Switch to English

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు మహరాజే. ప్రజలకు చేరువగా వెళ్లే సినీరంగంలో ఇవి మరింత ముఖ్యం. వీటిని తూ.చ తప్పకుండా పాటించి 46ఏళ్లుగా ప్రజల మనసుల్ని ఏలుతున్న హీరో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi). మరి.. పులి కడుపున పులే పుడుతుందన్నట్టు.. ఆయన వారసుడు రామ్ చరణ్ (Ram Charan) మరో చిరంజీవే అయ్యాడు. చిరంజీవి ఘనమైన సినీ వారసత్వాన్ని ఎలా కొనసాగిస్తున్నాడో.. ప్రతిభ, నడవడిక, క్రమశిక్షణ, నిబద్దతలో కూడా తండ్రి పేరు అలానే నిలబెడుతున్నాడు. మెగాభిమానులు సంతోషాన్ని.. మరెందరికో అసూయ కలిగించే ఘనత ఇది. అందుకే రామ్ చరణ్ అంటే మిస్టర్ కూల్.

చిరంజీవి ఇచ్చిన సలహా..

తండ్రిగా చిన్నప్పుడు చేయిపట్టి నడక నేర్పించిన చిరంజీవే.. సినిమాల్లో తొలి దశలోనూ రామ్ చరణ్ ను నడిపించారు. ఆపై.. రామ్ చరణ్ చూపుతున్న ప్రతిభ, ఏటికేడు ఎదుగుతున్న తీరు.. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండే వ్యక్తిత్వం తన స్థాయిని, గౌరవాన్ని మరింత పెంచుతున్నాయనేది వాస్తవం. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఏం సలహాలిస్తారనే ప్రశ్నపై మాట్లాడుతూ.. ‘నాన్న నాకెప్పుడూ సినిమా, కథ, నటన విషయాల్లో సలహాలివ్వలేదు. క్రమశిక్షణ, సమయపాలన, ఎదుటివారితో నడుచుకునే తీరుపై మాత్రమే చెప్పా’రని అన్నాడు. ఈ మాటలు విన్నవారెవరైనా.. ఇది కదా నేర్పించాల్సింది అనిపించక మానదు. చిరంజీవి చూపిన దారిలో.. సూచించిన సలహాలతో రామ్ చరణ్ ఒక్కో మెట్టే ఎక్కుతూ ఇప్పుడు దేశందాటి అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు. సినిమాల్లో ప్రతిభ, పరిశ్రమలో చూపే వ్యక్తిత్వంతో సాధించుకున్నది.

అమితాబ్ బచ్చన్ తో..

కెమెరా ముందు నటనతో మెప్పించే రామ్ చరణ్.. కెమెరా వెనుక కూడా మంచి ఫ్యామిలీ మ్యాన్. చిరంజీవి మాటకు ఎంత విలువ ఉంటుందో రామ్ చరణ్ కూ అదే విలువ. ఇది చిరంజీవి కొడుకుగా తెచ్చుకుంది కాదు. తన వ్యక్తిత్వంతో చిరంజీవి పేరు నిలబెట్టేలా నడుచుకుంటున్న తీరుతో సాధ్యమైంది. ఔట్ డోర్ షూటింగ్స్ లో లోకల్ పీపుల్ తో మమేకమవడం.. అభిమానుల హోరులోనూ వారితో ఫొటోలు దిగడం.. సంతృప్తిపరచడం.. పెద్దవారిని గౌరవించడం ఇవే రామ్ చరణ్ ను సినీ ఇండస్ట్రీలో మేటిగా నిలబెడుతున్నాయి. ఇటివలి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రామ్ చరణ్ ను అమితాబ్ బచ్చన్ ముందు నడవాల్సిందిగా కోరగా సున్నితంగా తిరస్కరించి మీరే ముందు అని చెప్పి తన వినయాన్ని చాటుకున్నాడు. ఇదే చిరంజీవి పెంపకం.. రామ్ చరణ్ వ్యక్తిత్వం. అభిమానులకు అదే నిత్య సంతోషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...