Switch to English

15 శాతానికి పెరిగిన జనసేన ఓటు బ్యాంకు: ఉండవల్లి అరుణ్ కుమార్

91,427FansLike
56,276FollowersFollow

జనసేన పార్టీకి ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఓ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించీ, ఆయా పార్టీలకు పెరిగిన అలాగే తగ్గిన ఓటు బ్యాంకు గురించీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన రీతిలో విశ్లేషించారు.

జనసేన పార్టీకి సంబంధించి 2019 ఎన్నికలు ‘అత్యంత బలహీనమైనవి’ అని పేర్కొన్నారు ఉండవల్లి. కేవలం ఆరు శాతానికే జనసేన పార్టీ పరిమితమవ్వాల్సి వచ్చిందనీ, ఇపపుడది 12 శాతానికి పైగా పెరిగిందని చెప్పుకొచ్చారాయన. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందనీ, రూరల్ నియోజకవర్గాల్లో వైసీపీకి ఓటు బ్యాంకు పెద్దగా తగ్గకపోయినా, అర్బన్‌లో మాత్రం వైసీపీ బాగా తెబ్బ తినేసిందని ఉండవల్లి విశ్లేషించారు.

వైసీపీ ఏ ఇతర పార్టీతోనూ కలవబోదనీ, వైసీపీ గనుక బీజేపీతో కలిస్తే వైసీపీ దారుణంగా దెబ్బ తింటుందని వైఎస్ జగన్‌కి తెలుసనీ, అందుకే బీజేపీకి అవసరమైనప్పుడల్లా బయట నుంచి మద్దతిస్తున్నారు తప్ప, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. బీజేపీతో బహిరంగంగా కలవలేకపోతున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.

‘టీడీపీకి సైతం ఓటు బ్యాంకు పెరిగింది. అది రెండు శాతమా.? పది శాతమా.? అన్నది రానున్న ఎన్నికల్లో తెలుస్తుంది. మోడీ తలచుకుంటే టీడీపీ, జనసేన కలుస్తాయ్.. ఏపీ నుంచి ఎవరు గెలిచినా, కేంద్రంలో బీజేపీకి మద్దతిస్తారు గనుక, ఏపీ రాజకీయలపై బీజేపీ పెద్దగా ఆసక్తి చూపడంలేదు..’ అని ఉండవల్లి వ్యాఖ్యానించడం గమనార్హం.

‘జనసేన ఓటు బ్యాంకు 15 శాతం వరకు పెరిగింది. రానున్న ఎన్నికల నాటికి ఇది మరింత పెరగొచ్చు. పొత్తు రాజకీయాల్లో ఎవరు ఎంతలా లాభపడతారన్నది ఇప్పుడే చెప్పలేం.. జనసేన బలం మాత్రం, ఇదివరకటిలా తక్కువ కాదు.. చాలా ఎక్కువగా వుండబోతోంది..’ అని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఇదిలా వుంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నట్టు జనసేన పార్టీ బలపడిన మాట వాస్తవం అనీ, అయితే తమ ఓటు బ్యాంకు 25 శాతానికి పైనే పెరిగిందని జనసేన పార్టీకి చెందిన నేతలు చెబుతున్నారు. జనసేన అంతలా బలపడింది కాబట్టే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనసేనని చూసి భయపడుతున్నారనీ, టీడీపీ – వైసీపీ కలిసి జనసేనను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని జనసేన ఆరోపిస్తోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా...

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

రాజకీయం

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ ఉక్కుపాదం: ఉత్తరాంధ్ర వరకూ వెళ్ళదా.?

అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపనుందా.? అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఆటంకాలు సృష్టించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా.? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నానా...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

ఎక్కువ చదివినవి

వారసత్వాన్ని వైఎస్ జగన్ ఎందుకు ఒప్పుకోవడంలేదు.?

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగానే కదా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చింది. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తీవ్రమైన ఒత్తిడిని తెచ్చి, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి...

కారులో ఢిల్లీకి వెళ్ళలేం.! విమానమెక్కనున్న కేసీయార్ ‘సారు’.!

కారు.. కేసీయార్ సారు.. తెలంగాణ సర్కారు.! ఇదీ నిన్న మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు నినదించిన తీరు.! ఇకపై ఆ నినాదం మారేలా వుంది. విమానమెక్కి హస్తినకు పోదాం.. అని తెలంగాణ...

ఒకేసారి రెండు సినిమాలతో పిల్లలమర్రి రవితేజ తెరంగేట్రం.

కళామ తల్లిని నమ్ముకున్నావాళ్ళు ఎప్పుడో ఒకసారి సక్సెస్ కొడతారు. ఆర్టిస్ట్ అవుదామని ఎన్నో కలలతో వచ్చి మోడల్ గా మారి, ప్రొడక్షన్ మేనేజర్ గా ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు ఏకంగా హీరోగా...

‘ది ఘోస్ట్ ‘ క్లాస్ గా తీసిన పక్కా మాస్ సినిమా.. దర్శకుడు ప్రవీణ్ సత్తారు.

కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ చిత్రం భారీ అంచనాలతో దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. 'ది...

అక్కడ మాత్రమే సందడి.. ఇలా అయితే కష్టం

తమిళ ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్‌ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన పొన్నియన్ సెల్వన్‌ వసూళ్ల గురించి ప్రస్తుతం ఆసక్తికర...