Switch to English

మామ జయంతి వేడుకలో చిరు స్పీచ్‌ అదుర్స్.. ఆయన కామెడీ టైమింగ్‌కి హ్యాట్సాఫ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

ప్రముఖ నటుడు, నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు అయిన అల్లు రామలింగయ్య వందవ జయంతి కార్యక్రమాలను అల్లు అరవింద్ మరియు కుటుంబ సభ్యులు గ్రాండ్ గా నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుండి రాత్రి వరకు పలు కార్యక్రమాలను నిర్వహించిన అల్లు కుటుంబ సభ్యులు రోజంతా కూడా సందడి చేశారు.

సాయంత్రం అల్లు రామలింగయ్య పై రాసిన పుస్తకమును ఆవిష్కరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో ఇండస్ట్రీ ప్రముఖులు పలువురు హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా అల్లు రామలింగయ్య గారితో మొదటి పరిచయం మొదలుకొని ఆయన తనను ఇంటి అల్లుడుగా చేసుకునేందుకు చూసిన విధానం.. తనకు పెట్టిన పరీక్షల గురించి చాలా సరదాగా అందరిని నవ్వించే విధంగా కామెడీ టైమింగ్ తో చెప్పి చిరంజీవి తనదైన మార్క్ నవ్వులు పూయించారు.

మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ అధ్యంతం నవ్వులు పూయించింది. దాదాపు అరగంట పాటు సాగిన ఆయన స్పీచ్ ప్రతి ఒక్కరిని కూడా నవ్వించింది అనడంలో సందేహం లేదు. అల్లు రామలింగయ్య గారు ఒకసారి తనను పక్కన కూర్చోబెట్టుకొని తాగమంటూ మందు గ్లాసు చేతికి ఇవ్వబోయారని, ఆ సమయంలో తాను అబ్బే తాగను నేను హనుమంతుని భక్తుడిని అంటూ చెప్పగానే ఆయన నాకు పాజిటివ్‌ మార్కులు వేసేసుకున్నాడంటూ కామెడీ టైమింగ్ తో పంచ్ డైలాగులతో మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ సాగింది.

మా నాన్న గారు చెప్పడంతో అల్లు రామలింగయ్య గారి ఇంటికి సురేఖ ను ఇష్టం లేకుండానే చూసేందుకు వెళ్లాను అని.. ఆ సమయంలో సురేఖ ను చూసి నో చెప్పలేక పోయాను. ఒక వైపు సినీ కెరీర్‌ గురించి ఆలోచన మరో వైపు సురేఖ ను చూసి నో చెప్పలేక పోయాను అంటూ చిరంజీవి చాలా నాటీగా కామెంట్స్ చేశాడు. చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో ఆయన భార్య సురేఖ సిగ్గుపడుతూ నవ్వుతూ మురిసిపోవడం చూడవచ్చు.

అలాగే అల్లు అర్జున్, ఇతర కుటుంబ సభ్యులు ఇంకా చిరంజీవి పిల్లలు అంతా కూడా ఆయన మాటలకు నవ్వుకున్నారు. అల్లు రామలింగయ్య గారితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చిన చిరంజీవి ఆయనతో నాకు ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చిందని, మేమిద్దరం ఎక్కువ సినిమాల్లో నటించడం వల్ల ఆయన గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశం నాకే దక్కిందని చిరంజీవి అన్నారు.

నవ్వుతూ నవ్విస్తూ ఎన్నో విషయాలను చిరంజీవి తన మామగారు అల్లు రామలింగయ్య గారి గురించి చెప్పి అందరిని మెప్పించారు. ప్రస్తుతం అల్ల రామలింగయ్య గారి గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ కామెడీ టైమింగ్ కి హ్యాట్సాఫ్ అంటూ చాలా మంది చాలా రకాలుగా మెగాస్టార్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...