Switch to English

Balakrishna: ఎన్టీయార్ ఉనికిని జీర్ణించుకోలేకపోతున్న బాలకృష్ణ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

యావత్ ప్రపంచమే అతన్ని గుర్తించింది. కానీ, సొంత బాబాయ్ ఆయన్ని ఉనికిని గుర్తించలేకపోతున్నాడు.! జీర్ణించుకోలేకపోతున్నాడు.! అంతేనా.? సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కి అభినందనలు తెలిపారు.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ పురస్కారం దక్కడంపై.

మంచి విషయమే ఇది.! కానీ, తన అభినందనలో ఎక్కడా బాలకృష్ణ మాటమాత్రమైనా జూనియర్ ఎన్టీయార్ పేరుని ప్రస్తావనకు తీసుకురాలేదు. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అంటే, అందులో జూనియర్ ఎన్టీయార్ కూడా వుంటాడని కొందరు నందమూరి అభిమానులు సరిపెట్టుకోవచ్చుగాక.

‘ఆస్కార్ పురస్కారం వచ్చింది పాటకు మాత్రమే. ఇందులో నటీనటులకు క్రెడిట్ ఏమీ వుండదు..’ అనే పిచ్చి వాదనను కొందరు తెరపైకి తీసుకురావొచ్చుగాక. ‘ఫేస్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ అంటే, రామ్ చరణ్ అలాగే ఎన్టీయార్.. ఈ ఇద్దరితోపాటు రాజమౌళి. దర్శకుడు రాజమౌళితో కలిసి తాను ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు నందమూరి బాలకృష్ణ పలు సందర్భాల్లో చెప్పారనుకోండి.. అది వేరే సంగతి.

ఏ వేదిక మీద అయినా, ‘బాలయ్య ప్రస్తావన’ తీసుకురాకుండా వుండడు జూనియర్ ఎన్టీయార్. అది ఆయన సంస్కారం. కానీ, బాలయ్య మాత్రం అలా కాదు. అన్న హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీయార్, ప్రపంచ ఖ్యాతిని ఆర్జిస్తే జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కి అభినందనలు తెలిపే క్రమంలో జూనియర్ ఎన్టీయార్ పేరుని ప్రస్తావించలేకపోయాడు.

ఎందుకు ఎన్టీయార్ అంటే బాలయ్యకు ఇంత ఏహ్యభావం.? అని జూనియర్ ఎన్టీయార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కొందరు తెలుగు తమ్ముళ్ళు కూడా ఇదే ప్రశ్నను తెరపైకి తెస్తున్నారు. ఎన్టీయార్ కూడా, సోషల్ మీడియాలో ఆస్కార్ ప్రస్తావన సందర్భంగా సహ నటుడు రామ్ చరణ్ పేరుని ప్రస్తావించలేదు. బాలయ్య ఎలాగూ రామ్ చరణ్ పేరు ప్రస్తావించడనుకోండి.. అది వేరే సంగతి.

చరణ్ పేరు ప్రస్తావించాల్సి వస్తుందనే, ఎన్టీయార్ పేరుని కూడా బాలయ్య లైట్ తీసుకోవాల్సి వచ్చిందా.?

ఎన్టీయార్‌ని చిరంజీవి ఓ ట్వీటులో ప్రస్తావించలేదని.. పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే చేశాడనీ.. (పలు సందర్భాల్లో రామ్ చరణ్‌తోపాటు ఎన్టీయార్‌ని ప్రస్తావించినాగానీ) గగ్గోలు పెట్టిన నందమూరి అభిమానులు, తెలుగు తమ్ముళ్ళు.. ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ విషయమై ఎన్టీయార్‌ని ఏనాడూ అభినందించని బాలయ్య విషయంలో ఏం మాట్లాడగలుగుతారు.?

అయినా, తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీయార్‌ని పలకరించడానికీ ఇష్టపడని బాలయ్య, ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అభినందనలో ఎన్టీయార్ పేరుని ప్రస్తావిస్తాడని ఎలా ఆశించగలం.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...