Switch to English

హీరో మూవీ రివ్యూ

Critic Rating
( 2.25 )
User Rating
( 2.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow
Movie హీరో
Star Cast అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య టి
Director శ్రీరామ్ ఆదిత్య టి
Producer పద్మావతి గల్లా
Music జిబ్రాన్
Run Time 2 hr 12 Mins
Release జనవరి 15, 2022

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా అరంగేట్రం చేసిన మొదటి చిత్రం హీరో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి స్పెషల్ గా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

అర్జున్ (అశోక్)కు మొదటి నుండి హీరో అవ్వాలనేది ప్రధాన కల. ఈ ప్రాసెస్ లో చాలా మంది దర్శకులను అప్రోచ్ అవుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా అర్జున్ కు ఒక పార్సెల్ వస్తుంది. ఆ పార్సెల్ లో గన్ ఉంటుంది.

అర్జున్ కు గన్ తో ఉన్న లింక్ ఏంటి? ఆ గన్ పంపించింది ఎవరు? హీరో అవ్వాలన్న అర్జున్ కల నెరవేరుతుందా లేదా?

నటీనటులు:

అశోక్ గల్లా హీరో ద్వారా అరంగేట్రం చేసాడు. డ్యాన్సుల్లో, ఫైట్స్ లో అశోక్ కచ్చితంగా అందరినీ ఇంప్రెస్ చేస్తాడు. ఈ క్రైమ్ డ్రామాలో అశోక్ గల్లా ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ చిత్రానికి ప్లస్ పాయింట్ గా నిలిచింది. అలాగే అశోక్ నటన బాగుంది. డైలాగ్ డిక్షన్ కూడా ఇంప్రెస్ చేస్తుంది.

నిధి అగర్వాల్ గ్లామరస్ గా కనిపించింది. అయితే ఆమె స్క్రీన్ ప్రెజన్స్ లిమిటెడ్ గా అనిపిస్తుంది. లీడ్ పెయిర్ గా వీళ్లిద్దరి రొమాంటిక్ ట్రాక్ సరిగా డిజైన్ చేయలేదనిపిస్తుంది. జగపతి బాబు నటన ఇంప్రెస్ చేస్తుంది. రవి కిషన్ గెటప్ బాగుంది కానీ తన పాత్ర కొంచెం లౌడ్ గా ఉంటుంది. తండ్రి పాత్రలో నరేష్ బాగానే చేసాడు. హీరో తల్లి పాత్రలో అర్చన అనంత్ కూడా ఓకే. ఫస్ట్ హాఫ్ లో సత్య పాత్ర హిలేరియస్ గా సాగుతుంది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కామెడీ కూడా బాగుంది.

సాంకేతిక నిపుణులు:

ఇప్పటిదాకా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తన కెరీర్ లో ఎక్కువగా క్రైమ్ డ్రామాస్ చేస్తున్నాడు. హీరో చిత్రం ద్వారా కూడా మరోసారి అదే జోనర్ ట్రై చేసాడు. స్టోరీ సింపుల్ గా ఉన్నా కానీ నరేషన్ అంతా ఫన్ గా ఉండేలా చూసుకున్నాడు. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ కొంచెం ఓవర్ అయినట్లు అనిపిస్తుంది.

ఘిబ్రన్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్ గా సాగింది. సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫీ చిత్రానికి మెయిన్ హైలైట్ గా నిలిచింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ నీట్ గా ఉంది. అమర రాజా ప్రొడక్షన్ హౌజ్ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

పాజిటివ్ పాయింట్స్:

  • కామెడీ నరేషన్
  • అశోక్ గల్లా డ్యాన్స్ అండ్ ఫైట్స్

నెగటివ్ పాయింట్స్:

  • బలమైన కథ లేకపోవడం
  • సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఓవర్ టాప్ కామెడీ

విశ్లేషణ:

మొత్తంగా చూసుకుంటే, హీరో అశోక్ గల్లా డెబ్యూ సినిమాలో తన సామర్ధ్యాన్ని చూపించడానికి చేసిన సినిమా. ఆ పరంగా చూసుకుంటే హీరో ఇంప్రెస్ చేస్తుంది. మొదటి సినిమాగా చూసుకుంటే అశోక్ గల్లా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. నటన పరంగా ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. ఫైనల్ గా, హీరో బాక్స్ ఆఫీస్ వద్ద బిలో యావరేజ్ గా నిలుస్తుంది.

తెలుగుబులెటిన్ రేటింగ్: 2.25/5

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...