నటుడు సుధీర్ బాబు చాలా చిన్నగా తన కెరీర్ ను మొదలుపెట్టి ఈరోజు తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. గతేడాది వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రంతో నిరాశపరిచిన సుధీర్ బాబు ఈసారి విభిన్నమైన కథాంశంతో హంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.
కథ:
తన ఫ్రెండ్ అయిన ఎసిపి ఆర్యన్ దేవ్ మర్డర్ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు అర్జున్. ఇన్వెస్టిగేషన్ లో కీలక మలుపు వస్తోన్న దశలో అర్జున్ కు యాక్సిడెంట్ అయ్యి గతాన్ని మర్చిపోతాడు. అయితే పోలీస్ కమిషనర్ మోహన్ భార్గవ్ మాత్రం ఈ మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ తిరిగి అర్జున్ కే అప్పగిస్తాడు.
మరి ఆ తర్వాత ఏమైంది? ఆర్యన్ ను చంపింది ఎవరో అర్జున్ తెలుసుకోగలిగాడా?
నటీనటులు:
సుధీర్ బాబు సినిమా సినిమాకూ ఇంకా మెరుగవుతున్నాడు. దర్శకుడు సుధీర్ బాబు టాలెంట్ ను పూర్తి స్థాయిలో ఈ చిత్రం ద్వారా ఉపయోగించుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా పెర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఇంకా తన పాత్రను పూర్తిస్థాయిలో ఎఫెక్టివ్ గా పోషించాడు.
ఆర్యన్ దేవ్ పాత్రలో భరత్ నటన బాగుంది. తన క్యాస్టింగ్ సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చింది. అలాగే భరత్ పాత్ర సినిమా అంతా తన ఎఫెక్ట్ ను చూపించింది. మోహన్ భార్గవ్ పాత్రలో శ్రీకాంత్ నటన చాలా బాగుంది. తన పాత్రను కూడా ఎఫెక్టివ్ గా మలిచారు.
మౌనిక రెడ్డికి మంచి పాత్ర దక్కింది. చిత్ర శుక్లా చూడటానికి బాగుంది కానీ ఆమె పాత్ర వీక్ గా ఉంది.
సాంకేతిక నిపుణులు:
మహేష్ సూరపనేని కచ్చితంగా మంచి కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చాడు. కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో కచ్చితంగా తడబడ్డాడు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా టైట్ స్క్రీన్ ప్లే తో నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా టెన్స్ నరేషన్ ఉంటుంది.ఐతే సెకండ్ హాఫ్ లో మొమెంటం కచ్చితంగా మిస్ అయింది. ఒక దశ దాటాక అంతా బోరింగ్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ తరహాలో ఉండి ఉంటే కచ్చితంగా హంట్ మరింత ఎఫెక్టివ్ సినిమా అయ్యుండేది. సినిమా క్లైమాక్స్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తుంది.
ఘిబ్రన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రధాన బలం. కొన్ని సీన్స్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళడానికి ఉపయోగపడ్డాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బలాన్ని ఇచ్చాయి. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. సెకండ్ హాఫ్ లో ల్యాగ్ లేకుండా సీన్స్ ఉండే అవకాశం ఉండేది.
ప్లస్ పాయింట్స్:
- లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మన్స్
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
- బోరింగ్ సెకండ్ హాఫ్
- ఇంటర్వెల్ తర్వాత ల్యాగ్
విశ్లేషణ:
హంట్ కథగా ఆసక్తికర పాయింట్ తో ముడిపడి ఉంది. సుధీర్ బాబు డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ ల్యాగ్ తో ఉంది. అయితే ఈ సినిమా క్లిక్ అయ్యే అవకాశాలు అయితే తక్కువే.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5