Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 02 డిసెంబర్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం

సూర్యోదయం: ఉ.6:18
సూర్యాస్తమయం: సా.5:26
తిథి: మార్గశిర శుద్ధ నవమి ఉ.9:46 వరకు తదుపరి దశమి
సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము:పూర్వాభాద్ర ఉ.9:47 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: వజ్రం ఉ.11:59 వరకు తదుపరి సిద్ధి
కరణం: కౌలవ ఉ.10:01 వరకు తదుపరి తైతుల
దుర్ముహూర్తం: ఉ.8:24 నుండి 9:12 వరకు మ.12:24 నుండి 1:12 వరకు
వర్జ్యం : రా.7:05 నుండి రా.8:38 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి 12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం :ఉ.7:57 నుండి 9:12 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:58 నుండి 5:46 వరకు
అమృతఘడియలు: రా.తె‌.4:18 నుండి 5:50 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:43 నుండి 12:27 వరకు

ఈరోజు (02-12-2022) రాశి ఫలితాలు

మేషం: స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు సహాయం అందిస్తారు. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.

మిథునం: వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతానం విద్యా విషయాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం: వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

సింహం: చేపట్టిన పనులలో శ్రమాధిక్యం. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. సోదరులతో కలహా సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

కన్య: దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలిస్తాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

తుల: నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం: వ్యాపారాలు కొంత మందగిస్తాయి. వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

ధనస్సు: దూర బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

కుంభం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.

మీనం: ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తిచేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...