Switch to English

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక క్రమశిక్షణ అంత గొప్పగా వుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,447FansLike
57,764FollowersFollow

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం. కానీ, అదే మాట ఎన్నేళ్ళు చెప్పుకుని రాజకీయంగా పబ్బం గడుపుకుంటారు.? అధికారంలో ఎవరున్నాసరే, పాత పాటే పాడాల్సిందే. అంతే తప్ప, రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం ఎవరూ చిత్తశుద్ధి చూపడంలేదు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అపారమైన సహజ సంపద వుంది. సుదీర్ఘ తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతం. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్న చందాన తయారైంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. రాజధాని వుందో లేదో తెలియదు. వున్నా, దాన్ని అధికార వైసీపీ గుర్తించే పరిస్థితి లేదు. ఇంకోపక్క, ఎప్పటికప్పుడు అప్పులు చేస్తే తప్ప, నెల గడిచే పరిస్థితి లేదు. ఇదెక్కడి దుస్థితి.?

అయినాగానీ, ‘ఆల్ ఈజ్ వెల్..’ అంటోంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పక్షం. ‘ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు..’ అని అధికార వైసీపీనే చెబుతుంది.. అంతలోనే, ‘భేషుగ్గా ఆర్థిక నిర్వహణ వుంది..’ అని ప్రభుత్వం తరఫున వివరణ వస్తుంటుంది.

గడచిన మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త అప్పులు గణనీయంగా పెరిగిన మాట వాస్తవం. కానీ, ‘పరిమితులకు లోబడే అప్పులు చేశాం..’ అని చెబుతోంది అధికార వైసీపీ. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ంలో కంటే, ఢిల్లీలో ఎక్కువ వుంటున్నారు.. అప్పుల కోసం ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం.. అన్నట్టు తయారైంది ఆయన పరిస్థితి.

ఇంతా చేసి, రాజధానిని నిర్మించారా.? లేదాయె.! పోనీ, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేశారా.? అదీ లేదు. ఇంతకీ, అప్పులు చేసి ఏం సాధించినట్టు.? ఇంకేం సాధించారు.. సంక్షేమ పాలన చేసేస్తున్నారట. సంక్షేమం కూడు పెట్టదు. సంక్షేమంటే, జనంలోకి డబ్బులు వెళతాయ్.. తిరిగి అవి చేరేవెక్కడికో అందరికీ తెలిసిందే.

రోడ్లను సైతం బాగు చేయలేని దుస్థితి.. అలా రోడ్లను బాగు చేయడానికీ, అప్పులు చేయాల్సిన దుస్థితి. అయినా, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి భేష్.. అని ఆర్థిక మంత్రి చెబుతున్నారు. నమ్మాల్సిందే, నమ్మి తీరాల్సిందే.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...