Switch to English

షోయబ్ రిటైర్.. సానియా హ్యాపీ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

ఏ ఆటగాడైనా తాను ప్రాణంగా ప్రేమించే ఆట నుంచి రిటైర్ కావడమంటే అది ఒకవిధంగా బాధకరమైన అంశమే. సదరు క్రీడాకారుడి జీవితంలో అవి భావోద్వేగ క్షణాలుగా ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. బాధ, భావోద్వేగం కలగలిసిన ఆ క్షణాలు చిరకాలం గుర్తుండిపోతాయి. బీసీసీఐ సెలక్షన్ కమిటీలో రాజకీయాల కారణంగా టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు బాధతలో గుడ్ బై చెప్పగా.. ఈ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత దోని కూడా రిటైర్ అవుతాడంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఏ ఆటగాడు ఆట నుంచి తప్పుకున్నా, వారితోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు.

తాజాగా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ ప్రపంచకప్ లో మూడు మ్యాచ్ లు ఆడిన మాలిక్.. రెండు సార్లు డకౌట్ కాగా, ఒకసారి 8 పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా పాకిస్థాన్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడంతో మాలిక్ తన 20 ఏళ్ల క్రికెట్ ప్రస్తానానికి గుడ్ బై చెప్పాడు. ఈ విషయంలో అతడు ఎంత బాధడడి ఉంటాడో తెలియదు కానీ, అతడి భార్య, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు గొప్ప ఊరటే అంటూ సోషల్ మీడియాలో సరదా చలోక్తులు వస్తున్నాయి.

హైదరాబాద్ కు చెందిన సానియా మీర్జా.. పాక్ క్రికెటర్ షోయబ్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. ఎప్పుడు భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినా.. మీరు ఎవరికి మద్దతిస్తారంటూ సానియాకు ప్రశ్నలు ఎదురయ్యేవి. ఇలా ఆమెను ఇరుకున పెట్టేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇటీవల ప్రపంచకప్ లో భారత జట్టుతో మ్యాచ్ కు ముందు రోజు అతడు సానియా, ఇతర ఆటగాళ్లతో కలిసి డిన్నర్ కు వెళ్లాడంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత్ తో మ్యాచ్ లో పాక్ ఓటమి కారణం సానియా అంటూ పలువురు విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో ఆమెకు మద్దతుగా పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మద్దతుగా నిలిచారు. ఆటగాళ్ల వ్యక్తిగత జీవితం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు. ఇలా షోయబ్ విషయంలో ఇంటా బయటా ఇబ్బందులు పడిన సానియాకు.. అతడి రిటైర్మెంట్ తో హమ్మయ్య అనుకుంటుందని సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక షోయబ్ రిటైర్మెంట్ పై సానియా భావోద్వేగంతో స్పందించింది. ‘‘ప్రతి కథకూ ఓ ముగింపు ఉంటుంది. కానీ జీవితంలో ప్రతి ముగింపు తర్వాత ఓ కొత్త అధ్యాయం మొదలవుతుంది. నీ దేశం గర్వించేలా 20 ఏళ్లపాటు దేశం కోసం ఆడావు. నీవు సాధించిన విజయాలను చూసి నేను, ఇజాన్ ఎంతో గర్విస్తున్నాం’’ అని పేర్కొంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...