థియేట్రికల్ రికార్డ్స్ తో పాటు ఇకపై డిజిటల్ రికార్డ్స్ గురించి మాట్లాడుకోవడం కూడా సాధారణం అయిపొతుందెమో. న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం 2021 చివరి హిట్ గా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 20 కోట్లకు అమ్ముడుపోతే దానిపై పావలా శాతం లాభాలు తెచ్చిపెట్టింది.
ఇక ఈ నెల 21న శ్యామ్ సింగ రాయ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఓటిటిలో కూడా ఈ చిత్రం అదరగొడుతోంది. గత వారం అత్యధిక మంది నెట్ ఫ్లిక్స్ లో చూసిన టాప్ 3 చిత్రాల్లో శ్యామ్ సింగ రాయ్ నిలవడం విశేషం. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ టాప్-3లో చోటు దక్కించుకున్న ఏకైక ఇండియన్ సినిమా కూడా ఇదే.
ఇండియన్ సబ్స్క్రైబర్స్, అందునా తెలుగు సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉండే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన శ్యామ్ సింగ రాయ్ ఈ రికార్డ్ సాధించడం నిజంగా గొప్పే.
268321 759686Does your weblog have a contact page? Im having a tough time locating it but, Id like to send you an e-mail. Ive got some suggestions for your blog you may be interested in hearing. Either way, fantastic website and I appear forward to seeing it expand more than time. 643159