Ram Charan Birthday special: నటీనటుల నటనకు విమర్శ చాలా అవసరం. ఒక్కోసారి అవే విమర్శలు వారిని మరింత రాటుదేలేలా చేస్తాయి. అంతిమంగా తెరపై తమ నటనతోనే విమర్శలకు సరైన సమాధానం చెప్పేలా చేస్తాయి. ఇందుకు కావాల్సింది ఒక్క అవకాశం. అది అందిపుచ్చుకున్న హీరో రామ్ చరణ్ (Ram Charan). నిజానికి తొలి సినిమా చిరుత, తర్వాత మగధీర.. ఆపై ఆరెంజ్ సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో చరణ్ ఒదిగిపోయిన తీరు హర్షణీయం. అంతలా మెప్పించిన రామ్ చరణ్ పై కూడా విమర్శలు వచ్చాయి. హిందీలో చేసిన జంజీర్ తో బాలీవుడ్ విమర్శలు చేస్తే.. టాలీవుడ్ (Tollywood) లో ఇదే అవకాశంగా కొందరు విమర్శలు చేశారు. రామ్ చరణ్ తన తర్వాతి సినిమాల ద్వారా వాళ్లు కోలుకోకుండా చేశారు. ధ్రువ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలే ఇందుకు నిదర్శనం.
తనను తాను నిరూపించుకున్నా..
కెరీర్ తొలినాళ్లలోనే తానేంటో నిరూపించినా విమర్శలు చేసిన కొందరిని మారు మాట్లాడకుండా చేశారు. ధ్రువలో కళ్లతోనే భావాలు పలికించి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనిపించారు. తర్వాత వచ్చిన రంగస్థలం ఆయన 15ఏళ్ల సినీ కెరీర్లో ఓ మేలిమి బంగారం. సినిమాలో తన నటనను నేటి జనరేషన్ కు ఓ డిక్షనరీగా మార్చేశారు. చిరంజీవి (Chiranjeevi) కి గ్యాంగ్ లీడర్ లా రంగస్థలం రామ్ చరణ్ (Ram Charan) కు ఓ ల్యాండ్ మార్క్ అయింది. ఫ్యాన్స్ పండుగ చేసుకుంటే.. విమర్శకులు ప్రశంసించారు. తనను తక్కువ అంచనా వేసిన వారికి నటనతోనే సమాధానం చెప్పారు. సెంటిమెంట్ పాత్రల్లో తన హవభావాలతో కళ్లు చెమర్చే నటనతో మెప్పించారు. చిరంజీవి కొడుకు నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనేలా చేశారు.
బాలీవుడ్ ఆశ్చర్యపోయేలా..
‘నువ్వు రాసిన ప్రతి అక్షరాన్ని తిప్పి రాసేలా చేస్తాను’ అని జంజీర్ లో రామ్ చరణ్ డైలాగ్. దీనిని అక్షరాలా చేసి చూపించారు. ఏ బాలీవుడ్ విమర్శకులు, మీడియా విమర్శించారో అక్కడే ఇండియన్ సూపర్ స్టార్ అనేలా చేశారు. ఆర్ఆర్ఆర్ (RRR)లో తన నటన, ఆహార్యంతో హిందీ ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. రామ్ చరణ్ కోసం మీడియా అటెన్షన్ క్రియేట్ అయింది. బాలీవుడ్ (Bollywood) ప్రముఖులు సైతం రామ్ చరణ్ (Ram Charan) నటనకు ఫిదా అయిపోయారు. పైన చెప్పుకొన్నట్టు ‘ఒక్క అవకాశం’.. ఆర్ఆర్ఆర్ ద్వారా వచ్చిన అవకాశాన్ని తన నటనతోనే నిరూపించి బాలీవుడ్ ను తనవైపుకు తిప్పుకునేలా ఎదిగారు. ఇదంతా కెరీర్లో రామ్ చరణ్ సాధించిన ఘనత. విమర్శలు కూడా మేలు చేస్తాయనేందుకు రామ్ చరణ్ ఓ ఉదాహరణ.
Mail ID Wrong undaa meedhi