Switch to English

150 ప్లస్లూ.! వైసీపీ అంతర్గత సర్వేలో తేలింది ఇదేనట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ అంతర్గత సర్వేలు చేసుకోవడం మామూలే. ఆయా సర్వేల్లో ఏం తేలుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ అంతర్గత సర్వేల్లో 151కి పైగా సీట్లు వస్తాయని తేలిందట. అలాగని వైసీపీ అనుకూల మీడియా కుండబద్దలుగొట్టేస్తోంది. కానీ, ఎలా.?

2019 ఎన్నికల తర్వాత గడచిన మూడేళ్ళలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏంటి.? ఏ ప్రాతిపదికన జనం తిరిగి వైసీపీకే అధికారం కట్టబెడతారు.? అన్న అంశాల గురించి చర్చించుకోవాల్సి వస్తే, ‘గుండు సున్నా..’ అన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది.

ప్రత్యేక హోదా వైసీపీ హయాంలో వచ్చిందా.? పోలవరం ప్రాజెక్టు వైసీపీ హయాంలో పూర్తయ్యిందా.? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఒక్క అడుగు అయినా వైసీపీ హయాంలో ముందుకు పడిందా.? అంతెందుకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఉక్కు పరిశ్రమ వచ్చిందా.? అవన్నీ తర్వాత, వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో బస్టాండు నిర్మాణం జరిగిందా.?

ఇలా, పైన పేర్కొన్న అన్ని ప్రశ్నలకూ సమాధానం ‘నో’ అనే. మరి, ‘యస్.. మళ్ళీ వైసీపీనే అధికార పీఠమెక్కిస్తాం..’ అని, వైసీపీ అంతర్గత సర్వేల్లో జనం ఎలా చెప్పగలిగినట్లు.? జనం చెప్పినా, చెప్పకపోయినా.. చెప్పేశారన్నట్టు వ్యవహరించడం వైసీపీకి కొత్తేమీ కాదు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా దొంగ ఓటర్లను అధికార వైసీపీ ఎలా తీసుకొచ్చిందో చూశాం. బహుశా సర్వేల కోసం కూడా అలాంటోళ్ళన తీసుకొచ్చారేమో.. అని సోషల్ మీడియాలో వైసీపీ మీద సెటైర్లు పడుతున్నాయ్.

2014 ఎన్నికల్ని తీసుకుంటే, అప్పట్లో టీడీపీ – బీజేపీ కూటమికి, వైసీపీకి మధ్య ఓట్ల తేడా చాలా చాలా తక్కువ. ఆ విషయాన్ని పదే పదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ అప్పట్లో చెబుతుండేవారు. 2024 ఎన్నికల్లో కూడా స్వల్ప ఓట్ల తేడా.. ఫలితాల్ని మార్చేస్తుంది. 151 నెంబర్ కాస్తా.. 1 లేదా 5 లేదా 15 లేదా 11 అయిపోవడం పెద్ద వింతేమీ కాదు.

60 శాతం మందికి పైగా ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత వుందని, వాళ్ళంతా ఓడిపోతారనీ ఆ మధ్యనే ప్రశాంత్ కిషోర్, వైసీపీ అధినేతకు ఓ నివేదిక ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఇంతలోనే, 151 సీట్లు గెలిచేస్తామంటూ వైసీపీ అనుకూల మీడియా హడావిడి చేస్తోందంటే, దానర్థమేంటి.? వైసీపీ వెన్నులో వణుకు మొదలైనట్టే కదా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...