Switch to English

పిఠాపురంలో మిధున్ ‘రెడ్డి’కి ఏంటి పని.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ.. అని అధికార వైసీపీ అంటోంది. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ గనకనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘సేఫ్ జోన్’గా భావించి, పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి కాపు సామాజిక వర్గానికే చెందిన వంగా గీత వైసీపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఆమె ప్రస్తుతం లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.. కాకినాడ నియోజకవర్గం నుంచి, వైసీపీ తరఫున.

గతంలో, ఇదే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా టీడీపీ నేత వర్మ గెలిచిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన గెలిచారు అప్పట్లో. పిఠాపురం నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలూ ఓటర్లుగా వున్నారు. కానీ, వైసీపీ తనకు తోచిన వాదనను తెరపైకి తెస్తోంది.

ఇదిలా వుంటే, పిఠాపురం నుంచి బరిలోకి దిగాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భావించారు. జనసేన నుంచి టిక్కెట్టు కూడా ఆశించారాయన. అది కుదరక, ముద్రగడ వైసీపీలోకి దూకేసిన సంగతి తెలిసిందే.

కాపు సామాజిక వర్గం ఓట్లే పిఠాపురంలో అధికంగా వున్నాయని వైసీపీ భావిస్తున్నప్పుడు, అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి లేదా నాయకురాలికి పిఠాపురం బాధ్యతలు అప్పగించాలిగానీ, రాయలసీమ నుంచి తీసుకొచ్చి, మిధున్ రెడ్డిని పిఠాపురం ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దడమేంటి.?

ఒక్కో ఓటుకి లక్ష అయినా ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా వుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారంటే, అది కేవలం ఆయన మాట మాత్రమే కాదు.. నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ కూడా.!

ఓ రాజకీయ పార్టీ, తన రాజకీయ అవసరాల కోసం ఎవర్నైనా ఎక్కడైనా నియమించుకోవచ్చుగాక. కానీ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి అసలు సమర్థుడైన నాయకుడే లేనట్టు, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని దించడమేంటి.? అదీ, వంగా గీత లాంటి సీనియర్ నాయకురాలి మీద పెత్తనానికి.? అన్న చర్చ సహజంగానే జరుగుతోంది.

పెద్దిరెడ్డి రాజకీయం ఎలా వుంటుందో, చిత్తూరు జిల్లాలో.. అందునా, పుంగనూరులో అందరికీ తెలుసు. తిరుపతి ఉప ఎన్నిక ఈ ‘పెద్దిరెడ్డి’ కనుసన్నల్లోనే జరిగింది. విచ్చలవిడిగా దొంగ ఓటర్లు వేరే రాష్ట్రాల నుంచీ తరలి వచ్చారు అప్పట్లో. అదే పైత్యం, పిఠాపురం నెత్తిన వైసీపీ ఈ ‘పెద్దిరెడ్డి’ ద్వారా రుద్దబోతోందా.? అంతేనేమో.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...