే ఇక్కడి మీడియా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణలో కలెక్టర్లు విడుదల చేస్తున్న కరోనా లెక్కలకు, ప్రజారోగ్య విభాగం వెల్లడించే లెక్కలకు మధ్య తేడాలుంటున్నాయి. కానీ ఈ విషయాన్ని అక్కడి మీడియా పట్టించుకోదు. ఏపీలో మాత్రం అన్ని వివరాలతో ఎప్పటికప్పుడు లెక్కలు విడుదల చేస్తున్నా.. కేసులు దాచేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని వైసీపీకి చెందిన పలువురు నేతలు విమర్శిస్తున్నారు.

మరోవైపు చాలా విషయాల్లో కోర్టుల్లో ప్రతికూల తీర్పులు రావడం కూడా వైసీపీకి ఇబ్బందిగా పరిణమించింది. ఆయా అంశాల్లో కాస్త తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు. ఇంగ్లిష్ మీడియం అంశాన్నే తీసుకుంటే.. రాష్ట్రంలో ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ కోర్టు దానిని కొట్టివేసింది. అలాకాకుండా ప్రతి తరగతిలోనూ రెండు సెక్షన్లు ఇంగ్లిష్ మీడియం, ఒక సెక్షన్ తెలుగు మీడియం పెట్టి ఉంటే సరిపోయేది.

ఇలా.. చాలా అంశాల్లో ప్రభుత్వం సరిగా వ్యవహరించకపోవడంతోనే కోర్టుల్లో ఎదురుదెబ్బలు తినాల్సి వస్తోందని అంటున్నారు. ఇకనైనా ఇలాంటి విషయాల్లో అధికార పార్టీ జాగరూకతతో వ్యవహరించాలని సూచిస్తున్నారు.

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...