Switch to English

ఫాఫం వైసీపీ.! 175 సీట్లలో జనసేన పోటీ చేస్తే వాళ్ళకి ‘హార్ట్ ఎటాక్’ వచ్చేస్తుందేమో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

ఐటీ శాఖ మంత్రి ఆయన.. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని విమర్శించడమొక్కటే ఆయన బాధ్యత.. అన్నట్లు మారింది. నీటి పారుదల శాఖ మంత్రి ఆయన.. కానీ, జనసేన అధినేత మీద విరుచుకుపడేందుకు నీటి పారుదల శాఖ కాస్తా, నోటి పారుదల శాఖగా ఆయనకు మారిపోయినట్టుంది.!

ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, తన శాఖకు సంబంధించి రాష్ట్రం ఎలా తమ హయాంలో ఉద్ధరణకు గురవుతుందో మాత్రం చెప్పరు. విశాఖపట్నంకు ఎలాంటి ఐటీ పరిశ్రమలు వస్తున్నాయో చెప్పరుగానీ, ఆయనకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలుసుకోవడం ముఖ్యం. నోటి పారుదల శాఖ.. అదేనండీ నీటి పారుదల శాఖ మంత్రి కూడా అంతే. ఆయనకు డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదుగానీ, జనసేన పార్టీ పోటీ చేయబోయే నియోజకవర్గాల సంఖ్య గురించి తెలుసుకోవడం మీద ఆయనకు అమితమైన మమకారం.

తాజాగా, మినిస్టర్ అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా ‘కాటన్ దుస్తుల ఛాలెంజ్లు ఆపి.. 175 సీట్లకి పోటీ చేస్తున్నారా! లేదా? ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించండి పవన్ కళ్యాణ్..’ అంటూ ట్వీటేశారు. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్నది ఆ పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి వుంటుంది.
2014 ఎన్నికల సమయంలో పుట్టిన ఆ పార్టీ, ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసింది, 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుంది. గెలుపోటములు వేరే చర్చ. కరెన్సీ నోట్లతో ఓటర్లను ప్రలోభ పెట్టకుండా రాజకీయం చేయాలన్నది జనసేన ఉద్దేశ్యం. ఈ క్రమంలో ఓటమి కూడా ఎంతో గౌరవంగా వుంటుంది.

151 సీట్లు గెలిచి అధికార పీఠమెక్కిన వైసీపీ ఏం చేయగలిగింది.? ప్రత్యేక హోదా తెచ్చిందా.? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిందా.? రేప్పొద్దున్నన 175 సీట్లు గెలుస్తామంటున్నారు.. ఒకవేళ అదే జరిగితే, మూడు కాదు, ముప్ఫయ్ మూడు రాజధానులంటారేమో. అప్పుడైనా ప్రత్యేక హోదా తేగలరా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలరా.?

ముందైతే అంబటి రాంబాబు, డయాఫ్రమ్ వాల్ గురించి తెలుసుకుని, ఆ తర్వాత జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల సంఖ్య గురించి తెలసుకుంటే మంచిది. ‘మీరు ఆ దుస్తులు విప్పి గంట అరగంట ఇంకేమైనా చేసే పనులు ఆపి, ఇప్పటికైనా పోలవరం, వెలిగొండ లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసే డేట్స్ ప్రకటించండి అంబటి రాంబాబుగారూ..’ అంటూ జనసేన మహిళా నేత రాయపాటి అరుణ ఎద్దేవా చేశారంటే, అసలు వైసీపీ స్థాయి ఏంటనేది అర్థమయిపోవడంలేదూ.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...