Switch to English

ఓ పిట్టకథ మూవీ రివ్యూ

Critic Rating
( 2.00 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow
Movie O Pitta Katha
Star Cast Nitya Shetty, Viswant Duddumpudi, Sanjay Rao
Director Chandu Muddu
Producer V Anand Prasad
Music Pravin Lakkaraju
Run Time 2 Hr 8 Min
Release 03/06/2020

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2/5

నటీనటులు: సంజయ్‌ రావు, విశ్వంత్‌ దుద్దంపూడి, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ..
నిర్మాత: వి. ఆనందప్రసాద్‌
దర్శకత్వం: చెందు ముద్దు
సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌ యన్‌
మ్యూజిక్: ప్రవీణ్‌ లక్కరాజు
ఎడిటర్‌: డి.వెంకటప్రభు
రన్ టైం: 2 గంటల నిముషాలు
విడుదల తేదీ: మార్చి 06, 2020

వినడానికి ఓ పిట్టకథగా అనిపించినా ఇది చాలా పెద్దకథే అంటూ తీశారు నుంచి రిలీజ్ ప్రమోషన్స్ దాకా అందరినీ ఆకట్టుకున్న చిన్న సినిమా ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనందప్రసాద్‌ నిర్మాతగా చెందు ముద్దు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ద్వారా సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావు హీరోగా పరిచయమవుతున్నాడు. విశ్వంత్‌ దుద్దుంపూడి, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ‘ఓ పిట్టకథ’కి మెగాస్టార్ చిరు నుంచి ఎందరో స్టార్స్ సపోర్ట్ గా నిలిచారు. మరి వారి సపోర్ట్ ని నిలబెట్టేలా ఈ ‘ఓ పిట్ట కథ’ ఉందో? లేదో అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

కాకినాడలోని వీర్రాజు కుమార్తె వెంకట లక్ష్మీ(నిత్య శెట్టి).. ఫ్రెండ్స్ తో అరకు టూర్ వెళ్లిన వెంకటలక్ష్మి కిడ్నాప్ కి గురవుతుంది. దాంతో వీర్రాజ, అతని అల్లుడు క్రిష్(విశ్వంత్) ఎస్.ఐ బ్రహ్మాజీ ని కలుస్తారు. అక్కడ తెలిసే కథ.. క్రిష్ వెంకటలక్ష్మి ని పెళ్లి చేసుకోవలనుకుంటాడు. కానీ అప్పటికే వెంకటలక్ష్మి ప్రభు(సంజయ్ రావు)లు ప్రేమలో ఉంటారు. ఈ ఇద్దరిలో ఎవరు వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుంటారు అనే సస్పెన్స్ టైంలో వెంకటలక్ష్మి మిస్ అవుతుంది. ఇక అక్కడి నుంచి క్రిష్, ప్రభు మరియు బ్రహ్మాజీలు కలిసి వెంకటలక్మి కేసుని ఎలా సాల్వ్ చేశారు?అసలు వెంకటలక్ష్మిని ఎవరు? ఎందుకు? కిడ్నాప్ చేశారు? అనే ప్రశ్నల సమాధానమే ‘ఓ పిట్టకథ’.

తెర మీద స్టార్స్..

సినిమా కథ మొత్తం 5 పాత్రల చుట్టూ తిరుగుతుంది. అందుకే ది బెస్ట్ అనిపించుకుంది మాత్రం హీరోయిన్ నిత్యా శెట్టి. విలేజ్ గర్ల్ గా క్యూట్ లుక్స్ తో పాటు బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఇక విశ్వంత్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాగానే చేసాడు. తొలి పరిచయమైన సంజయ్ రావు జస్ట్ ఓకే ఓకే అనిపించాడు. ఇతను ఇంకా బెటర్ గా చేసుంటే సినిమాకి చాలా ప్లస్ అయ్యేది. అలాగే సంజయ్ ఫ్రెండ్ పాత్ర అయిన పండు పాత్రలో చేసిన నటుడు సూపర్బ్ కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా బాగా నవ్వించాడు. బ్రహ్మాజీ ఓకే. మిగిలిన పాత్రలు చేసిన వారు కూడా వారి పరిధిమేర చేశారు.

తెర వెనుక టాలెంట్..

‘ఓ పిట్టకథ’ టెక్నికల్ గా సూపర్బ్ సినిమా అని చెప్పాలి. కాకినాడ మరియు గోదావరి అందాలను సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ అద్భుతంగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ మరియు నటీనటులను ది బెస్ట్ గా ప్రెజంట్ చేశారు. ప్రవీణ్ లక్కరాజు సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆ విజువల్స్ కి మరింత బ్యూటీని తెచ్చాడు. వెంకట్ ప్రభు ఎడిటింగ్ చాలా స్లోగా ఉంది. ఇంకాస్త బెటర్ గా కట్ చేసి సినిమాని స్పీడప్ చేయాల్సింది.

ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ చెందు ముద్దు విషయానికి వస్తే.. సినిమా ఎండ్ టైటిల్స్ లో కన్ఫ్యూషన్ కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ అని వేసుకున్నాడు. అన్నట్లుగానే కన్ఫ్యూషన్ స్క్రీన్ ప్లే అండ్ ట్విస్ట్ లతో అఆడియన్స్ కి భీభత్సమైన థ్రిల్స్ ఇచ్చేస్తున్నా అనుకున్నాడు. కానీ ఆ థ్రిల్స్ ఏవీ అంతగా కిక్ ఇవ్వలేదు. కథ పరంగా కొత్తదేం కాదు కానీ విజువల్ నేరేషన్ గా చెప్పాలి అనుకున్నారు. విజువల్స్ వర్కౌట్ అయ్యాయి, కానీ లవ్ స్టోరీలో మాత్రం మేజిక్ అయితే క్రియేట్ చేయలేదు. స్క్రీన్ ప్లే అక్కడక్కడా మెరిసినా, ఓవరాల్ గా పెద్ద కిక్ ఇవ్వలేదు. డైలాగ్స్ బాగున్నాయి, ముఖ్యంగా సందర్భానుసారంగా వచ్చే కామెడీని చాలా బాగా రాసుకున్నాడు. డైరెక్టర్ గా డీసెంట్ ఫిలిం తీసాడు, కుర్రోడిలో విషయం ఉంది అనే పేరు తెచ్చుకుంటాడు. భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్ ఉన్నాయి.

విజిల్ మోమెంట్స్:

– సందర్భానుసారంగా అక్కడక్కడా వచ్చే కామెడీ
– బ్యూటిఫుల్ విజువల్స్
– మ్యూజిక్
– కొన్ని ట్విస్ట్స్

బోరింగ్ మోమెంట్స్:

– తెలిసిన కథే
– బోరింగ్ నేరేషన్
– సాగదీసిన కథనం
– బోరింగ్ ఎడిటింగ్
– మొదటి నుంచీ స్లోగా సాగడం
– లవ్ స్టోరీలో మ్యాజిక్ లేకపోవడం

విశ్లేషణ:

‘ఓ పిట్టకథ’ – నిజంగా స్టోరీ లైన్ పరంగా అందరికీ తెలిసిన పిట్టకథే కానీ కథనంతో ట్విస్ట్ లు పెద్దగా వర్కౌట్ కాకపోవడం వలన ఈ పిట్టకథ బోరింగ్ గా ఉంటుంది. డైరెక్టర్ చెందు ముద్దు లో బడ్జెట్లో ఒక విజువల్ లవ్ స్టోరీ చెప్పాలనుకున్నాడు.. అన్నీ కుదిరాయి కానీ లీడ్ కాస్టింగ్ లో లో మ్యాజిక్ వర్కౌట్ అవ్వకపోవడంతో ఏ ప్రేమ కథకి పెద్దగా కనెక్ట్ అవ్వరు. ప్రేమ కథకి కనెక్ట్ కాకపోతే ఇక అందులో ఏం జరిగినా మనకు పెద్ద కిక్ ఇవ్వవు దాంతో ఈ ‘ఓ పిట్టకథ’ ‘ఓ హిట్టు కథ’గా నిలవలేకపోయింది.

ఇంటర్వల్ మోమెంట్: మొదటి నుంచీ బోరింగ్ అనిపించినా, ఇంటర్వల్ ట్విస్ట్ బాగుందిగా..

ఎండ్ మోమెంట్: ఇంత కన్ఫ్యూషన్ ఎందుకు బాబు.. స్ట్రెయిట్ గా ఎంటర్టైన్మెంట్ తో చెప్పుంటే బాగుండేదిగా..

చూడాలా? వద్దా?: మ్యాజిక్ లేని ఈ లవ్ స్టోరీని చూడడం కష్టమే..

బాక్స్ ఆఫీస్ రేంజ్: స్టార్స్ లేకుండా జెన్యూన్ గా ట్రై చేసిన ‘ఓ పిట్టకథ’కి మొదటి నుంచీ స్టార్ డైరెక్టర్స్ నుంచీ మెగాస్టార్ వరకూ దీనికి సపోర్ట్ చేయడంతో కొంత క్రేజ్ వచ్చింది. ఫైనల్ గా థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులను అక్కడక్కడా కాస్త నవ్వులు పూయించినా ఓవరాల్ గా కనెక్ట్ కాలేకపోయింది. కావున ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హోల్డ్ అయ్యి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం చాలా కష్టమే సుమీ.. ఇవాళ ఓపెనింగ్స్ ఉన్నా రేపటి నుంచి లో కలెక్షన్స్ చూడాల్సి వస్తుంది.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2/5

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...