Switch to English

NTR 100 Years: స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి.! నీ ప్రస్తావన లేకుండా సాధ్యమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

NTR 100 Years: సినిమా గురించి మాట్లాడాలంటే, స్వర్గీయ ఎన్టీయార్ ప్రస్తావన తప్పనిసరి.! రాజకీయాల ప్రస్తావన రావాలన్నా, ఆ స్వర్గీయ ఎన్టీయార్ ప్రస్తావన రాకుండా వుండదు.! దటీజ్ ఎన్టీయార్. శక పురుషుడనీ.. యుగ పురుషుడనీ.. ఇంకోటనీ.. ఆ విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని కొనియాడటంలో వింతేముంది.?

తెలుగు జాతి ఆత్మ గౌరవం.. వంటి పొగడ్తల విషయంలో చాలామందికి అభ్యంతరాలున్నాయనుకోండి.. అది వేరే సంగతి. ఎన్టీయార్ జీవితంలో ఆ ‘వెన్నుపోటు’ ఎపిసోడ్‌ని మినహాయిస్తే, ఆయన సంపూర్ణ జీవితాన్ని అత్యంత ఆనందకరంగా అనుభవించారని చెప్పక తప్పదు.

ఆ వెన్నుపోటు అనేది లేకుండా వుంటే, ఏమో.. ఆయన వందేళ్ళు జీవించి వుండేవారేమో.! నేటికీ ఆయన మన మధ్యన వుండేవారేమో.!

స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయ్. ఇంకో వైపు, తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతోంది. ఎవర్నయితే పార్టీ నుంచి గెంటేశారో, ఆయన విగ్రహాలు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ నిర్వహిస్తోంది. ఏ ఎన్టీయార్‌ని కుటుంబ సభ్యులే వెన్నుపోటు పొడిచారో.. ఆ ఎన్టీయార్‌ని ఆ కుటుంబ సభ్యులు స్మరించుకుంటున్నారు.

ఆ నడక.. ఆ నడత.. ఆ రూపం.. వాట్ నాట్.! స్వర్గీయ నందమూరి తారక రామారావుకి సాటి ఇంకెవరూ రారు. తెలుగు తెరపై రాముడంటే ఎన్టీయార్, కృష్ణుడంటే ఎన్టీయార్. అలాగే, ఆ కోణంలోనే స్వర్గీయ ఎన్టీయార్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయదలిస్తే, న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయ్.

గొప్ప వ్యక్తిని స్మరించుకునే క్రమంలో చేసే అతి, ఆ వ్యక్తి గొప్పతనాన్ని తగ్గించేస్తుందేమో.! కపట ప్రేమ వల్ల కలిగే ఇబ్బంది ఇది.! స్వర్గీయ ఎన్టీయార్‌కి భారత రత్న ఇవ్వాలి.. ఈ డిమాండ్ జయంతికో, వర్ధంతికో మాత్రమే వినిపిస్తుంటుంది.

ఔను, స్వర్గీయ ఎన్టీయార్ అంటే కొందరికి ‘ఉనికి కోసం’ అవసరం. దురదృష్టం.. అలాంటివాళ్ళంతా ఆయనకి అయినవాళ్ళే.! అనుచరులే.! ఆయన్ని నిజంగా అభిమానించేవాళ్ళకి మాత్రం, ఆయన ఎప్పుడూ దేవుడే.! జోహార్ ఎన్టీయార్.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...