Switch to English

వైసీపీ మార్కు మద్య నిషేధమంటే ఇదీ లెక్క.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

వైసీపీ మార్కు ప్రత్యేక హోదా.. వైసీపీ మార్కు పోలవరం ప్రాజెక్టు.. వైసీపీ మార్కు రాజధాని.. ఇలా చెప్పుకుంటూ పోతే, బులుగు రాజ్యాంగంలో ప్రతిగానికీ వేరే అర్థం కనిపిస్తుంటుంది. జనమే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు.!

అమ్మ ఒడి విషయానికే వస్తే, స్వయానా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి, ‘ఇంట్లో ఒక విద్యార్థికి 15 వేలు, ఇద్దరుంటే మొత్తంగా ముప్ఫయ్ వేలు’ అని చెప్పారు. కానీ, ఇంట్లో ఒకరికి మాత్రమే అమ్మ ఒడి లభిస్తోంది. అది కూడా, 15 వేలు కాదు, 13 వేలు మాత్రమే. రెండు వేల రూపాయలకు వేరే ‘షరతులు’ వర్తింపజేశారు.

ప్రత్యేక హోదా విషయానికొస్తే, ప్రతిపక్షంలో వున్నప్పుడు నిరాహార దీక్ష చేస్తారు.. రాజీనామాలూ చేస్తారు. అధికారంలోకి వచ్చాక, జస్ట్ అడుగుతుంటారంతే. మెడలు వంచే ప్రక్రియలేమీ వుండవు.. అధికార పీఠమెక్కిన తర్వాత. సన్న బియ్య సంగతి సరే సరి. సాక్షిలో తప్పు రాశారు అధ్యక్షా.. అని సొంత మీడియా సంస్థ రెప్యుటేషన్ గురించి అసెంబ్లీలోనే సెలవిచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.

సీపీఎస్ రద్దు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతిపక్షంలో వున్నప్పుడు అవగాహన లేక, ఆ హామీ ఇచ్చారట వైఎస్ జగన్. అలాగని వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల సెలవిచ్చారు. విద్యత్ ఛార్జీలు తగ్గించేస్తామని గతంలో చెప్పారు.. ఇప్పుడేమో పెంచుకుంటూ పోతున్నారు.

మద్య నిషేధం విషయానికొస్తే, అలాంటి హామీ ఏదీ తాము ఇవ్వలేదనీ, అసలు తమ మేనిఫెస్టోలో అలాంటి అంశం లేదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పుకొచ్చారు. ఇదీ వరస.! బులుగు రాజ్యాంగంలో అన్నీ రివర్స్. మాట తప్పడం.. మాట తిప్పడం.. ఇదే వైసీపీ రాజ్యాగం.

బార్ లైసెన్సుల కోసం తాజాగా వైసీపీ నాయకులే పోటీ పడ్డారు. కోట్లు వెచ్చించి లైసెన్సులు దక్కించుకున్నోళ్ళు, జనాన్ని ముందు ముందు ఎలా దోపిడీ చేయనున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘లిక్కర్ డాన్’ అనే గుర్తింపు వున్న వైసీపీ ముఖ్య నేత, కీలక పదవిలో వున్న పెద్దాయన ఓ ప్రాంతంలో మొత్తం వ్యవహారాన్ని సిండికేట్ చేసెయ్యడంతో.. ఆ పరిధిలో ఎక్కడా 70 లక్షలు కూడా లైసెన్సు దాటలేదట.

ఇదీ వైసీపీ మార్కు బులుగు రాజ్యాంగమంటే.! ప్రశ్నిస్తే పాతరేస్తాం, విచారణ సంస్థల్ని ఉసిగొల్పుతాం.. వీలైతే, చంపేసి డోర్ డెలివరీ చేస్తాం.. అనేంతటి గొప్ప రాజ్యాంగాన్ని వైసీపీ అమలు చేస్తోందన్నది విపక్షాల విమర్శ.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...