Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: ‘కరోనా’తో తల్లకిందులవుతున్న జీవితాలు.!

బయట జరుగుతున్న ప్రచారం వేరు.. గ్రౌండ్‌ రియాల్టీ వేరు. కరోనా వైరస్‌ గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోంది. ఏయే రంగాలకు ఎంత నష్టం.? అన్న దిశగా చాలా చాలా చర్చలు జరుగుతున్నాయి. జీడీపీ లెక్కల గురించి మాట్లాడుకుంటున్నాం.. ఉద్యోగ, ఉపాధి రంగాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకేవేవో మాటలు మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ, సామాన్యుడు ఏమనుకుంటున్నాడు.? మేధావులు ఏం చెబుతున్నారు.? కరోనా వైరస్‌ ప్రభావం ఎన్నాళ్ళు.? ఇలా ఎక్కడ చూసినా ఒకటే చర్చ.

ప్రపంచం ఇంతకు ముందెన్నడూ చూడని పరిస్థితి ఇది. ‘ప్రపంచ వ్యాప్త లాక్‌డౌన్‌’ అనేది చాలా భయంకరమైన పరిస్థితి. అన్ని దేశాల్లోనూ లాక్‌డౌన్‌ వుందని చెప్పలేం. కానీ, కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌ డౌన్‌ తప్ప ఇంకో మార్గం లేదు. కొన్ని దేశాల్లో ప్రభావం తొలుత తక్కువగా కన్పిస్తున్నా, ఆ తర్వాత అక్కడ పరిస్థితులు చేజారిపోతున్నాయి. మన దేశం విషయానికొస్తే.. ఇక్కడి పరిస్థితులు చాలా భిన్నం. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు చాలా వున్నాయి. అలాంటి వారికి నెలల తరబడి లాక్‌డౌన్‌ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

‘ఉపాధి కోసం వచ్చాం.. మేస్త్రీలు డబ్బులివ్వలేదు.. ప్రభుత్వాలు ఆదుకోవడంలేదు.. పెద్ద మనసున్నోళ్ళు భోజనం పెడుతున్నారు.. కానీ, ఇలా ఎన్నాళ్ళు.? వెళుతూ వెళుతూ దారిలో ప్రాణం పోతుందనే భయం వున్నా.. మాకింకో మార్గం లేదు.. సొంతూరికి వెళితే, మా మనుషుల మధ్య మేం ఎలాగోలా బతికేస్తాం..’ అని వలస జీవులు చెబుతున్నాయి. ఈ క్రమంలో కొందరు మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోతుండడం అత్యంత దురదష్టకరం.

ఇలాంటి చావులు ప్రస్తుతానికైతే లెక్కల్లోకి రావడంలేదు. ‘కరోనా చావుల కంటే.. కరోనా కారణంగా ఆకలి చావులే చాలా చాలా ఎక్కువ..’ అన్న వాదన నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. అది నిజం కూడా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ, గ్రౌండ్‌ రియాల్టీ ఇంకోలా వుంది. కేంద్రం, రాష్ట్రం.. ఎంత చేసినాసరే.. అవి వలసదారులకి, సామాన్యులకి ఊరటనిచ్చే పరిస్థితి కన్పించడంలేదు. మరెలా.? ఈ సంక్షోభం నుంచి దేశం గట్టెక్కేదెలా.? ప్రస్తుతానికి ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

భయపెడుతున్న ‘నిసర్గ’ తుఫాన్‌

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి నైరుతి దిశగా కదులుతోంది. ఈ తుఫాన్‌తో మహారాష్ట్ర, గుజరాత్‌లతో పాటు పలు రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందంటూ వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్‌...

త్రివిక్రమ్ – వెంకీ – నాని.. మళ్ళీ ఫేకే!

త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో చిత్రంతో తిరిగి టాప్ ఫామ్ లోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తో సినిమాకు కమిటయ్యాడు మాటల మాంత్రికుడు. ఎన్టీఆర్ తో చేసేది...

పారిపోయి అందరిని టెన్షన్‌ పెట్టిన కరోనా పాజిటివ్‌ పేషంట్‌

కరోనా ఉందనే అనుమానం ఉంటేనే వారికి ఆమడ దూరంలో ఉండాలని డాక్టర్లు మరియు పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కడ కరోనా పేషంట్‌ కనిపించినా కూడా వెంటనే వారిని పట్టుకుని వెళ్లి ఐసోలేషన్‌లో వేస్తున్నారు. వారు...

ఫ్లాష్ న్యూస్: తల్లి శవంను రోడ్డున పడేసిన కొడుకు

వృద్యాప్యంలో తమకు తోడుగా ఉండి, చనిపోయిన సమయంలో దహన సంస్కారాలు చేస్తారనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు కూడా కొడుకో లేదంటే కూతురు కావాలని కోరుకుంటారు. కాని మంగళగిరికి చెందిన ధనలక్ష్మి అనే అభాగ్యురాలు...

కరోనా టెస్టింగ్‌ కిట్‌ మింగేసిన కోతులు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతానికి చెందిన వారిని కోతులు మరింతగా భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మీరట్‌లో కరోనా అనుమానితుల నుండి స్వీకరించిన శాంపిల్స్‌ను కొన్ని కోతులు మింగేయడంతో...