Switch to English

సైరా నరసింహ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

సినిమా రివ్యూ: సైరా నరసింహా రెడ్డి  

నటీనటులు: చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుధీప్, జగపతి బాబు, రవికిషన్, తదితరులు..
ఎడిటర్‌: శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాణం: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
నిర్మాత: రామ్ చరణ్
విడుదల తేదీ: 02 అక్టోబర్ 2019

మెగాస్టార్ చిరంజీవి 13 ఏళ్ళ కల.. బడ్జెట్ రేంజ్ 300 కోట్లు..  బడ్జెట్ ని లెక్క చేయకుండా తండ్రి కల తీర్చడంతో పాటు కనుమరుగైపోయిన మొట్ట మొదటి స్వాతంత్ర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని ప్రపంచానికి చెప్పాలని రామ్ చరణ్ ముందుకు వచ్చి చేసిన పీరియాడిక్ ఫిల్మ్ ‘సైరా నరసింహారెడ్డి’. పాన్ ఇండియా స్టార్స్ నటించిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి డైరెక్టర్. భారీ అంచనాల నడుమ 5 భాషల్లో(తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ) రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం…

కథ:

సిపాయిల తిరుగుబాటు సమయంలో ఝాన్సీ లక్ష్మీ భాయ్(అనుష్క) తన సైనికులలో పోరాట స్ఫూర్తిని నింపడానికి మనకన్నా ముందు ఒక వీరుడు బ్రిటిష్ వారిని భయపెట్టాడు. అతనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి(చిరంజీవి). అలా కథ ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్తుంది. బ్రిటిషర్స్ హయాంలో ఒక్కో ప్రాంతాన్ని చూసుకునే పాలెగర్స్ ఉండేవారు. అలాంటి పాలెగర్స్ లో ఒకడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే మనస్తత్వం ఉన్న నరసింహారెడ్డికి చిన్ననాటి నుంచే బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి తరిమేయాలనే భావన ఉంటుంది. అదే టైంలో బ్రిటిష్ వారు ప్రజలపై అరాచక చర్యలు శృతి మించిపోతాయి. వారి వల్ల తన ప్రజలకి ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుసుకున్న నరసింహారెడ్డి బ్రిటిష్ వారికి ఎదురు తిరుగుతాడు. అంతే కాకుండా రేనాటి ప్రాంత బ్రిటిష్ ఆఫీసర్ కోటపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు. దాంతో సైరా నరసింహారెడ్డికి బ్రిటిష్ వారికి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఒక్కడే అయిన సైరాకి ఎవరెవరు తోడుగా నిలిచారు? రేనాటి ప్రజలకు స్వాతంత్రం ఇవ్వడం కోసం బ్రిటిష్ వారితో సైరా ఎలాంటి దారి ఎంచుకోవాల్సి వచ్చింది.? ఈ ప్రయాణంలో సైరాకి తోడుగా ఉన్నదెవరు? ఆయన కోసం త్యాగం చేసింది ఎవరు? ఆయనకి వెన్నుపోటు పొడిచి, ఆయన ఉరికొయ్యల పాలవడానికి కారకులెవరు? అనే వాటికి సమాధానం తెరపైనే చూసి తెలుసుకోండి.

ఆన్ స్క్రీన్ స్టార్స్ పెర్ఫార్మన్స్: 

సైరా సినిమాలో స్టార్స్ ఎందరో ఉన్నారు. కచ్చితంగా అందరి గురించి ప్రస్తావించాలి. కానీ నటన పరంగా అందరూ వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు, అందులో మాత్రం ఎలాంటి అనుమానం లేదు. అందుకే అందరి నటన గురించి ఒకటి, రెండు వాఖ్యాల్లో ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను.

చిరంజీవి: సైరా నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించలేదు, జీవించారని చెప్పాలి. మనకు తెరమీద చిరంజీవి కనపడరు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డే కనపడతాడు. అంతలా పాత్రలో ఒదిగిపోయాడు. నటన పరంగా ఆయన చేసిన 150 సినిమాలు ఒక ఎత్తైతే, సైరా మాత్రమే ఒక ఎత్తు. ఆయన ఆల్రెడీ టాలెంటెడ్ అని అందరికీ తెలుసు, కానీ 64 ఏళ్ళ వయసులో ఇంతలా రిస్క్ చేసి యుద్దాలు, గుర్రపు స్వారీలు, వీరోచిత పోరాటాలు చేయడం చూస్తే ఆయన డెడికేషన్ కి మా హాట్సాప్. ప్రేక్షకులందరూ ఈ విషయంలో ఆయన్ని మెచ్చుకుంటారు.

అమితాబ్ బచ్చన్: అమితాబ్ – చిరుల గురు – శిష్య కాంబినేషన్ బాగుంది. అమితాబ్ బచ్చన్ ఉన్నది కొద్ది సేపైనా ఆయన సీన్స్, డైలాగ్స్ బాగుంటాయి. అలాగే అమితాబ్ గెటప్, పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్.

నయనతార: మరోసారి లేడీ పవర్ ఏంటో చూపించేలా నయనతార నటించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్ లో ఏడిపించిందనే చెప్పాలి.

తమన్నా: తన కెరీర్లో ఇప్పటి వరకూ ఇలాంటి అద్భుతమైన పాత్ర చేయలేదు, ఇక మీదట చేయబోదు కూడా.. లక్ష్మీ పాత్రలో తమన్నా లుక్, నటన అందరికీ సర్ప్రైజ్ అనే చెప్పాలి. డాన్సర్ గా తను బెస్ట్ అని అందరికీ తెలుసు కానీ ఇందులో  పౌరుషం, వీరం, భావోద్వేగం ఇలా అన్నీ కలగలిపిన హావభావాలను పలికించడంలో తన నటన మైండ్ బ్లోయింగ్ అనాలి.

విజయ్ సేతుపతి: సెకండాఫ్ లో విజయ్ సేతుపతి ఉన్నంత సేపు ప్రేక్షకుల అటెన్షన్ ని తనపై ఉంచుకున్నాడు. ముఖ్యంగా రాజా పాండి పాత్రకి రాసిన డైలాగ్స్ సింప్లీ సూపర్బ్.

సుధీప్: పాత్ర పరంగా చూడటానికి నెగటివ్ యాటిట్యూడ్, కానీ లోపలున్నది ప్రజా శ్రేయస్సు.. ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో సుధీప్ నటన చాలా బాగుంది.

జగపతి బాబు: మరోసారి కథని మలుపు తిప్పే పాత్రలో ప్రేక్షకులని మెప్పించాడు. ఈయన ప్రెజన్స్ వల్లే కథలోని ఈ ట్విస్ట్ కి కొంతన్నా కనెక్ట్ అవుతారు.  

ఇక వీరు కాకుండా పలు పాత్రల్లో నటించిన రవి కిషన్, బ్రహ్మాజీ, నాజర్, రోహిణి, సైరా తల్లి పాత్రలో చేసిన ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు వారి పాత్రలకు న్యాయం చేసి మెప్పించారు. తెరపైన మనల్ని పెద్దగా నిరుత్సాహపరిచిన వారులేరు.

ఆఫ్ స్క్రీన్ స్టార్స్ పెర్ఫార్మన్స్:

తెర వెనుక పనిచేసిన వారే ఈ సినిమాకి మెయిన్ బలం. ముందుగా దర్శకుడు అనుకున్నది అనుకున్నట్టు దృశ్య రూపంగా మార్చిన రత్నవేలుకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఫెంటాస్టిక్ విజువల్స్. ఆ తర్వాత తన సెట్స్, సెటప్స్ తో 1840కి తీసుకెళ్లిన ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ కి క్రెడిట్ ఇవ్వాలి. అలాగే వీరిద్దరి చేయలేని వాటిని విఎఫ్ఎక్స్ లో సూపర్బ్ గా క్రియేట్ చేసిన విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ కమల కణ్ణన్ బాహుబలి తర్వాత మరోసారి విఎఫ్ఎక్స్ లో స్టాండర్డ్స్ ని సెట్ చేశారు. ఇక వీరందరూ చేసి ఇచ్చిన దానికి జూలియస్ పాకియం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అలాగే అమిత్ త్రివేది చేసిన రెండు పాటలు కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. ఇక్కడి వరకు అందరూ బాగానే చేశారు కానీ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు మాత్రమే అంతగా హెల్ప్ చేయలేదు అనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా చోట్ల స్లోగా అనిపించడం బోర్ ఫీలయ్యేలా చేసింది. పరుచూరి బ్రదర్స్ కథ బాగుంది. ఆ కథకి బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగ్స్ చాలా సీన్స్ ని ఎలివేట్ చేశాయి. నలుగురు మాస్టర్స్ కంపోజ్ చేసిన అన్ని యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.

ఇక పోతే కథనం – దర్శకత్వ విభాగాలను డీల్ చేసిన సురేందర్ రెడ్డి విషయానికి వస్తే.. ఇది యదార్థ గాధ. దాన్ని పెద్దగా కమర్షియలైజ్ చేయకుండా, బలవంతంగా ఏవేవో ఇరికించకుండా జెన్యూన్ గా కథని చెప్పినందుకు ఆయన్నిమెచ్చుకోవాలి. అలాగే కథా పరంగా అక్కడక్కడా స్లో అయినప్పటికీ క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ గా బాగా కనెక్ట్ ఐపోతారు అనుకున్నారు, కానీ అది అనుకున్నంత వర్కౌట్ అవ్వలేదు. అలాగే బ్రిటిష్ వాళ్ళు, పాకిస్థాన్ అంటే మన ఆడియన్స్ లో తెలియని ఒక కనెక్షన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో బ్రిటిషర్స్ పెట్టె ఇబ్బందులను బాగా రీచ్ చేసి ఇంటర్వెల్ హై ఫీల్ కి తీసుకెళ్లాడు. కానీ సెకండాఫ్ లో బిల్డ్ చేసిన టెంపోని కంటిన్యూ చేయలేకపోయాడు. స్క్రీన్ ప్లే పరంగా చాలా చోట్ల విఫలమయినప్పటికీ ఇలాంటి కథ తీయడంలో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి

చివరిగా ఈయన లేకపోతే ఈ సినిమానే లేదు. ఆయనే నిర్మాత రామ్ చరణ్. వాళ్ళు అంత పెట్టాం, ఇంత పెట్టాం అన్నది పక్కన పెడితే, సినిమా కోసం పెట్టిన ప్రతి రూపాయి ఏదో ఒక విధంగా సినిమాలో కనపడుతూనే ఉంటుంది. వండర్ ఫుల్ ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పాలి.

సీటీమార్ పాయింట్స్: 

  • చిరంజీవి క్రేజ్
  • రేనాటి భూముల్లో జాక్సన్ కి సైరా వార్నింగ్.
  • కాయిల్ కుంట్ల బ్రిటిష్ ఫోర్ట్ పై సైరా దాడి చేసే ఎపిసోడ్.
  • అరాచకం అనేలా ఉండే ఇంటర్వల్ బ్లాక్.
  • సెకండాఫ్ లో సైరా కోటాలో జరిగే వార్ ఎపిసోడ్
  • రామ్ చరణ్ ప్రొడక్షన్ వాల్యూస్
  • రత్నవేలు విజువల్స్
  • జూలియస్ పాకియం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

ఓకే ఓకే పాయింట్స్: 

  • సెకండాఫ్ లో బ్రిటిష్ – సైరా సైనికులకు మధ్య జరిగే వార్
  • క్లైమాక్స్ ఎమోషనల్ సీన్
  • సెకండాఫ్ లో తమన్నా ఎమోషనల్ ఎపిసోడ్

బోరింగ్ పాయింట్స్:

  • మొదటి 20 నిమిషాల తర్వాత స్లో గా సాగే డ్రామా
  • సెకండాఫ్ లో 30 నిమిషాల తర్వాత స్క్రీన్ ప్లే బోరింగ్ గా అనిపించడం
  • సెకండాఫ్ లెంగ్త్
  • ఓవరాల్ గా కొన్ని ఫైట్స్ బోర్ అనిపించడం

విశ్లేషణ: 

మెగాస్టార్ 10ఏళ్ళ కల, ఇండియన్ స్టాండర్డ్స్ ని పెంచేలా ఉండబోయే పీరియాడికల్ ఫిల్మ్ అనే వార్తల మధ్య విడుదలైన ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా మెగా అభిమానులకి దసరాకి పర్ఫెక్ట్ కానుకగా అనిపిస్తుంది. కానీ ఓ సగటు సినిమా ప్రేక్షకుడికి మాత్రం జస్ట్ ఓకే సినిమా అవుతుంది. అది కూడా ఎలాంటి అంచనాలు లేకుండా వస్తేనే.. ఒకవేళ ఈ జానర్ లో వచ్చిన ‘బాహుబలి’ రేంజ్ లో ఊహించుకొని వస్తే మాత్రం చాలా అంటే చాలా నిరుత్సాహపడచ్చు. 170 నిమిషాల నిడివిలో ఇంటర్వల్ బ్లాక్ ముందు వచ్చే 30 నిమిషాలు, ఇంటర్వెల్ తర్వాత వచ్చే 30 నిమిషాలు అరాచకంగా ఉంటే, ఇంకో 40 నిమిషాల సినిమా అక్కడక్కడా బాగుందనిపిస్తే, మిగతా 70 నిమిషాల సినిమా చాలా బోరింగ్ గా ఉంటుంది. కావున ‘సైరా నరసింహారెడ్డి’ ఎలా ఉంది అంటే ఫ్యాన్స్ కి పండగ చేసుకునే సినిమా, కానీ మిగతావారికి పండగ సరదా కోసం చూడాలనిపించే ఓ మామూలు సినిమా అవ్వడం విశేషం. 

ఫైనల్ పంచ్: సైరా నరసింహారెడ్డి – ఫాన్స్ కి పండగ, మిగతా వారికి ఒక ఆప్షన్. 

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....
సినిమా రివ్యూ: సైరా నరసింహా రెడ్డి   నటీనటులు: చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుధీప్, జగపతి బాబు, రవికిషన్, తదితరులు.. ఎడిటర్‌: శ్రీకర్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: రత్నవేలు దర్శకత్వం: సురేందర్ రెడ్డి నిర్మాణం: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాత: రామ్ చరణ్ విడుదల తేదీ: 02 అక్టోబర్ 2019 మెగాస్టార్ చిరంజీవి 13 ఏళ్ళ కల.. బడ్జెట్ రేంజ్ 300 కోట్లు..  బడ్జెట్ ని లెక్క చేయకుండా తండ్రి కల తీర్చడంతో పాటు కనుమరుగైపోయిన మొట్ట మొదటి స్వాతంత్ర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని...సైరా నరసింహ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్