Switch to English

Ram Charan Birthday Celebrations: రామ్ చరణ్ ‘మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

Ram Charan Birthday Celebrations: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో సినీ ప్రముఖులు, అభిమానులు సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డైలాగ్స్, పాటలు, డాన్స్లతో కళాకారులు చరణ్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో హీరో సాయిధరమ్ తేజ్, డైరెక్టర్ బుచ్చిబాబు, బాబి, నిర్మాత దిల్ రాజు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి సాయి ధరం తేజ్ మాట్లాడుతూ..’ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మేమందరం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. నువ్వు ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ఉన్నావు. మన కుటుంబ ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్తావని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

డైరెక్టర్ బాబి మాట్లాడుతూ..’ మెగాస్టార్ చిరంజీవికి కొడుకుగా పుట్టడం, పవన్ కళ్యాణ్ ని బాబాయిగా కలిగి ఉండడం చరణ్ అదృష్టం. అదేవిధంగా ఎంతో బాధ్యత, ఒత్తిడి కూడా తనమీద ఉంటాయి. ఇటు మెగాస్టార్ అభిమానిని అటు పవర్ స్టార్ అభిమానిని ఇద్దరినీ సంతృప్తి పరచడమనేది ఆషామాషీ విషయం కాదు. ఈ విషయంలో చరణ్ సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు మొదట గుర్తొచ్చే వ్యక్తి రామ్ చరణ్. పవన్ ఆయన్ని షూటింగ్ లోకేషన్ కి పిలిపించుకొని మరి మాట్లాడేవారు. ఎలాంటి సమస్య అయినా పరిష్కరించగల నేర్పు తన సొంతమనేది పవన్ విశ్వాసం. చరణ్ ఇలాగే తండ్రి వారసత్వాన్ని, బాబాయి సేవ గుణాన్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నా’ అని చెప్పారు

డైరెక్టర్ బుచ్చిబాబు సాన మాట్లాడుతూ..’ చరణ్ సర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. మీ మీద నాకు ఎంత అభిమానం ఉందో మనిద్దరం చేయబోయే సినిమాలో చూపిస్తాను’ అని అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..’ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి సర్ప్రైజ్ ఇవ్వనున్నాం. రేపు ‘RC15′ టైటిల్, ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ ఉంటుంది. చరణ్ ఇమేజ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి పెరిగింది. కాబట్టి దానికి తగినట్టే డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు. మీరు ఎప్పుడూ చూడని లుక్ లో రేపు రామ్ చరణ్ ని చూపించబోతున్నాం’ అని వెల్లడించారు.

కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాట్లాడుతూ..” చరణ్ తో నాకు ‘మగధీర’ నుంచి అనుబంధం ఏర్పడింది. అందులో ‘బంగారు కోడిపెట్ట’ పాట కొరియోగ్రఫీ చేసింది నేనే. ఇప్పుడు ‘నాటు నాటు’ వరకు మా రిలేషన్ కొనసాగుతోంది. వ్యక్తిగతంగా చరణ్ ‘మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్’ అని నా అభిప్రాయం’ అన్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...