Switch to English

సీనియర్ ఎన్టీయార్ పేరు మార్పు.! జూనియర్ ఎన్టీయార్‌పై టీడీపీ ఏడుపు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

కొన్నాళ్ళ క్రితం నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు కొందరు అసెంబ్లీ సాక్షిగా అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటనకు సంబంధించి గన్నవరం ఎమ్మెల్యే (టీడీపీ నుంచి గెలిచినా, వైసీపీలోకి దూకేశారు) క్షమాపణ కూడా చెప్పారు ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో. తన భార్యపై అంతటి జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని చంద్రబాబు తట్టుకోలేకపోయారు. మీడియా ముందు కంటతడి పెట్టారు. ‘కౌరవ సభలో వుండేది లేదు.. అధికారంలోకి వచ్చాక గౌరవ సభలోనే అడుగు పెడతా..’ అని శపథం చేశారు.

ఆ ఘటనపై నందమూరి కుటుంబమంతా స్పందించింది. యంగ్ టైగర్ ఎన్టీయార్ కూడా స్పందించాడు.. ఓ వీడియో విడుదల చేశాడు. సినీ నటుడిగా ఏ రాజకీయ పార్టీ తరఫున కూడా వకాల్తా పుచ్చుకోలేని పరిస్థితి ఎన్టీయార్‌ది. ఏ పార్టీ మీదా నేరుగా ఆయన విమర్శలు చేయలేడు. అందుకే, అత్యంత జాగ్రత్తగా పదాల్ని ఎంచుకున్నాడు. తన మేనత్తకు జరిగిన అవమానంపై స్పందించాడు.. సున్నితమైన పదజాలంతో, కొంచెం ఘాటైన భావజాలంతో.!

ఇక, ఇప్పుడు స్వర్గీయ ఎన్టీయార్ పేరుని హెల్త్ యూనివర్సిటీ నుంచి తొలగించి, వైఎస్సార్ పేరుని వైసీపీ ప్రభుత్వం పెట్టడంపైన కూడా జూనియర్ ఎన్టీయార్ స్పందించాడు. ఈ మేరకు ట్వీటేశాడు. అయితే, ఆ ట్వీట్ తెలుగుదేశం పార్టీలో చాలామందికి నచ్చడంలేదు. టీడీపీ అనుకూల మీడియాకి అస్సలు మింగుడుపడ్డంలేదు.

‘మా తాతగారు.. మా దైవం., అన్నగారు, ఎన్టీఆర్ లాంటి ఆప్యాయత కూడిన పిలుపు నుంచి ఎన్టీఆర్ అనే పొడి పిలుపుదాకా మారడం గమనార్హం. ఆఖరికి జగన్ చెల్లెలు షర్మిలగారు కూడా ఇది తప్పు.. అని ఖండించిన ఈ సందర్భాన్ని కూడా వైసీపీ అభిమానులకు బిస్కట్ ఎలా వెయ్యాలి అనే యాంగిల్‌లో చూడటం..’ అంటూ ఓ టీడీపీ అనుకూల మీడియా, యంగ్ టైగర్ ఎన్టీయార్ మీద సెటైర్ వేసింది.

‘అప్పుడు భువనేశ్వరి అవమానంపై.. ఇప్పుడు పేరు మార్పుపై.. గోడమీద పిల్లిలా జూ ఎన్టీఆర్’ అంటూ మరో టీడీపీ అనుకూల మీడియా చిత్ర విచిత్రమైన ప్రస్తావన తీసుకొచ్చింది. ‘టీడీపీ క్యాడర్ దీన్నొక నేరంగా చూస్తోంది..’ అంటూ ఎన్టీయార్ మీద మరో టీడీపీ అనుకూల మీడియా వ్యాఖ్యానిస్తోంది.

తెలుగుదేశం పార్టీ కోసం యంగ్ టైగర్ ఎన్టీయార్ చాలా చేశాడు 2009 ఎన్నికల సమయంలో. తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి, ఎన్నికల ప్రచారం చేశాడు. ఆ ప్రచారంలోనే రోడ్డు ప్రమాదానికి గురై చావు అంచులదాకా వెళ్ళాడు యంగ్ టైగర్. అలాంటి ఎన్టీయార్ మీద తెలుగుదేశం పార్టీకి ఎందుకంత కసి.?

పైగా, ఎన్టీయార్ ఎలా స్పందించినా టీడీపీలో ఓ బ్యాచ్ ఆయన్ని దూషించడానికెప్పుడూ సిద్ధంగానే వుంటుంది. అలాంటి టీడీపీ తరఫున ఎన్టీయార్ ఎలా వకాల్తా పుచ్చుకుంటాడు.? అయినాగానీ, వైసీపీ నుంచి తనకు వ్యతిరేకత ఎదురవుతుందని తెలిసీ, స్పందించాల్సినప్పుడు స్పందిస్తూనే వుంటాడు.

‘పేరు మార్చడం ద్వారా ఎన్టీయార్ స్థాయి తగ్గదు.. వైఎస్సార్ స్థాయి పెరగదు..’ అనడం కంటే ఘాటైన వ్యాఖ్య ఇంకేముంటుంది.? ఇది అర్థం కాకుండానే యంగ్ టైగర్ ఎన్టీయార్ మీద ‘కసి’తో రగిలిపోతున్నారు కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు.

యంగ్ టైగర్ ఎన్టీయార్ మీద గతంలో టీడీపీ నేతలు అత్యంత దారుణమైన విమర్శలు చేశారు. అప్పుడెప్పుడూ చంద్రబాబు వారిని వారించలేదు. పైగా, ఎన్టీయార్‌దే తప్పన్నట్లు బాలకృష్ణతోనూ జూనియర్ ఎన్టీయార్‌కి వార్నింగ్ ఇప్పించిన సందర్భం (కొడాలి నాని విషయంలో) చూశాం. కానీ, యంగ్ టైగర్ ఏనాడూ తెలుగుదేశం పార్టీకి చెడు కలిగేలా వ్యవహరించలేదు.

అసలు యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని మొదట్లో నందమూరి కుటుంబ సభ్యుడిగా గుర్తించేందుకే టీడీపీకి వత్తాసుపలికే నందమూరి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదన్నది కఠోర వాస్తవం. ఇప్పటికీ ఆ ‘కసి’ అలాగే కొనసాగుతున్నట్టుంది యంగ్ టైగర్ ఎన్టీయార్ మీద.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...