Switch to English

పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత: పిఠాపురం ఎవరిది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు పోటీగా, కాకినాడ ఎంపీ వంగా గీత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

అప్పుడే, మాటల యుద్ధం కూడా షురూ అయ్యింది. ఓటుకు లక్ష పంచైనా పిఠాపురం నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని రంగంలోకి దించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిజానికి, వంగా గీత పట్ల పిఠాపురంలో పెద్దగా వ్యతిరేకత లేదు. అలాగని, అనుకూలత కూడా ఆమె పట్ల ఆ నియోజకవర్గంలో లేని పరిస్థితి. కాపు వర్సెస్ కాపు.. ఇదీ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ – వంగా గీత మధ్య జరగనున్న ఎన్నికల పోటీ.. అనేలా వైసీపీ ఓ ఇమేజ్ క్రియేట్ చేసింది.

అయితే, పిఠాపురం పొలిటికల్ ఈక్వేషన్ వేరు. కాపు సామాజిక వర్గం ఓట్లతోపాటుగా, ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా చైతన్యవంతమై వుంటాయి పిఠాపురం నియోజకవర్గంలో. గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన దాఖలాలున్నాయి.

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ ‘కాపు’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. అయినా, ఆయన గెలిచారు గతంలో. సో, ‘కాపు’ ఓటు బ్యాంకు చుట్టూ వైసీపీ రాజకీయం చేయడంలో అర్థమే లేదు.

ఇక, ఈ నియోజకవర్గంపై పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెత్తనం ఏంటి.? అన్న చర్చ నియోజకవర్గ ప్రజల్లో జరుగుతోంది. ‘రాయలసీమ ఫ్యాక్షనిజం పిఠాపురంలో ప్రదర్శిస్తారా.?’ అంటూ వైసీపీ మీద స్థానిక ప్రజలు గుస్సా అవుతున్నారు. అది ఖచ్చితంగా వంగా గీతకు మైనస్ పాయింట్ అవుతోంది.

సిట్టింగ్ ఎంపీ అయి వుండీ, ఎవరో పెత్తనం చేస్తోంటే ఆ పెత్తనానికి తలొగ్గడమేంటని వంగా గీతని కొన్ని చోట్ల ఓటర్లు నిలదీస్తుండడం గమనార్హం.

అన్నట్టు, వంగా గీత గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు, ఆ పార్టీ నుంచి గెలిచారు కూడా. అప్పట్లో, పవన్ కళ్యాణ్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలే వుండేవి. ప్రజారాజ్యం పార్టీ యూత్ వింగ్ యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అప్పట్లో. వంగా గీత, ప్రజారాజ్యం మహిళా విభాగంలో కీలక నాయకురాలిగా పని చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో, ‘వంగా గీత జనసేనలోకి వచ్చేస్తారేమో..’ అని పవన్ కళ్యాణ్ తాజాగా వ్యాఖ్యానించారు. ‘పవన్ కళ్యాణ్‌నే వైసీపీలోకి ఆహ్వానిస్తే బావుంటుందా.?’ అని కౌంటర్ ఎటాక్ ఇచ్చే ప్రయత్నం చేశారుగానీ, వంగా గీత గతంలో తాను పలు పార్టీలు మారిన విషయాన్ని మర్చిపోతే ఎలా.?

‘లక్ష మెజార్టీ’ అని పవన్ కళ్యాణ్ ఏదో ఊరికే అనెయ్యలేదు. పిఠాపురంలో పొలిటికల్ ఈక్వేషన్ అలా వుంది మరి. ఈ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి కావొచ్చు.. ఇతరత్రా సమస్యలు కావొచ్చు, వైసీపీ పట్ల స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. దానికి తోడు టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి.. ఇలా చాలా ఈక్వేషన్స్, వైసీపీ అభ్యర్థి వంగా గీతకు అస్సలేమాత్రం కలిసొచ్చేలా కనిపించడంలేదు.

వాస్తవానికి, ఆమె తిరిగి కాకినాడ ఎంపీగా బరిలో వుంటే.. కాస్తో కూస్తో పాజిటివిటీ వుండేదేమో.! రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది వంగా గీత పరిస్థితి. పవన్ కళ్యాణ్ మాత్రం ష్యూర్ షాట్.. అన్నట్లుగా పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...