Switch to English

లక్ష్య మూవీ రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow
Movie లక్ష్య
Star Cast నాగ శౌర్య, కేతిక శర్మ, జగపతి బాబు
Director ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి
Producer నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
Music కాళ భైరవ
Run Time 2 hr 23 mins
Release డిసెంబర్ 10, 2021

యువ హీరో నాగ శౌర్య ప్రధాన పాత్రలో ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా లక్ష్య. సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా?

కథ:

పార్ధు (నాగ శౌర్య) ఆర్చరీలో ట్రైనింగ్ తీసుకుని ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో పాల్గొనాలని కలలు కనే యువకుడు. ఈ ప్రాసెస్ లో తను ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాడు. విన్నర్ గా నిలవడానికి పార్ధు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? దానిని ఎలా అధిగమించాడు అన్నది ప్రధాన కథ.

నటీనటులు:

నాగ శౌర్య ఈ చిత్రంలో మల్టీపుల్ లుక్స్ లో కనిపించాడు. ట్రైనింగ్ దశలో ఉన్నప్పుడు శౌర్య లుక్ డీసెంట్ గా ఉంది. అయితే సెకండ్ హాఫ్ లో సిక్స్ ప్యాక్ తో కనిపించినప్పుడు అబ్బురపరిచాడు. తన బాడీని చూపిస్తూ చేసిన రెండు యాక్షన్ సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు.

రొమాంటిక్ ఫేమ్ కేతిక శర్మ పర్వాలేదు. అయితే ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అలాగే హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా సెట్ అవ్వలేదు. సీనియర్ నటుడు సచిన్ కెద్కర్ హీరో తాత పాత్రలో రాణించాడు. జగపతి బాబుకు మంచి పాత్ర పడే స్కోప్ ఉన్నా కానీ దాన్ని సరిగా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

సంతోష్ జాగర్లపూడి ఆర్చరీ నేపధ్యంగా తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని క్రీడ ఎంచుకోవడం వరకూ కొత్తగా ఉంది. అయితే నరేషన్ మాత్రం కొన్ని దశాబ్దాల క్రితంలా అనిపిస్తుంది. అలాగే ఆర్చరీ గురించి సరైన డిటైలింగ్ ఇవ్వడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

రామ్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జునైద్ సిద్ధిక్ ఎడిటింగ్ కూడా ఓకే. కాల భైరవ తన సంగీతంతో ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో విఫలమయ్యాడు. ఒక్క పాట కూడా గుర్తించుకునేదిలా లేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెస్ చేస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

పాజిటివ్ పాయింట్స్:

  • నాగ శౌర్య స్క్రీన్ ప్రెజన్స్
  • శౌర్య, సచిన్ కెద్కర్ మధ్య సన్నివేశాలు

నెగటివ్ పాయింట్స్:

  • రొటీన్ నరేషన్
  • సరైన డ్రామా లేకపోవడం

విశ్లేషణ:

ఆర్చర్ కావాలని కలలు కనే యువకుడు పార్ధు జీవితం చుట్టూ తిరిగే కథ లక్ష్య. శౌర్య ఈ చిత్రం కోసం చాలా కష్టపడినట్లు తెరమీద కనిపిస్తోంది కానీ సరైన నరేషన్ పడక అది వేస్ట్ అయినట్లే. లక్ష్యను ఈజీగా స్కిప్ కొట్టేయొచ్చు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5

109 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...