Switch to English

ఎక్సక్లూసివ్: ఈ రాజకీయ ‘కరోనా’కి మందు లేదు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ప్రపంచమంతా కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంటే, రాజకీయ నాయకులు మాత్రం వికటాట్టహాసం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ రాజకీయ సంక్షోభంలో కొత్త ట్విస్ట్‌. ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ ఈ రోజు తన రాజీనామాని ప్రకటించారు. దాంతో, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ సర్కార్‌ ఈ రోజుతో ఖతం అయినట్లు లెక్క. ఇంకేముంది, భారతీయ జనతా పార్టీ మధ్య ప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఈ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నిజానికి, ఈ సంక్షోభానికి కారణం భారతీయ జనతా పార్టీనే. బీజేపీ కనుసన్నల్లోనే మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తెరపైకొచ్చింది. వ్యవహారం సుప్రీంకోర్టుదాకా వెళ్ళింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కమల్‌నాథ్‌ చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి ఆయన చేతులెత్తేయాల్సి వచ్చింది.

దేశంలో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతున్న విషయం విదితమే. ఇది నిజంగానే పెను విపత్తు. ఈ పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఒకింత బాధ్యతగా వ్యవహరించాల్సి వుంది. కానీ, దురదృష్టవశాత్తూ మన దేశంలో రాజకీయ నాయకుల నుంచి ‘బాధ్యత’ని ఆశించలేం. మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన రాజకీయ నాయకులెవరికీ కరోనా భయం లేదు. ప్రజలంటే బాధ్యత అసలే లేదు. అన్నిటికీ మించి, దేశంలో ప్రజలు తీవ్రమైన భయాందోళనల్లో వున్న వేళ, భారతీయ జనతా పార్టీ, మధ్యప్రదేశ్‌ రాజకీయాలపై ఇంత ఫోకస్‌ ఎలా పెట్టగలిగిందో ఎవరికీ అర్థం కావడంలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా చుట్టూ జరుగుతున్న రాజకీయాల్ని చూస్తున్నాం. అంతకు మించిపోయేలా మధ్యప్రదేశ్‌లో రాజకీయం ‘న భయం న సిగ్గు’ అన్నట్లు నడిచింది. ‘ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసింది.. మళ్ళీ మాదైన రోజు వచ్చి తీరుతుంది..’ అంటూ కమల్‌నాథ్‌, బీజేపీని హెచ్చరించడం చూస్తోంటే, మరోమారు మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఇంకా గట్టిగానే తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...