Switch to English

సినిమా రివ్యూ: అర్జున్ సురవరం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

నటీనటులు: నిఖిల్ సిద్దార్థ, లావణ్య త్రిపాఠి..
నిర్మాత: రాజ్ కుమార్ ఆకెళ్ళ – కావ్య వేణుగోపాల్
దర్శకత్వం: టి. సంతోష్
సినిమాటోగ్రఫీ: సూర్య
మ్యూజిక్: సామ్ సీఎస్
ఎడిటర్‌: నవీన్ నూలి
విడుదల తేదీ: నవంబర్ 29, 2019
రేటింగ్: 2/5

మొదట టైటిల్ వివాదం: ‘ముద్ర’ కాస్త ‘అర్జున్ సురవరం’గా మారింది. ఆ తర్వాత పలు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల పలుసార్లు వాయిదాలు పడి ఫైనల్ గా నేడు రిలీజైన సినిమా ‘అర్జున్ సురవరం’. యంగ్ హీరో నిఖిల్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తో సినిమాకి ఒక హైప్ వచ్చింది. పక్కాగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అనే టాగ్ లైన్ తో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

అర్జున్ సురవరం(నిఖిల్ సిద్దార్థ) తన చదువు పూర్తి చేసుకొని పేరెంట్స్ కి ఏమో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని చెప్పుకుంటూ, టీవీ 99 లో తనకి నచ్చిన న్యూస్ రిపోర్టర్ జాబ్ చేస్తుంటాడు. అలాగే బిబిసి ఛానల్ లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అవ్వాలనేది తన డ్రీమ్. అక్కడ కావ్య (లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. అలా హ్యాపీగా గడిచిపోతున్న తనకి ఓ రోజు బిబిసిలో ఆఫర్ వస్తుంది. కట్ చేస్తే ఆ టైంలోనే అతన్ని ఓ క్రైమ్ లో అరెస్ట్ చేస్తారు. ఇంతకీ ఆ క్రైమ్ ఏంటి? అందులో అర్జున్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? ఆ కేసు నుంచి ఎలా బయటకి వచ్చాడు? ఒక రిపోర్టర్ గా తన కేసుని తనే ఎలా చేధించాడు? అన్నదే కథ.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

బాగానే ఇమేజ్ ఉన్న స్టార్ కావడం వలన మొదట హీరో అండ్ హీరోయిన్ గురించి మాట్లాడుదాం. నిఖిల్ సిద్దార్థ్ నటన బాగుంది. ఇందులో డాన్స్ అండ్ ఫైట్స్ విషయంలో డెవలప్ మెంట్ కనిపించిందని చెప్పాలి. ఇక లావణ్య త్రిపాఠి తన పాత్రలో బాగానే చేసింది. ఒక పాటలో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మెయిన్ విలన్ గా చేసిన తరుణ్ అరోరా కూడా బాగానే చేసాడు.

వెన్నెల కిషోర్ అండ్ సత్య పాత్రలు అక్కడక్కడా కొన్ని నవ్వులు ఇస్తాయి. పోసాని కృష్ణమురళి అండ్ నాగినీడు ఎమోషనల్ సీన్స్ ఓకే ఓకే అనిపిస్తాయి. ఇక సినిమా పరంగా చూసుకుంటే.. నిఖిల్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినప్పటి నుంచీ ఇంటర్వల్ బ్లాక్ వరకూ సాగే 25 నిమిషాలు బాగుంది. సెకండాఫ్ లో నిఖిల్ క్రైమ్ ని ప్రూవ్ చేసే సీన్స్, అలాగే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా అనిపిస్తాయి.

ఆఫ్ స్క్రీన్:

టెక్నికల్ గా ఆర్ట్ వర్క్ ది బెస్ట్ అని చెప్పాలి. లొకేషన్స్ చాలా పర్ఫెక్ట్ గా సెలక్ట్ చేసుకున్నారు. అలాగే కథలో తీసుకున్న క్రైమ్ పాయింట్ బాగుంది, చాలా మందికి కనెక్ట్ కూడా అవుతుంది. సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలోని ఎలివేషన్ సీన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

నిఖిల్ బానే చేసాడు, కానీ కొన్ని చోట్ల కమర్షియాలిటీ కోసమే చేసిన సీన్స్ లో తేలిపోతాడు. లావణ్య త్రిపాఠి పాత్రకి కూడా పెద్ద ప్రాధాన్యత లేదు. సినిమా పరంగా మొదటి 30 నిమిషాలు చాలా చాలా బోరింగ్ గా, మరీ రెగ్యులర్ పంథాలో వెళ్తుంది. అలాగే ఇంటరెస్టింగ్ ఇంటర్వల్ తర్వాత సెకండాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. అలా 30 నిముషాలు సాగదీశాక బెటర్ అవుతుంది. ఫైనల్ గా క్లైమాక్స్ అయితే చాలా చాలా వీక్ గా ఉంది. ఎదో కమర్షియల్ సినిమా అని ఛేజ్ లు, కార్ డాషింగ్స్ పెట్టినా పెద్ద కిక్ లేదు. ఎందుకంటే ఎప్పుడో కథ ఆగిపోతుంది, హీరో ఎలివేషన్స్ కోసం సాగదీశారు.

ఆఫ్ స్క్రీన్:

ఇది 2016లో వచ్చిన ”కనిథన్” అనే తమిళ సినిమాకి రీమేక్, అనగా ఈ కథ వచ్చి మూడున్నరేళ్లు దాటింది. సరే ఇక్కడ రెండేళ్లు లేట్ గా స్టార్ట్ చేశారు రిలీజ్ అన్నా ఆన్ టైం ఉందా అంటే అదీ లేదు.. అందువల్ల కథలో మెయిన్ పాయింట్ కొంత కనెక్ట్ అయినా మిగిలిన సీన్స్ అండ్ ట్రీట్మెంట్ చాలా మూస ధోరణిలో ఉంటాయి. అలాగే నిఖిల్ కమర్షియల్ ఇమేజ్ అనే మాయలో యాడ్ చేసిన కొన్ని సీన్స్ వాంటెడ్ గా పెట్టారు అని ఆడియన్స్ కి తెలిసిపోవడమే కాకుండా, చాలా ఓవర్ గా కూడా అనిపిస్తాయి.

కథ వచ్చి చాలా రోజులవ్వడం వలన సినిమా కూడా ఓల్డ్ మూవీ అనే ఫీలింగ్ కలిగిస్తుంది. స్క్రీన్ ప్లే పరంగా ఉన్న బెస్ట్ మోమెంట్స్ అన్ని ఫస్ట్ హాఫ్ లో ఒక ప్లేస్ లో సెకండాఫ్ లో ఒక ప్లేస్ లో వాడడం వలన మిగతా అంతా చాలా బోరింగ్ గా ఉంటుంది. ఇక డైరెక్టర్ గా తాను తీసిన కథనే మళ్ళీ తీసినప్పటికీ తమిళ్ లో చెప్పినంత ఎఫెక్టివ్ గా ఇక్కడ చెప్పలేకపోయారు. కొన్ని సీన్స్ బాగా చేసినప్పటికీ ఓవరాల్ గా ఎమోషన్ ని కనెక్ట్ చేయడంలో, బెటర్ సీన్స్ తీయడంలో డైరెక్టర్ సంతోష్ ఫెయిల్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే ఓకే అనేలా ఉంది.. చాలా చోట్ల విజువల్ మరీ లౌ క్వాలిటీలో ఉంటుంది. అలాగే డిఐ కలరింగ్ కూడా బాలేదు. వీటన్నిటికీ మించి సినిమాలో చాలా చోట్ల గ్రాఫిక్స్ వాడారు. ఆ గ్రాఫిక్స్ ఏంటి మరీ ఇంత వరస్ట్ గా ఉంది అనేలా ఉంది. ప్రొడక్షన్ డిజైనింగ్ అంత బాగోలేదు. అలాగే ఎడిటింగ్ కూడా బాలేదు. 150 నిమిషాల సినిమా అదే బోరింగ్ అంటే చాలా చోట్ల జంప్ కట్ కనపడుతుంది.

విశ్లేషణ:

రిలీజ్ కోసం చాలా రోజులు దోబూచులాడి విడుదలైన ‘అర్జున్ సురవరం’ సినిమా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడంలో కూడా దోబూచులాడింది. ఎలా అంటే ఒక సీన్ బాగుందనిపించుకొని మరో నాలుగు సీన్స్ బోర్ కొట్టించేలా గేమ్ ఆడింది. దాంతో ప్రేక్షకులు మెప్పించలేకపోయిన ఎన్నో కమర్షియల్ సినిమాల జాబితాలో దీన్ని కూడా కలిపేశారు. కథలో పాయింట్ బాగున్నా తీసిన విధానం ఓల్డ్ ఫార్మాట్ లో ఉండడం, ఎంటర్టైన్మెంట్ కూడా పెద్దగా లేకపోవడం వలన ప్రేక్షకులు చాలా వరకూ నిరాశపడతారు. మరీ రెగ్యులర్ రొట్ట కమర్షియల్ సినిమాలు చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. మిగతా వారికి నచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ.

ఫైనల్ పంచ్: అరుణ్ సురవరం – గుడ్ స్టోరీ పాయింట్, బాడ్ ప్రెజంటేషన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...
నటీనటులు: నిఖిల్ సిద్దార్థ, లావణ్య త్రిపాఠి.. నిర్మాత: రాజ్ కుమార్ ఆకెళ్ళ - కావ్య వేణుగోపాల్ దర్శకత్వం: టి. సంతోష్ సినిమాటోగ్రఫీ: సూర్య మ్యూజిక్: సామ్ సీఎస్ ఎడిటర్‌: నవీన్ నూలి విడుదల తేదీ: నవంబర్ 29, 2019 రేటింగ్: 2/5 మొదట టైటిల్ వివాదం: 'ముద్ర' కాస్త 'అర్జున్ సురవరం'గా మారింది. ఆ తర్వాత పలు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల పలుసార్లు వాయిదాలు పడి ఫైనల్ గా నేడు రిలీజైన సినిమా...సినిమా రివ్యూ: అర్జున్ సురవరం