Switch to English

టిబి స్పెషల్: ఇంకెంతమంది నిర్భయలు, ఇకనైనా మన చట్టాల్ని మార్చరా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

దేశంలో చట్టాలెన్ని వచ్చినా.. అతివలపై ఆగడాలు ఆగడంలేదు. నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినా.. కామాంధుల దురాగతాలకు కళ్లెం పడటంలేదు. మన చట్టాల పదును తగ్గడమే ఇందుకు కారణమా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. శిక్షలు ఎంత కఠినంగా ఉంటే నేరాలు అంత తక్కువగా జరుగుతాయి. కానీ మన దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నం. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతంలో ఎంత మందికి శిక్ష పడింది? ప్రధాన నిందితుడు ఆత్మహత్య చేసుకోగా.. మైనర్‌ అనే కారణంతో కీలకమైన దోషి మూడేళ్ల శిక్ష తర్వాత బయటకు వచ్చేశాడు.

మిగిలిన దోషులు దర్జాగా జైలులో గడిపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో అమలవుతున్న శిక్షలు ఈ నరరూప రాక్షసులకు కొంచెమైనా భయం కలిగిస్తాయా? అంటే సమాధానం మనమే చెప్పేయొచ్చు. పైగా ఇలాంటి కేసుల్లో అరెస్టు అయినా.. అవి కోర్టులో తేలి శిక్ష పడేసరికి చాలా జీవితం గడిచిపోతుంది. శిక్ష పడిన తర్వాత కూడా అప్పీలుకు వెళ్లడం ద్వారా మరికొంత కాలం గడిపేయొచ్చు. ఇలాంటి వెసులుబాట్లు చాలా ఉండటంతోనే మన దేశంలో నేరాల సంఖ్య తగ్గడంలేదు. ఈ నేపథ్యంలోనే జనాగ్రహం పెల్లుబుకుతోంది.

నాడు నిర్భయ ఘటన జరిగినప్పుడు దేశం ఎలా స్పందించిందో.. ఇప్పుడు ప్రియాంకారెడ్డి కేసులోనూ అదే విధంగా ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ఇలాంటి క్రూరులను చట్టప్రకారం కాకుండా చట్టానికి అతీతంగా శిక్షించాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తోంది. అత్యంత కిరాతకంగా ప్రియాంకను చంపిన నిందితులకు ఒక్క క్షణం కూడా జీవించే అర్హత లేదని నినదిస్తోంది. పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసినా సరే.. లేకుంటే తమకు అప్పగించినా సరే.. ఏం చేసినా పర్లేదని, వారి గొంతులో ప్రాణం మాత్రం ఉండకూడదని తీర్మానిస్తోంది. అయితే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని వాదించేవారూ లేకపోలేదు.

చట్టప్రకారమే నిందితులను శిక్షించాలని కోరేవారూ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారమైతే నిందితులకు సరైన శిక్షలు పడటంలేదనేది మెజార్టీ అభిప్రాయంగా వినిపిస్తోంది. ఎప్పుడో బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలనే మనం ఇంకా అనుసరిస్తున్నామని, మారిన కాలంతోపాటు వాటిని కూడా మార్చాల్సిన అవసరం ఉందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే విధంగా కఠిన చట్టాలు తీసుకురావాలని పేర్కొంటున్నారు.

అప్పుడే ఓ నిర్భయ, ఓ ప్రియాంక, ఓ మానస ఘటనలు జరగవని చెబుతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. బ్రిటిష్‌ కాలంనాటి చట్టాలను మారుస్తామని.. ట్రయల్‌ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్‌ చేసే అవకాశం లేకుండా మార్పులు తీసుకొస్తామని పేర్కొన్నారు. ట్రయల్‌ కోర్టు తర్వాత నేరుగా సుప్రీంకోర్టులోనే తేల్చుకునే విధంగా చట్టం తీసుకొస్తామని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మన చట్టాలకు పదును పెట్టక తప్పదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...