Switch to English

తెలుగు సినిమా మీసం తిప్పిన ‘మగధీర’కు 13 ఏళ్లు..! మెగా ఫ్యాన్స్ హంగామా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ప్రతి పదేళ్లకు సినిమా ట్రెండ్ మారుతుందనేది సినీవర్గాల మాట. ప్రేక్షకుల అభిరుచి, సినిమా మేకింగ్, టెక్నాలజీ, బిజినెస్, కలెక్షన్లు.. ఇలా ఏ అంశంలోనైనా వచ్చే మార్పు సినిమాలపై పడుతుంది. తెలుగు సినిమా చరిత్రలో అటువంటి సంఘటనలు ఉన్నాయి. అలా టాలీవుడ్ కి కమర్షియల్ గా కొత్త టార్గెట్ సెట్ చేసి.. అప్పటికి 78 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన సినిమా ‘మగధీర’. తెలుగు సినిమాను శాసించిన మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి వచ్చిన రామ్ చరణ్ తేజ్ రెండో సినిమాతోనే తెలుగు సినిమాపై చెరగని సంతకం చేశాడు. మగధీర సాధించిన విజయం భారతీయ సినీ పరిశ్రమని ఉలిక్కిపడేలా చేసింది. నేటితో (జూలై 31) ఈ సినిమా విడుదలై 13 ఏళ్లు పూర్తి చేసుకుంది.

తెలుగు సినిమా మీసం తిప్పిన ‘మగధీర’కు 13 ఏళ్లు..! మెగా ఫ్యాన్స్ హంగామా..

రాజమౌళి ఊహలకు రెక్కలు..

కమర్షియల్ కథలతో వరుస హిట్లతో ఉన్న రాజమౌళి మగధీరతో తనలోని విజువల్ థాట్స్ ను ఆవిష్కరించే అవకాశం దక్కింది. అందుకు అవసరమైన 40కోట్లకు పైగా బడ్జెట్ చాలా పెద్ద మొత్తం. నిర్మాత అల్లు అరవింద్ మెగా క్రేజ్, రాజమౌళి ఆలోచన, కథపై ఉన్న నమ్మకంతో అంత బడ్జెట్ కు సై అన్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ సహ నిర్మాతగా సినిమా తెరకెక్కించారు. వీరందరికీ రామ్ చరణ్ ఒక ఆయుధంలా దొరికారు. 400 ఏళ్ల నాటి కథ. గుర్రపుస్వారీ, కత్తి యుద్ధాలు, వీరోచిత పోరాటాలు వీటన్నింటినీ రామ్ చరణ్ అవలీలగా చేసేశారు. ఇంటర్వెల్ ముందు,. తర్వాత వచ్చే గుర్రపుస్వారీల్లో చరణ్ చేసిన విన్యాసాలకు ధియేటర్లలు పూనకాలతో ఊగిపోయాయి. 100 మెన్ ఫైట్ సినిమాకే హైలైట్. ప్రేక్షకులే 100 మందిని లెక్కపెట్టినట్టు ఉండేలా రాజమౌళి చిత్రీకరణ, రామ్ చరణ్ వీరోచిత ప్రదర్శన ప్రేక్షకులను కట్టిపడేశాయి.

తెలుగు సినిమా మీసం తిప్పిన ‘మగధీర’కు 13 ఏళ్లు..! మెగా ఫ్యాన్స్ హంగామా..

కలెక్షన్ల ప్రభంజనం..

పూర్తి విజువల్ వండర్ గా 2009 జూలై 31న విడుదలైన మగధీరకు ఆంధ్రప్రదేశ్ అంతా బెనిఫిట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. షో తర్వత షోకి, రోజు రోజుకీ టాక్ మరింత పెరిగి ఏకంగా దక్షిణ భారతీయ సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ఎక్కడ చూసినా మగధీర,, మగధీర.. మగధీర. ప్రతిచోటా కలెక్షన్ల ప్రభంజనం. మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఏపీలో అప్పటికి ఉన్న ఇండస్ట్రీ హిట్ లెక్కల్ని చాలా తక్కువ రోజుల్లోనే అధిగమించి రోజురోజుకీ కొత్త లెక్కలతో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. రిలీజైన 5 వారాల తర్వాత హైదరాబాద్ లో 35 ధియేటర్లు పెంచారంటే ఈ సినిమా సాధించిన విజయాన్ని అర్ధం చేసుకోవచ్చు.

తెలుగు సినిమా మీసం తిప్పిన ‘మగధీర’కు 13 ఏళ్లు..! మెగా ఫ్యాన్స్ హంగామా..

మెగా ఫ్యాన్స్ కు మెగా గిఫ్ట్..

ఏకంగా 90కోట్ల షేర్.. సౌత్ ఇండియాలోనే తొలి 100 కోట్ల గ్రాస్ సినిమాగా చరిత్ర సృష్టించింది. అప్పటికి యూఎస్ మార్కెట్ కూడా విస్తరించలేదు.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయకపోయినా.. తెలుగులోనే ఇంతటి భారీ విజయం సాధించింది మగధీర. హీరోయిన్ కాజల్ రాజకుమారిలా ఒదిగిపోయి కెరీర్ బ్రేక్ సాధించింది. కీరవాణి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి. తెలుగు సినిమా బడ్జెట్, కలెక్షన్లు మగధీరకు ముందు ఆ తర్వాతగా మారిపోయాయి. చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ, పవన్ కల్యాణ్ ఫ్లాపుల సమయంలో ‘మగధీర’ రూపంలో రామ్ చరణ్ ఇచ్చిన గిఫ్ట్ కు మెగా ఫ్యాన్స్ ఊగిపోయారు. సినిమా విడుదలై 13 ఏళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్ర చిరంజీవి యువత జనరల్ సెక్రటరీ ఏడిద బాబీ, రామ్ చరణ్ యువశక్తి ప్రతినిధి శివ చెర్రీ ల ఆధ్వర్యంలో నేడు రాజమండ్రిలోని అశోకా ధీయేటర్లో 8.30 నిముషాలకు ప్రత్యేక షో వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చిరంజీవి, రామ్ చరణ్ అభిమాన సంఘాల నాయకులు ఈ ప్రదర్శనకు హాజరవుతున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...