Switch to English

వైఎస్‌ జగన్‌ కొంప ముంచుతున్న సాక్షి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వేరే శత్రువు అక్కర్లేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఉంటూనే ఆ పార్టీ కొంప ముంచేయడానికి ఆ రెండు మీడియా సంస్థలున్నాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ కనిపించడం లేదు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడానికి ఆయన సొంత మీడియా సంస్థ పడిన కష్టం అంతా ఇంతా కాదు. తిమ్మిని బమ్మిని చేసి, కథనాలు వండి, వడ్డించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని పైకి లేపడంలో తమ వంతు పాత్ర పోషించింది సాక్షి మీడియా.

జగన్‌ సొంత మీడియా సంస్థ కనుక ఆయనకు మద్దతుగానే అందులో కథనాలుంటాయి. అయితే, కేంద్ర బడ్జెట్‌ని వైసీపీ నేతలు తప్పు పడుతోంటే, సాక్షి మీడియాలో కథనాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. సాక్షి పత్రిక బ్యానర్‌ ఐటెంలో వచ్చిన బడ్జెట్‌ కథనం ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. బడ్జెట్‌ ‘మహాద్భుతం’ అన్నట్లు మోడీ ప్రొడక్షన్స్‌ సమర్పించు మదర్‌ భారత్‌ అనే కథనం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఓ పక్క పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ గొంతు విప్పుతోంటే, సాక్షి మీడియా ఇచ్చిన కథనాలు వైసీపీ శ్రేణులకే పెద్ద షాకిచ్చాయి.

వ్యాలీడ్‌ పాయింట్‌ అనుకున్నారో ఏమో కానీ, మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్‌ సోషల్‌ మీడియాలో సాక్షి కథనాన్ని ప్రస్థావిస్తూ, వైసీపీపై ఘాటైన విమర్శలు చేశారు. లోకేష్‌ మీద వైసీపీ నేతల ఎదురు దాడి సంగతి పక్కన పెడితే, బడ్జెట్‌పై వైసీపీ నేతల స్పందన సాక్షి మీడియాలో కథనాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎవర్నీ మెప్పించలేకపోతున్నాయి. ఇంతలా మోడీకి సాగిలా పడాలా.? అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

అమరావతి ప్రస్థావన లేకుండా అసలు బడ్జెట్‌ ఏంటీ.? అని ప్రశ్నిస్తున్నారంతా. జరిగిన అన్యాయానికి నిరసన తెలుపుతూ, ఢిల్లీలో గల్లీలో ఆందోళన చేయాల్సిన వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి తూతూ మంత్రంగా కామెంట్స్‌ చేస్తుండడం హాస్యాస్పదం కాక మరేమిటి.? టీడీపీ అధికారంలో ఉంటే, వైసీపీ పెట్టే గగ్గోలు ఏ స్థాయిలో ఉండేదో. మొత్తమ్మీద సాక్షి కథనాలు వైసీపీ కొంప ముంచేస్తున్నాయి. వైఎస్‌ జగన్‌కి తెలియకుండానే సాక్షిలో ఇలాంటి కథనాలు వస్తున్నాయంటే నమ్మేదెలా.? వైఎస్‌ జగన్‌కి వేరే శత్రువు అవసరం లేదు అనేలా పరిస్థితులు మారుతున్నాయా.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...