హిట్ వచ్చిన దర్శకులను నిర్మాతలు హీరోలు బుక్ చేసుకోవడం మన ఇండస్ట్రీలో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఒకటి కాదు ఏకంగా రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమాలు నిర్మించేందుకు పలువురు హీరోలు అడ్వాన్స్‌లు పట్టుకుని వెంట తిరుగుతున్నారు. ఇక హీరోలు కూడా వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించేందుకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయనకు సక్సెస్ గ్రీటింగ్ చెబుతూ మెల్లగా ఆయన దృష్టిలో పడేందుకు యంగ్ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారట.
దర్శకుడు వెంకీ కుడుముల మొదటి సినిమా ఛలో మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, తాజాగా భీష్మ చిత్రాన్ని కూడా హిట్ చేసుకున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా భీష్మ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంటుంది. మాస్ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల వారిని ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. కథ సింపుల్‌గా ఉన్నా కూడా వెంకీ ఆ కథను నడిపించే స్క్రీన్‌ప్లే మరియు ఎంటర్టైన్మెంట్తో సినిమాలను హిట్ చేసుకుంటున్నాడు.
భీష్మ సక్సెస్‌తో వెంకీ కుడుముల భారీగా పారితోషికం పెంచేయవచ్చు. భీష్మకు తీసుకున్న పారితోషికంకు డబుల్ ట్రిపుల్ ఇచ్చేందుకు కూడా పలువురు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు వెంకీ ఎవరి వద్ద అడ్వాన్స్ తీసుకోలేదు, ఏ హీరోకు కూడా కమిట్ అవ్వలేదు. త్వరలోనే ఆయన మూడవ సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తాడని ఆశిద్దాం.
170135 389991I adore foregathering helpful info, this post has got me even a lot more information! . 890290
474106 372628Some truly good and helpful info on this internet site, likewise I conceive the style holds excellent functions. 546035
579117 252191The place else may just anyone get that kind of info in such a perfect method of writing? 260732