Switch to English

Ram Charan Birthday special: గురి తప్పని రామ్ (చరణ్) బాణం.. విమర్శలకు ధీటైన జవాబు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

Ram Charan Birthday special: నటీనటుల నటనకు విమర్శ చాలా అవసరం. ఒక్కోసారి అవే విమర్శలు వారిని మరింత రాటుదేలేలా చేస్తాయి. అంతిమంగా తెరపై తమ నటనతోనే విమర్శలకు సరైన సమాధానం చెప్పేలా చేస్తాయి. ఇందుకు కావాల్సింది ఒక్క అవకాశం. అది అందిపుచ్చుకున్న హీరో రామ్ చరణ్ (Ram Charan). నిజానికి తొలి సినిమా చిరుత, తర్వాత మగధీర.. ఆపై ఆరెంజ్ సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో చరణ్ ఒదిగిపోయిన తీరు హర్షణీయం. అంతలా మెప్పించిన రామ్ చరణ్ పై కూడా విమర్శలు వచ్చాయి. హిందీలో చేసిన జంజీర్ తో బాలీవుడ్ విమర్శలు చేస్తే.. టాలీవుడ్ (Tollywood) లో ఇదే అవకాశంగా కొందరు విమర్శలు చేశారు. రామ్ చరణ్ తన తర్వాతి సినిమాల ద్వారా వాళ్లు కోలుకోకుండా చేశారు. ధ్రువ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలే ఇందుకు నిదర్శనం.

తనను తాను నిరూపించుకున్నా..

కెరీర్ తొలినాళ్లలోనే తానేంటో నిరూపించినా విమర్శలు చేసిన కొందరిని మారు మాట్లాడకుండా చేశారు. ధ్రువలో కళ్లతోనే భావాలు పలికించి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనిపించారు. తర్వాత వచ్చిన రంగస్థలం ఆయన 15ఏళ్ల సినీ కెరీర్లో ఓ మేలిమి బంగారం. సినిమాలో తన నటనను నేటి జనరేషన్ కు ఓ డిక్షనరీగా మార్చేశారు. చిరంజీవి (Chiranjeevi) కి గ్యాంగ్ లీడర్ లా రంగస్థలం రామ్ చరణ్ (Ram Charan) కు ఓ ల్యాండ్ మార్క్ అయింది. ఫ్యాన్స్ పండుగ చేసుకుంటే.. విమర్శకులు ప్రశంసించారు. తనను తక్కువ అంచనా వేసిన వారికి నటనతోనే సమాధానం చెప్పారు. సెంటిమెంట్ పాత్రల్లో తన హవభావాలతో కళ్లు చెమర్చే నటనతో మెప్పించారు. చిరంజీవి కొడుకు నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనేలా చేశారు.

బాలీవుడ్ ఆశ్చర్యపోయేలా..

‘నువ్వు రాసిన ప్రతి అక్షరాన్ని తిప్పి రాసేలా చేస్తాను’ అని జంజీర్ లో రామ్ చరణ్ డైలాగ్. దీనిని అక్షరాలా చేసి చూపించారు. ఏ బాలీవుడ్ విమర్శకులు, మీడియా విమర్శించారో అక్కడే ఇండియన్ సూపర్ స్టార్ అనేలా చేశారు. ఆర్ఆర్ఆర్  (RRR)లో తన నటన, ఆహార్యంతో హిందీ ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. రామ్ చరణ్ కోసం మీడియా అటెన్షన్ క్రియేట్ అయింది. బాలీవుడ్ (Bollywood) ప్రముఖులు సైతం రామ్ చరణ్ (Ram Charan) నటనకు ఫిదా అయిపోయారు. పైన చెప్పుకొన్నట్టు ‘ఒక్క అవకాశం’.. ఆర్ఆర్ఆర్ ద్వారా వచ్చిన అవకాశాన్ని తన నటనతోనే నిరూపించి బాలీవుడ్ ను తనవైపుకు తిప్పుకునేలా ఎదిగారు. ఇదంతా కెరీర్లో రామ్ చరణ్ సాధించిన ఘనత. విమర్శలు కూడా మేలు చేస్తాయనేందుకు రామ్ చరణ్ ఓ ఉదాహరణ.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...