కొన్ని తాళ్ళు కట్టబడి వున్నాయ్.. వాటిల్లోంచి చేతిలోని ఓ బ్యాటు లాంటి వస్తువు సాయంతో, గుడ్డుని దాని మీద పెట్టుకుంటూ వెళ్ళాలి.. బుట్టలో గుడ్లను వెయ్యాలి. ఐదు గుడ్లను తొలుత ఎవరైతే వేస్తారు వాళ్ళే గెలిచినట్లు. వాళ్ళకి కొన్ని మార్కులు.!
అంతకు ముందు దొర్లుకుంటూ వెళ్ళి కొన్ని బాక్సుల్ని ఒకదాని మీద ఒకటి నిలబెట్టాలి. ఎవరు ఎక్కువ బాక్సుల్ని టవర్ తరహాలో నిలబెడితే వాళ్ళు గెలిచినట్లు. అన్నట్టు, ఈ టాస్కుల కోసం ఇద్దరు కంటెస్టెంట్లు ఏకాభిప్రాయంతో పక్కకు తప్పుకోవాలని మొత్తంగా వున్న కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఆదేశం.
టిక్కెట్ టు ఫినాలే రేసు నుంచి తాజాగా కీర్తి ఔట్ అయిపోయింది. సంచాలక్ కుట్ర పూరిత నిర్ణయాల వల్ల తాను ఔట్ అయిపోయానంటూ కీర్తి గుస్సా అయ్యింది. కీర్తి తనను టార్గెట్ చేసింది గనుక ఓడిపోయానంటూ రేవంత్ ఫైర్ అవుతాడు.
అసలేంటిది బిగ్ బాస్.? ఇలాంటి చెత్త గేమ్స్ దేనికోసం.? అనే ఆవేదన బిగ్ బాస్ వ్యూయర్స్‌కి కలగడంలో వింతేముంది.? ‘సామాన్యుడ్ని.. ఈ స్థాయి వరకూ వచ్చాను. ఇంతకు ముందెవరూ ఇలా చేయలేకపోయారు. కాబట్టి, నాకు ట్రోఫీ ముఖ్యం..’ అంటూ పదే పదే పాత సొల్లు చెబుతూ వస్తున్నాడు ఆది రెడ్డి. అది ఇంకోసారి కొనసాగించాడు.
గుడ్డు పోయింది బిగ్ బాస్.! ఔను, గుడ్డు టాస్క్ అయిపోయేసరికి అందరికీ అదే భావన కలిగింది. ‘కీర్తి నన్ను అపార్థం చేసుకుంది. ఆమె నాకు మంచి స్నేహితురాలు. పైగా, ఆమె అంటే నాకు చాలా చాలా ఇష్టం..’ అంటూ అర్థరాత్రి ఇనాయా, బిగ్‌బాస్‌తో చెబుతున్నట్లగా ఓ హైడ్రామా.!
బిగ్ బాస్ సీజన్ సిక్స్ తాజా ఎపిసోడ్ సిత్రాలివి. నవ్వుకున్నోడికి నవ్వుకున్నంత.. చిరాకు పడినోడికి, చిరాకు పడినంత.!
179831 158961quite very good put up, i undoubtedly love this web website, keep on it 400538
877672 272079New York Travel Tips […]below you will discover the link to some sites that we think you must visit[…] 334185
819412 945863Immer etliche Firmen bentzen heutzutage Interimmanagement als innovatives und ergnzendes Gertschaft i. Spanne der Unternehmensfhrung. Denn hiermit wird Kenntnisstand leistungsfhig, bedarfsgerecht und schnell ins Unternehmen geholt. 651189