యావత్ ప్రపంచమే కరోనా దెబ్బకి విలవిల్లాడుతోందిప్పుడు. అమెరికాలో పరిస్థితులు రోజురోజుకీ దయనీయంగా మారుతున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా ఎప్పుడూ అగ్ర రాజ్యమేనని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెబుతున్నా, కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా భారత ప్రభుత్వాన్ని ‘హడ్రాక్సీ క్లోరోక్విన్’ మందుల కోసం అభ్యర్థించడంలోనే.. అగ్రరాజ్యం పరిస్థితి ఏంటన్నది సుస్పష్టమయిపోయింది.
నిన్న ఒక్క రోజే అమెరికాలో దాదాపు 2 వేల మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ‘పరిస్థితి ముందు అంచనా వేసినంత దారుణంగా వుండకపోవచ్చు..’ అని ట్రంప్ కొత్త పల్లవి అందుకోవడం సంగతెలా వున్నా, అమెరికాలో కరోనా మరణాలు మాత్రం ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
అవును, అమెరికాతో ప్రపంచ దేశాలన్నిటికీ ఏదో ఒక రకంగా సంబంధాలున్నాయి. అమెరికాలో నివసిస్తున్నవారిలో చాలామంది ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందినవారే. ఆ మాటకొస్తే, అమెరికా జనాభాలో మెజార్టీ ఈ వలసదారులదే. అందునా, మన భారతీయులు అమెరికాలో ఎక్కువగానే సెటిలయ్యారు. సెటిలైనవారే కాదు, ఉద్యోగాల నిమిత్తం వెళ్ళినవారు, చదువుల నిమిత్తం వెళ్ళినవారు కూడా పెద్ద సంఖ్యలోనే వున్నారు. వీరిందరి పరిస్థితిపై మన దేశంలోనూ ఆందోళన ఎక్కువగా కన్పిస్తోంది.
‘మేం ఇక్కడ క్షేమంగానే వున్నాం.. మా బాధంతా మా గురించి కాదు.. ఇండియాలో వున్న మీ గురించే.. ఇక్కడ అంతా సిస్టమాటిక్ లైఫ్.. ఇక్కడ కాస్తంత జాగ్రత్తగానే వుంటారు.. ఇక్కడ వైద్య సౌకర్యాలూ మెరుగ్గానే వున్నాయి.. ప్రస్తుతం అమెరికాలో వున్నట్లుగా కరోనా వైరస్, ఇండియాలో విస్తరిస్తే.. పరిస్థితులు అత్యంత భయానకంగా వుంటాయి..’ అని అమెరికాలో స్థిరపడ్డ ఓ ఎన్నారై చెబుతున్నారు.
ఎంఎస్ చదివేందుకు అమెరికా వెల్ళిన ఓ తెలుగు యువకుడు, అక్కడి పరిస్థితుల గురించి వివరిస్తూ ‘మేం క్షేమంగానే వున్నాం.. నాలుగ్గోడల మధ్య బందీ అయి వున్న మాట వాస్తవమే అయినా.. పరిస్థితి మరీ దారుణంగా ఏమీ లేదు..’ అని చెప్పుకొచ్చాడు. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో అక్కడి భారత సంతతికి చెందిన వైద్యులు అందిస్తున్న సేవలు అత్యద్భుతమని అమెరికన్లు కొనియాడుతుండడం గమనార్హం.
195555 122642Most beneficial gentleman speeches and toasts are made to enliven supply accolade up towards the wedding couple. Newbie audio system the attention of loud crowds should always think about typically the fantastic norm off presentation, which is their private. greatest man speaches 322886
985692 704537Lastly, got what I was looking for!! Ive genuinely enjoying every small bit of this. Ecstatic I stumbled into this post! and also Ive bookmarked to look at unique information for your blog post. 382826
661220 985662Most what i read online is trash and copy paste but i feel you offer something different. Keep it like this. 589053
781765 706429We stumbled more than here coming from a different web page and thought I might check issues out. I like what I see so now im following you. Appear forward to exploring your internet page but again. 546290
116618 320073I conceive this web internet site holds some real superb data for every person : D. 173688
405096 140051hey there, your web site is low-cost. We do thank you for work 350813