మహేశ్ బాబు కెరీర్ గ్రాఫ్ అంటే పోకిరికి ముందు ఆ తర్వాతగా మారిపోయింది. ఆయన కెరీర్లో పోకిరి సృష్టించిన మేనియా ఆస్థాయిలోనిది. ఈ సినిమా తర్వాత వచ్చిన సైనికుడులో తొలిసారి సూపర్ స్టార్ మహేశ్ అని టైటిల్ కార్డ్ వేశారు. పోకిరి తర్వాత పెరిగిన అంచనాల నేపథ్యంలో వచ్చిన సైనికుడు, అతిథి, ఖలేజా ఫ్లాప్ సినిమాలుగా నిలిచాయి. దీంతో మహేశ్ చాలా గ్యాప్ తీసుకున్నారు. సరైన స్క్రిప్ట్ పడితే తన హిట్ రేంజ్ ఏంటో చూపేందుకు ఎక్కవ సమయం తీసుకోలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా విజయమే ఇందుకు నిదర్శనం. 2011లో వచ్చిన దూకుడు మహేశ్ కెరీర్లో బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా నుంచే తెలుగు సినిమాలకు యూఎస్ మార్కెట్ పెరగడం ప్రారంభమయింది. లాస్ ఎంజిల్స్ టైమ్స్ లో ఈ సినిమా విజయంపై ప్రత్యేక ఆర్టికల్ వేయడం విశేషం.
ఫ్యాన్స్ ఆశించే హీరోయిజం..
దూకుడు తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన బిజినెస్ మేన్ మహేశ్ లోని మాస్ హీరో మెటీరియల్ ను మరోసారి చూపి విజయం సాధించింది. ఇప్పటికీ మహేశ్ ఫ్యాన్స్ పోకిరి, బిజినెస్ మేన్ లెవల్ హీరోయిజంను ఆశిస్తారనేది నిజం. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మహేశ్ ను మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసి హ్యాట్రిక్ హిట్స్ అందించింది. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేసిన 1నేనొక్కడినే మూవీ భారీ అంచనాలను రీచ్ కాలేక ప్రయోగాత్మక సినిమాగా నిలిచిపోయింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో మరోసారి చేసిన ఆగడు డిజాస్టర్ గా నిలిచింది. ఈ సమయంలో కొరటాల శివతో చేసిన శ్రీమంతుడు నాన్-బాహుబలి కేటగిరీలో మహేశ్ కు మరో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తర్వాత మళ్లీ వరుసగా బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు వరుస డిజాస్టర్లు అయ్యాయి.
త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలు..
వీటి తర్వాత మహేశ్ ఫ్యాన్స్ కోరుకునే స్థాయిలో హీరోయిజం, మాస్ కథాంశాలు తక్కువే చేసినా సక్సెస్ ఫుల్ సినిమాలు చేశారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుస హిట్లు ఇచ్చారు. రీసెంట్ గా చేసిన సర్కారు వారి పాట యావరేజ్ గా నిలిచింది. మహేశ్ కెరీర్లో అందరిలానే హిట్లు, ఫ్లాపులు ఉన్నాయి. అయితే.. తనలోని రోరింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనికంటే ముందు ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అటు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఏడాదికో సినిమా చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు మహేశ్.
888008 268215Just wanna input on few general items, The web site layout is perfect, the articles is quite superb : D. 882329
305335 465160Great post, I conceive weblog owners need to acquire a good deal from this internet weblog its real user pleasant. 730784