Switch to English

రెండు కళ్ళు.! ఎన్టీయార్, ఏయన్నార్ పిచ్చోళ్ళు’ కాదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

తెలుగు సినీ పరిశ్రమలో స్వర్గీయ ఎన్టీయార్ ఓ తిరుగులేని కథానాయకుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆయన పేరు ప్రస్తావించకుండా తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడలేం. అలాగే, అక్కినేని నాగేశ్వరరావు గురించి కూడా.!

ఔను కదా.! అది నిజమే కదా.! కానీ, ‘తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీయార్.. ఏయన్నార్.. ఈ ఇద్దరూ రెండు కళ్ళు’ అని అంటే, అది ఎంతవరకు సబబు.? తెలుగు సినీ పరిశ్రమ అంటే ఎన్టీయార్, ఏయన్నార్ మాత్రమేనా.? తెలుగు సినిమాకి ‘తొలితరం’ అంటే ఈ ఇద్దరు మాత్రమే కాదు.!

కొన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగేశ్వరరావు ఈ ‘రెండు కళ్ళ సిద్ధాంంతం’ గురించి స్పందించారు. ప్రశ్న అడిగింది కూడా మహానటి జయప్రద. తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, దేశవ్యాప్తంగా జయప్రదకు తిరుగులేని ఫాలోయింగ్ వుండేది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ.. ఎవర్‌గ్రీన్ జయప్రద.!

ఆ జయప్రద, ‘తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీయార్, ఏయన్నార్.. రెండు కళ్ళు కదా..’ అని అడిగారు. దానికి అక్కినేని నాగేశ్వరరావు సమాధానమేంటో తెలుసా.? ‘పత్రికలోళ్ళు పని లేక రాసే రాతలివి. మేం రెండు కళ్ళు ఏంటి.? ఎస్వీ రంగారావు, సూర్యకాంతం, కృష్ణ, కృష్ణం రాజు, రేలంగి.. వీళ్ళంతా ఎవరు.?’ అని ప్రశ్నించారు అక్కినేని నాగేశ్వరరావు.

అంతే కాదు, ‘మేం రెండు కళ్ళు.. అని చెప్పుకోవడానికి, నమ్మేయడానికీ.. పొంగిపోవడానికి.. ఎన్టీయార్ ఏమీ పిచ్చోడు కాదు.. నేనూ పిచ్చోడ్ని కాను..’ అని అక్కినేని నాగేశ్వరరావు చెప్పడం గమనార్హం.

ఔను, ఓ భానుమతి.. ఓ జగ్గయ్య.. ఓ కాంతారావు.. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దది. తెలుగు సినిమా స్వర్గీయ ఎన్టీయార్‌తో ప్రారంభం కాలేదు, స్వర్గీయ ఏఎన్నార్‌తో ముగిసిపోలేదు. ఇదొక ప్రవాహం.. కొత్త రక్తం పోతుంది.. పాత రక్తం వస్తుంది. తెలుగు సినిమా వైభవం.. అంటే, అందులో చాలా పేర్లుంటాయ్.

ఓ రంగారావు.. ఓ తొక్కినేని.. అంటూ తేలిగ్గా మాట్లాడేసే నందమూరి బాలకృష్ణ లాంటోళ్ళూ ఈ చరిత్రలో వుంటారు.. తమ స్థాయిని దిగజార్చేసుకుంటుంటారు. అక్కినేని అంతటోడే, ‘మేం రెండు కళ్ళు కాదు..’ అన్నారంటే, ఇంకెందుకీ పిచ్చి పైత్యం. బ్లడ్డూ.. బ్రీడూ.. అంటూ పిచ్చి కూతలు. ఎస్వీయార్ గోటికి పనికొస్తాడా బాలకృష్ణ.? అంటే, ఆ పతనాన్ని బాలయ్య ఎందుకు కొనితెచ్చుకున్నట్టు.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...